Home / Tag Archives: pongal

Tag Archives: pongal

ఏపీఎస్ఆర్టీసీకి కాసుల వర్షం

ఈ సంక్రాంతి పండుగ ఏపీఎస్ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. ఈ నెల 7 నుంచి 18 వరకు రూ. 144 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు తెలిపారు. 5,422 ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసినట్లు వివరించారు. అత్యధికంగా ఈ నెల 17వ తేదీన ఒక్కరోజే రూ.15.40 కోట్లు వచ్చిందన్నారు. ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులకు ధన్యవాదాలు తెలిపారు.

Read More »

అరిసెలు వల్ల లాభాలెన్నో…?

సంక్రాంతి పండుగ సమయంలో ప్రతి తెలుగింట్లో 3 తప్పనిసరిగా ఉండే పిండివంటకం అరిసెలు. వీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కొత్త బియ్యపు పిండి, నూనె, బెల్లం, నువ్వులతో అరిసెలు తయారు చేస్తారు. బెల్లం రక్తాన్నిశుద్ధి చేయడంతోపాటు శరీరంలో ఉన్న వ్యర్థాలను తొలగిస్తుంది. కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఐరన్తో పాటు పలు పోషకాలు శరీరానికి లభిస్తాయి. బియ్యం పిండి శరీరాన్ని వేడిగా ఉంచుతుంది.

Read More »

సంక్రాంతి నాడు గొబ్బెమ్మలెందుకెడతారో తెలుసా..?

సంక్రాంతికి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఎంతో అందంగా ముగ్గులు వేసి రంగులతో అలంకరించి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మను గౌరిమాతగా కొలుస్తారు. తయారు చేయడానికి ఆవు పేడను ఉపయోగిస్తారు. సాధారణంగా వీటిని పెళ్లికాని అమ్మాయిలు తయారు చేస్తే త్వరగా పెండ్లి అవుతుందని నమ్ముతారు. పేడతో చేసే గొబ్బెమ్మల్లో క్రిమి కీటకాలను నాశనం చేసి, ప్రకృతికి మేలు చేసే గుణాలు ఉన్నాయని సైన్స్ చెబుతోంది.

Read More »

TSRTC మరో Good News

తెలంగాణ రాష్ట్రం నుండి పలు ప్రాంతాలకెళ్లే ప్రయాణికుల కోసం సంక్రాంతి పండుగకు 4,318 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ  ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ రోజు శుక్రవారం 7 నుంచి 14 వరకు రాష్ట్రంలోని అన్ని ముఖ్య ప్రాంతాలతో పాటు ఏపీకి ఈ బస్సులు నడుస్తాయని తెలిపింది. రాష్ట్రంలో 3,334 బస్సులు, ఏపీకి 984 బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. అడ్వాన్స్ రిజర్వేషన్లు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. …

Read More »

సంక్రాంతి బరిలో రాజశేఖర్ చిత్రం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘శేఖర్’. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది. ఈ చిత్రం సంక్రాంతి బరిలో దిగనున్నట్లు సమాచారం. ఈమేరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది వెండితెరపై సందడి చేస్తుందా.. OTT బాట పడుతుందా? అనేది తేలాల్సి ఉంది. మలయాళంలో విజయవంతమైన ‘జోసెఫ్’కు రీమేక్ రూపొందుతోన్న చిత్రమిది.

Read More »

ప్రయాణికులకు APSRTC శుభవార్త

క్రిస్మస్, సంక్రాంతి పండగకు దూర ప్రాంతాలు వెళ్లే ప్రయాణికులకు APSRTC శుభవార్త చెప్పింది. ప్రస్తుతం 30 రోజులుగా ఉన్న ముందస్తు రిజర్వేషన్ గడువును 60 రోజులకు పెంచింది. ఈ నిర్ణయం నేటి నుంచి అమల్లోకి రానుంది. కాగా.. పండగ సీజన్లలో చివరి నిమిషంలో బస్ టికెట్లు బుక్ చేసుకున్నవారికి అదనపు ఛార్జీల్ని RTC వడ్డించేది. తాజా నిర్ణయం వల్ల ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఆ ఛార్జీల బెడద …

Read More »

సంక్రాంతి వెనుక ఎవరికీ తెలియని 5కథలు

సంక్రాంతి అనగానే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండుగలో అంతకుమించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. అవేంటో మీరే చూడండి… – పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి, ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్లందరినీ బూడిదగామార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ, వారి …

Read More »

తెలంగాణలో సంక్రాంతి సందర్భంగా 4980 అదనపు బస్సులు

తెలంగాణలో సంక్రాంతి పండుగ సందర్భంగా 4980 అదనపు బస్సులు నడుపుతున్నట్లు టీఎస్‌ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ రీజనల్‌ మేనేజర్‌ బీ వరప్రసాద్‌ తెలిపారు. ఎంజీబీఎస్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 14 వరకు స్పెషల్‌ బస్సులను రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు 3,380.. ఆంధ్రప్రదేశ్‌కు 1600ల బస్సులు నడిపేందుకు ప్రణాళికను రూపొందించినట్టు చెప్పారు. తిరుగు ప్రయాణానికి ముందస్తుగానే సీట్‌ రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కల్పించినట్టు చెప్పారు. ఈ …

Read More »

సంక్రాంతికి 4,940 ప్రత్యేక బస్సులు..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రానున్న సంక్రాంతి పండుగ పూట నెలకొనున్న రద్ధీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బస్సులను నడపాలనే నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,940ప్రత్యేక బస్సులను నడిపించాలని ఆర్టీసీ సిద్ధమవుతుంది.రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నుండి అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోని పలు రూట్లల్లో ఈ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. జనవరి పదో తారీఖు నుండి జనవరి …

Read More »

ఏపీలో సంక్రాంతి సెలవులు ఖరారు

ఏపీలో సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు జనవరి పదో తారీఖు నుంచి జనవరి ఇరవై తారీఖు వరకు సంక్రాంతి సెలవులు అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. మిషనరీ పాఠశాలలకు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు నుంచి జనవరి ఒకటో తారీఖు వరకు దాకా విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్లో ప్రకటించింది. ఇక జూనియర్ కళాశాలలకు జనవరి పదకొండు తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు …

Read More »