Home / ANDHRAPRADESH / ఇప్పుడు చెప్పు వర్ల రామయ్యా.. కోడెల ఆత్మహత్యకు ఎవరు కారణమో…!

ఇప్పుడు చెప్పు వర్ల రామయ్యా.. కోడెల ఆత్మహత్యకు ఎవరు కారణమో…!

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావు ఆత్మహత్య చేసుకోవడం నిజంగా విషాదకరం… తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన డాక్టర్ శివప్రసాద్ చివరి రోజుల్లో ఎదురైన ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడడం నిజంగా బాధాకరమైన విషయమే. అయితే ఒక సీనియర్ నేత చనిపోయిన విషాదంలో సంయమనం పాటించాల్సిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం కేసులతో వేధించడం వల్లే.. కోడెల ఆత్మహత్య చేసుకున్నాడంటూ…ఇది ప్రభుత్వ హత్య అంటూ విమర్శలు చేయడం..అసహ్యాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి కోడెలపై నమోదు అయిన కేసులన్నీ రాజకీయ కేసులు కావు. గత ఐదేళ్లలో కోడెల ఫ్యామిలీ అవినీతి, అరాచకాలకు బలైపోయిన బాధితులు పెట్టిన కేసులు. ఏపీ మాజీ స్పీకర్ కావడంతో ఈ కేసులు నమోదు చేయడానికి తొలుత పోలీసులు కూడా తపటాయించిన పరిస్థితి..ప్రభుత్వం కూడా తొలుత ఈ కేసులపై ప్రత్యేకంగా చొరవ తీసుకుంది లేదు…అయితే రోజూ బాధితులు వందలాదిగా పోలీస్‌స్టేషన్లకు వచ్చి ఫిర్యాదులు చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో ప్రభుత్వం చేసింది ఏం లేదనే చెప్పాలి. కోడెలపై నమోదు అయిన కేసుల విషయంలో విచారణ జరిపిన హైకోర్ట్ వారిని కోర్టు ముందుకు లొంగిపొమ్మని ఆదేశాలు జారీ చేసింది. అయినా ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ ఆయన్ని అరెస్ట్ చేయడానికి తొందర పడలేదు. ఒక రాజ్యాంగబద్ధమైన పదవి నిర్వహించిన నాయకుడిగా, ఒక సీనియర్ నేతగా గౌరవం ఇచ్చి..ఆయనంతట ఆయనే లొంగిపోతారని పోలీసులు కూడా వేచి చూశారు. ఇందులో ప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు.

అసలు కే ట్యాక్స్ విషయంలోకానీ, అసెంబ్లీ ఫర్నీచర్ విషయంలో కాని, ప్రత్యర్థి పార్టీల నుంచి రాజకీయపరమైన విమర్శలు సహజం. కానీ సొంత పార్టీ నేతలే ఆయన్ని తప్పు పట్టారు. అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు విషయం కోడెల వంటి సీనియర్ నేతకు తలవంపులు తెచ్చింది. ఈ విషయంలో టీడీపీ పరువు బజారున పడింది. కోడెల వంటి సీనియర్ నేతలు ఎవరైనా ఇబ్బందుల్లో పడితే..వారిని కాపాడుకోవడానికి ఏ నాయకుడు అయినా ప్రయత్నిస్తాడు..కానీ చంద్రబాబు లాంటి వారు మాత్రం అలాంటి వారిని వదిలించుకోవడానికే ప్రయత్నిస్తాడు. ఎందుకంటే..వాడుకుని వదిలేయడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా…30 ఏళ్లకు పైగా అనుభవం కలిగి ఉండి, పార్టీ వ్యవస్థాపక సభ‌్యులలో ఒకడైన కోడెల వంటి సీనియర్ నేతను బాబు వాడుకున్నట్లు ఇంకెవరు వాడుకోలేదు. ఎన్టీఆర్ హయాంలో జరిగిన రంగా హత్యలో చంద్రబాబు కోడెలను ఉపయోగించుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. విధేయతకు మారుపేరైనా కోడెల పార్టీ కోసం ఎంతకైనా తెగించేవారు..ఎంతకైనా దిగజారేవారు. గత అసెంబ్లీలో చంద్రబాబు నిస్సిగ్గుగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాక్కుని, అందులో నలుగురికి మంత్రిపదవులు ఇచ్చినా…స్పీకర్‌గా రాజ్యాంగ బద్ధ పదవిలో ఉండి ఫిరాయింపులపై చర్య తీసుకోకుండా నాలుగేళ్లు కాలాయాపన చేశారు. అంతే కాదు ప్రతిపక్ష నాయకుడు అని కూడా చూడకుండా వైయస్ జగన్‌ను మాట్లాడనీయకుండా పదే పదే మైకులు కట్ చేస్తూ, పూర్తిగా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. గత ప్రభుత్వం చివరి సమావేశంలో కూడా చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకున్న ఏకైక స్పీకర్… కోడెల. ఒక స్పీకర్‌గా కాకుండా ఫక్తు టీడీపీ నేతగా వ్యవహరించిన కోడెల ఆ పదవికి మచ్చ తెచ్చారు. చనిపోయిన వ్యక్తి గురించి ఇలా మాట్లాడడం సబబు కాకపోయినా..చెప్పక తప్పని పరిస్థితి. ఒక స్పీకర్ ఎలా ఉండకూడదు అంటే..అన్ని వేళ్లు కోడెల వైపే చూపిస్తాయి.

స్పీకర్‌గా కోడెల చేసిన పనులన్నీ చంద్రబాబుకు లాయల్టీగా చేసినవే. పార్టీ కోసం, బాబు కోసం అంతలా తాపత్రయపడిన కోడెల ఇబ్బందుల్లో ఉంటే ఆయన్ని మానసికంగా వేధించింది ఎవరూ..అంటే అది టీడీపీనే అని చెప్పాలి. అసెంబ్లీ తరలింపు విషయం ఏపీలో రాజకీయంగా రచ్చ అయింది. ఈ ఘటనలో కోడెల తీవ్ర అవమానాలపాలయ్యారు. అలాంటప్పుడు అండగా ఉండాల్సిన పార్టీనే స్వయంగా ఆయన్ని తప్పు పట్టింది. కోడెల ఫ్యామిలీ అవినీతి, అక్రమాలు పార్టీకి తలెత్తుకోలేని పరిస్థితి తెచ్చిందని భావించిన చంద్రబాబు ఆయన్ని స్వయంగా వర్ల రామయ్య లాంటి నేతలతో తిట్టించాడు. కోడెల అసెంబ్లీ ఫర్నీచర్‌ను తన ఇంటికి, షాపుకు తరలించడం వల్ల టీడీపీ ప్రతిష్ట మసకబారిందని వర్ల రామయ్య ప్రెస్‌మీట్ పెట్టి మరీ తిట్టాడు. అసెంబ్లీలో ఫర్నిచర్ తీసుకెళ్లడం ముమ్మాటికీ తప్పేనని, కోడెల అలా చేయకుండా ఉంటే బావుండేదని, అసలు ఎవరిని అడిగి ఫర్నిచర్ తీసుకెళ్లారని.. అసెంబ్లీ కార్యదర్శికి చెప్పి తీసుకెళ్లారా..? అంటూ వర్ల కోడెలపై విరుచుకుపడ్డాడు. ఆ ప్రెస్‌మీట్ అన్ని ఎల్లోమీడియా ఛానళ్లలో వచ్చేలా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశాడు. అంతే కాదు కోడెల, ఆయన కొడుకు, కోడలును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు లోకేష్ వార్తలు లీక్ చేయించాడు. ఇలా సొంత పార్టీలో ఎదురైన అవమానంతో కోడెలకు తల ఎత్తుకోలేని పరిస్థితి ఎదురైంది.

ఒక పక్క చంద్రబాబు కోడెలకు గత 100 రోజుల్లో ఒక్కసారి కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. ఛలో ఆత్మకూరు అంటూ పల్నాడు డ్రామా మొదలుపెట్టి గుంటూరులో పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయించిన చంద్రబాబు కనీసం కోడెలను పిలిపించిందిలేదు. పార్టీ నేతలు కూడా కోడెలను కన్నెత్తి చూసింది లేదు..పలకరించిందిలేదు. సొంతపార్టీలో ఎదురైన అవమానాలతో కోడెల గత కొద్ది రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఒక పక్క కేసులు..మరో పక్క చంద్రబాబు పట్టించుకోకపోవడం, సొంత పార్టీ నేతలే ఛీత్కరించుకోవడం మరోపక్క కుటుంబ కలహాలు కోడెలను మానసికంగా కుంగదీసింది. రాజకీయంగా పరువు పోయిందని భావించిన కోడెల విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడడం విషాదకరం. అయితే చంద్రబాబు మాత్రం ఇది ప్రభుత్వం చేసిన హత్య అని శవరాజకీయాలకు పాల్పడడం ఆయనలోని నీచబుద్ధికి అద్దం పడుతుంది. ఒక సీనియర్ నేతను సొంత పార్టీ నేతల చేతే తిట్టించి.. ఓ దొంగగా చిత్రీకరించి, అడగడుగునా ఘోరంగా అవమానించి ఆయన ఆత్మహత్యకు పాల్పడేలా చేసింది చంద్రబాబు, టీడీపీ నేతలు మాత్రమే. ఇప్పుడు చెప్పు వర్ల రామయ్య..ప్రెస్‌ మీట్ పెట్టి కోడెల అసెంబ్లీ ఫర్నీచర్‌ను దొంగిలించడం ముమ్మూటికి తప్పే అని తిట్టావు..ఆయన్ని ఘోరంగా అవమానించావు..ఇప్పుడు ప్రభుత్వ హత్య అంటున్నావు… ఎవరు కోడెల ఆత్మహత్యకు కారణమో ప్రెస్‌మీట్ పెట్టి చెప్పు అంటున్నారు పల్నాడు ప్రజలు.