టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ ఆత్మహత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కోడెల ఆత్మహత్యకు గల కారణాలపై నిన్న కుటుంబ సభ్యులను, వ్యక్తిగత సిబ్బందిని విచారించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 8.30 కు కోడెల ఫోన్ నుండి చివరి కాల్ వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు గత రెండు రోజులుగా ఆయన ఫోన్ నుంచి ఎవరెవరికి కాల్స్ వెళ్లాయి..ఎవరెవరి నుంచి కాల్స్ వచ్చాయనే కోణంలో …
Read More »వాడుకుని వదిలేయడం..చంద్రబాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య…!
ఎవరినైనా సరే తన అవసరాలకు వాడుకోవడం..అవసరం తీరాకా…వదిలేయడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య అంటారు. తన అవసరం ఉన్నంత వరకు వారితో సన్నిహితంగా మెలుగుతారు…ఇక వారితో అవసరం తీరిందా..కన్నెత్తి కూడా చూడరు. చేరదీసి, పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు నమ్మకస్తుడిలా ఉంటూ..ఆయనకే వెన్నుపోటు పొడిచి, సీఎం పదవి నుంచి దించేసి, తెలుగు తమ్మళ్లతో చెప్పులు వేయించి, ఆయన మరణానికి కారకుడు అయిన చంద్రబాబు..మళ్లీ ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఓట్ల కోసం …
Read More »ఆ మూడు తప్పులే కోడెలను ముంచాయా..?
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కోడెల మొదట ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు వదంతులు సృష్టించారు. మరోవైపు కోడెల గుండెపోటుతో మరణించారు అంటూ పలువురు చెబుతున్నారు .. తాజాగా కోడెల మృతికి సంబందించి మేనల్లుడు సాయి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్తికోసం కొడుకు శివరామే తండ్రిని హత్య చేశాడని అన్నారు. ఇక అప్పట్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కోడెల పొదిలిలో ఉన్న సమయంలో అతని ఇంట్లో …
Read More »ఇప్పుడు చెప్పు వర్ల రామయ్యా.. కోడెల ఆత్మహత్యకు ఎవరు కారణమో…!
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావు ఆత్మహత్య చేసుకోవడం నిజంగా విషాదకరం… తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన డాక్టర్ శివప్రసాద్ చివరి రోజుల్లో ఎదురైన ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడడం నిజంగా బాధాకరమైన విషయమే. అయితే ఒక సీనియర్ నేత చనిపోయిన విషాదంలో సంయమనం పాటించాల్సిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం కేసులతో వేధించడం వల్లే.. కోడెల ఆత్మహత్య చేసుకున్నాడంటూ…ఇది ప్రభుత్వ హత్య అంటూ విమర్శలు …
Read More »ఫోన్ చేసి పరామర్శించినా, చలో ఆత్మకూరుకు పిలిచినా కోడెల బ్రతికేవారు చంద్రబాబు.. మళ్లీ ఎందుకీ డ్రామాలు.!
తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.. వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా వారి సతీమణికి జరిగిన అన్యాయాన్ని ఎవ్వరు పూడ్చలేరు. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలియచేసి, కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పడం, రాజకీయాలకు తావ్వివకుండా నడచుకోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. అయితే సహజ మరణం కాని పరిస్థితులలో విచారణ కోరడం, ప్రజల్లోని అనుమానాలను నివృత్తి చేయడం …
Read More »కోడెల మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి… ఎన్టీఆర్ ట్రస్ట్ భవనానికి తరలింపు…!
ఉస్మానియా ఆసుపత్రిలో ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయింది. రేపు నరసరావుపేటలో కోడెల అంతక్రియలు జరుగనున్నాయి. ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని తన ఇంటిలో కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబసభ్యులు గమనించి ఆయన్ని బసవతారకం ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మరణించారు. కాగా ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ రోజు ఉదయం కోడెల తన …
Read More »ఏపీ మాజీ స్పీకర్ మృతిపై స్పందించిన పవన్ కల్యాణ్…!
ఏపీ మాజీ స్పీకర్ , టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు అనుమానస్పద మృతి రాజకీయంగా సంచలనంగా మారింది. సీఎం జగన్‌తో సహా, మంత్రి బొత్స, గడికోట శ్రీకాంత్ రెడ్డి వంటి వైసీపీ నేతలతో సహా, పార్టీలకతీతంగా అన్ని పార్టీలతో సహా కోడెల మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో కోడెల మరణం పట్ల తీవ్రదిగ్భాంతి వ్యక్తం …
Read More »మాజీ స్పీకర్ మరణంపై స్పందించిన ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి…!
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు ఈ రోజు ఉదయం అనుమానస్పద స్థితిలో మరణించారు. కోడెల మరణం పట్ల సీఎం జగన్‌తో సహా అన్ని రాజకీయ పక్షాల నాయకులు పార్టీలకతీతంగా సంతాపం తెలుపుతున్నారు. ప్రస్తుతం కోడెల మృతిపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. కోడెల కుటుంబ సభ్యులు ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో చెప్పినట్లు వెస్ట్‌జోన్ డీసీపీ తెలిపారు. …
Read More »కోడెల మృతిపై కేసు నమోదు…బంజారాహిల్స్ పోలీసుల విచారణ…!
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు అనుమానస్పద రీతిలో మరణించిన సంగతి తెలిసిందే. కోడెల గుండెపోటుతో మరణించలేదు..ఆత్మహత్య చేసుకున్నారంటూ…ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు అంటున్నారు. వైసీపీ సర్కార్ కేసులతో వేధించడం వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన బంజారాహిల్స్ పోలీసులు కోడెల ఇంటికి వెళ్లి..ఆయన కుటుంబ సభ్యులను గన్‌మెన్, డ్రైవర్‌ను విచారించారు. ఈ …
Read More »కోడెల మృతి పట్ల సీఎం జగన్ సంతాపం..!
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు అనుమానస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. ఇవాళ తీవ్ర అస్వస్థతకు లోనైన కోడెల శివప్రసాద్‌రావును ఆయన గన్‌మెన్, డ్రైవర్‌లు బసవతారకం ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు చికిత్స చేస్తున్న సమయంలోనే ఆయన మరణించారు. అయితే కోడెల ఆత్మహత్య చేసుకున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన భౌతిక దేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఏపీ మాజీ స్పీకర్ కోడెల మరణం …
Read More »