Home / Tag Archives: politics

Tag Archives: politics

రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారా?

ప్రముఖ నటుడు రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారా? తెరవెనుక అలాంటి ప్రయత్నాలేమైనా జరుగుతున్నాయా? ఇప్పుడు తమిళనాడులో అలాంటి చర్చే నడుస్తోంది. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవితో రజనీకాంత్‌ సమావేశమయ్యారు. చెన్నైలోని రాజ్‌భవన్‌లో సుమారు అరగంటపాటు గవర్నర్‌తో ఆయన పలు అంశాలపై చర్చించారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు రజనీకాంత్‌ను ప్రశ్నించగా ఆయన మర్యాదపూర్వకంగానే గవర్నర్‌ను కలిసినట్లు చెప్పారు. రాజకీయాలపైనా ఇద్దరమూ చర్చించుకున్నామని.. …

Read More »

‘ఉమామహేశ్వరి సూసైడ్‌.. చంద్రబాబు వచ్చాకే ఆ లేఖ మాయం చేశారు’

ఎన్టీఆర్‌ చిన్నకుమార్తె ఉమామహేశ్వరి బలవన్మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు సీబీఐ విచారణ కోరాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎన్టీఆర్‌ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి డిమాండ్‌ చేశారు. సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్రానికి చంద్రబాబు లేఖ రాసి తన నిజాయతీని నిరూపించుకోవాలని సూచించారు. ఆస్తి తగాదాలతో మానసిక వేదనకు గురిచేయడంతోనే ఉమామహేశ్వరి చనిపోయినట్లు తెలుస్తోందన్నారు. తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్‌ ఆఫీస్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో లక్ష్మీపార్వతి మాట్లాడారు. ఎన్టీఆర్‌ కుటుంబాన్ని …

Read More »

కేసీఆర్‌ నిప్పు.. ఆయన్ను ఎవరూ టచ్‌ చేయలేరు: జగదీష్‌రెడ్డి

కేసీఆర్‌ సీఎం అయ్యాకే రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలతో దేశం తలసరి ఆదాయం తగ్గిపోయిందని విమర్శించారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగదీష్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో బాధ్యతా రాహిత్యమైన, విచిత్ర ప్రతిపక్షాలు ఉన్నాయని మండిపడ్డారు. వార్తల్లో ట్రెండింగ్‌ అయ్యేందుకు ప్రతిపక్ష నేతలు పోటీపడుతున్నారని విమర్శించారు. ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు …

Read More »

బీజేపీలో ఈటలది బానిస బతుకు: బాల్క సుమన్‌

మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్‌ అన్నారు. తిన్నింటి వాసాలను ఆయన లెక్కబెడుతున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, కేపీ వివేకానంద్‌తో కలిసి సుమన్‌ మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్‌విశ్వాసఘాతకుడని తీవ్రస్థాయిలో ఆయన ఆరోపించారు. ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఈటల అవినీతికి పాల్పడ్డాడని.. రాబోయే ఎన్నికల్లో ఆయన ఓటమి ఖాయమని చెప్పారు. …

Read More »

కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప కీలక నిర్ణయం

కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్‌ నేత బీఎస్‌ యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. తనస్థానంలో శికారిపుర నియోజకవర్గం నుంచి చిన్నకుమారుడు బీవై విజయేంద్ర పోటీ చేస్తారని చెప్పారు. శికారిపుర ప్రజలు అనేకసార్లు తనను గెలిపించారని.. తనను ఆదరించినట్లుగానే విజయేంద్రను కూడా ఆదరించాలని యడియూరప్ప కోరారు. వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 75 ఏళ్లు దాటిన వారికి టికెట్లు …

Read More »

సీఎం కేసీఆర్‌పై షర్మిల్‌ సెటైరికల్‌ ట్వీట్‌

వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన సీఎం కేసీఆర్‌ చేసిన కామెంట్స్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల సెటైరికల్‌ ట్వీట్‌ చేశారు. భద్రాచలంలో గోదావరి వరదను పరిశీలించిన అనంతరం ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. బాధితులను ఆదుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ‘క్లౌడ్‌ బరస్ట్‌’పై ఆయన కొన్ని కామెంట్స్‌ చేశారు. దీనిలో విదేశీయుల కుట్రలు ఉన్నట్లు చెబుతున్నారని.. ఈ మధ్య గోదావరి పరీవాహక ప్రాంతంలోనూ అలా చేస్తున్నట్లు …

Read More »

స్వయంగా పానీపూరీ అమ్మిన మమతా బెనర్జీ

తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సింప్లిసిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. హవాయి చెప్పులు, కాటన్‌ చీరతో చాలా సింపుల్‌గా కనిపించే ఆమె.. సామాన్య ప్రజలు కనిపిస్తే వారితో ఇట్టే కలిసిపోతారు. ఇటీవల డార్జిలింగ్‌ పర్యటకు మమత వెళ్లగా అక్కడ పానీ పూరీ అమ్మి అందరినీ ఆశ్చర్య పరిచారు. స్వయంగా పానీపూరీ తయారు చేసి తన స్వహస్తాలతో వినియోగదారులకు అందించారు. సీఎం ఏకంగా పానీపూరీ అమ్మే …

Read More »

తెలంగాణలో సూపర్‌ స్పీడ్‌ ఇంజిన్‌: కేసీఆర్‌

రూపాయి విలువ పతనమైందంటూ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని మోడీ గొంతుచించుకుని చెప్పారని.. ఇప్పుడు దాని విలువ ఎందుకు పడిపోయిందో చెప్పాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. గతంలో ఆయన చెప్పిన విషయాన్నే ఇప్పుడు తాము అడుతున్నామన్నారు. కేంద్రంలోని బీజేపీ అసమర్థ విధానాల వల్లే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.80కి పడిపోయిందని విమర్శించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీ, బీజేపీ నేతలపై …

Read More »

ముందస్తుకు బీజేపీ సై అంటే.. మేమూ సై!: తలసాని

తాము మర్యాద ఇచ్చి పుచ్చుకుంటామని.. ఎవరు ఎవరికీ భయపడని టీఆర్‌ఎస్‌ నేత, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళితే తాము కూడా సిద్ధమేనని చెప్పారు. మహారాష్ట్ర తరహా రాజకీయాలు చేస్తే ఒప్పుకోబోమని.. సై అంటే సై అంటామన్నారు. బీజేపీ నేతలు ఆ పార్టీ కార్యవర్గ సమావేశానికి హైదరాబాద్‌ వచ్చారని.. …

Read More »

కేసీఆర్‌లాంటి నాయకుడు దేశానికి కావాలి: యశ్వంత్‌సిన్హా

దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేమని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా అన్నారు. చాలా రోజులుగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ వచ్చిన యశ్వంత్‌ సిన్హా.. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జలవిహార్‌లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే పోరాటం కాదని.. గుర్తింపు కోసం జరిగేది అసలే కాదన్నారు. విశాల భారత పరిరక్షణ కోసం జరిగే …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar