త్వరలో జరగనున్న స్థానిక సంస్థల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో అన్ని జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం జరగనుంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలిసింది. అలాగే మూడు రాజధానుల ప్రకటనపై ఆయా జిల్లాలోని పరిస్థితులను సీఎం జగన్‌కు మంత్రులు వివరించనున్నట్లు సమాచారం. …
Read More »మొన్న బోడె..నేడు గద్దె..ఈ ఒక్క రోజు నిరాహార దీక్షలేంటీ బాబు…జనాలు నవ్వుతున్నారు..!
ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ ప్రకటన, జీఎన్‌రావు, బీసీజీ కమిటీల నివేదికలకు వ్యతిరేకంగా రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల రైతులు 18 రోజులుగా ధర్నాలు, ర్యాలీలతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అయితే రాజధాని గ్రామాల్లో జరుగుతున్న ఆందోళనా కార్యక్రమాలను టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా, రాజధాని ప్రాంతంలోని టీడీపీ నేతలు పథకం ప్రకారం నడిపిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇక రాజధానిలో జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో చంద్రబాబుతోసహా, …
Read More »అమరావతిలో టీడీపీ రాజకీయంపై ఏపీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు…!
ఏపీకి మూడు రాజధానుల ప్రకటనపై వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, సీమ నేతలు విశాఖ, కర్నూలులో రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ సీనియర్ నేత, ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం విశాఖలో రాజధాని ఏర్పాటును స్వాగతిస్తూ భావోద్వేగానికి గురవుతున్నారు. అదే సమయంలో అమరావతిలో చంద్రబాబు చేయిస్తున్న ఆందోళనలపై తమ్మినేని మండిపడుతున్నారు. రెండు రోజుల క్రితం ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై మాట్లాడుతూ.. ఇన్నాళ్లకు జగన్మోహన్‌రెడ్డి కారణంగా …
Read More »చంద్రబాబు సొంత జిల్లా నుంచే అమ్మఒడి ప్రారంభం..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘అమ్మ ఒడి’ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 9వ తేదీన చిత్తూరులో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తారని అన్నారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. రాజధాని అంశంపై ప్రభుత్వం వేసిన రెండు కమిటీల నివేదికలు అందాయని, ఈ విషయమై హైపవర్ కమిటీలో చర్చిస్తామన్నారు. …
Read More »చంద్రబాబుపై మరోసారి నిప్పులు చెరిగిన మంత్రి కొడాలి నాని…!
అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని గ్రామాల రైతులను రెచ్చగొడుతూ ఆందోళనలు చేయిస్తున్నాడు. చంద్రబాబు రాజధాని రాజకీయంపై వైసీపీ మంత్రులు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబుకు వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల ప్రయోజనాల కంటే…తన సామాజికవర్గ ప్రయోజనాలే ముఖ్యమై పోయాయని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా మంత్రి కొడాలి నాని డోకిపర్రులో మాట్లాడుతూ.. చంద్రబాబు ఓ పగటి వేషగాడు, ఓ పిట్టల దొర అంటూ విరుచుకుపడ్డారు. …
Read More »చంద్రబాబు ” పనికిమాలిన” వ్యాఖ్యలకు జీఎన్‌రావు అదిరిపోయే కౌంటర్…!
ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయచ్చు అంటూ జీఎన్‌రావు కమిటీ నివేదిక ఇచ్చిన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ…. జీఎన్ రావు పనికిమాలిన అధికారి అని.. ఆయన పేరుతో కమిటీ వేశారని దూషించాడు.. జీఎన్‌రావు ప్రభుత్వ శాఖల్లో సమర్థవంతంగా పని చేసిన సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన నేతృత్వంలో రాజధాని అంశంపై వైసీపీ ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. ఈ మేరకు …
Read More »బ్రేకింగ్..ఆ కేసులో టీడీపీ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడికి ముందస్తు బెయిల్..!
తన తమ్ముడు సన్యాసిపాత్రుడు, ఆయన కొడుకుతో జరిగిన జెండా వివాదంలో పోలీసులను దూషించిన మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిపై నర్సీపట్నంలో కేసు నమోదు అయిన సంగతి విదితమే. గత కొద్ది రోజులుగా అరెస్ట్ భయంతో నర్సీపట్నం వదలిన అయ్యన్న తన చిన్న కుమారుడి పెళ్లిపనుల పేరుతో ఇతర ప్రాంతాల్లో మకాం వేశారు. అయితే నర్సీపట్నంకు వెళితే పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అయ్యన్న అజ్ఞాతంలో ఉంటూనే ముందస్తు బెయిల్ …
Read More »బ్రేకింగ్..టీడీపీకి రాజీనామా చేసిన లోకేష్ సన్నిహితుడు..!
అమరావతిపై రాజకీయ రచ్చ జరుగుతున్న వేళ…టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజధాని ప్రాంతంలో వరుస షాక్‌లు కలుగుతున్నాయి… రాజధాని ప్రాంతమైన కృష్ణా, గుంటూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు, కీలక నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేయగా.. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కూడా రాజీనామా బాటలో ఉన్నారు. ఇక బెజవాడలో కీలక యువనేత అయిన దేవినేని అవినాష్ ఇటీవల …
Read More »ఏంటీ జేసీ.. కేంద్రం జగన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలా..ఓసినీ కామెడీ తగలెయ్యా..!
టీడీపీ వివాదాస్పద నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఓవరాక్షన్‌కు అడ్డూ అదుపూ లేకుండా పోయింది…నేను మాజీ ఎంపీని, సీనియర్ నాయకుడిని..అలాంటిది బెయిల్ ఇవ్వకుండా కావాలనే నన్ను 7 గంటలు స్టేషన్‌లో ఉంచుతారా..వెంటనే కేంద్రం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని జగన్ సర్కార్‌ను బర్తరఫ్ చేయాలంటూ వితండవాదం చేస్తున్నారు జేసీ సారూ..ఇంతకీ జరిగిందేదంటే..ఇటీవల బాబుగారు అనంతపురం పర్యటించారులెండీ…ఇంకేముంది జేసీ గారు కల్లుతాగిన కోతిలా చెలరేగిపోయారు. పోలీసులు జగన్ …
Read More »విశాఖలో రాజధాని ఏర్పాటుపై బీజేపీ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు..!
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై వివిధ రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ బీజేపీలో గందరగోళం నెలకొంది. ఎంపీ సుజనా చౌదరి, బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వంటి నేతలు అమరావతి నుంచి రాజధానిని అంగుళం కూడా తరలిస్తూ వూరుకోమంటూ ప్రభుత్వానికి వార్నింగ్‌లు ఇస్తుంటే…జీవియల్, సోమువీర్రాజు, సీఎంరమేష్, పురంధేశ్వరీ వంటి నేతలు మాత్రం మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తున్నారు. తాజాగా మూడు రాజధానుల విషయంపై …
Read More »