సంక్రాంతికి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఎంతో అందంగా ముగ్గులు వేసి రంగులతో అలంకరించి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మను గౌరిమాతగా కొలుస్తారు.
తయారు చేయడానికి ఆవు పేడను ఉపయోగిస్తారు. సాధారణంగా వీటిని పెళ్లికాని అమ్మాయిలు తయారు చేస్తే త్వరగా పెండ్లి అవుతుందని నమ్ముతారు.
పేడతో చేసే గొబ్బెమ్మల్లో క్రిమి కీటకాలను నాశనం చేసి, ప్రకృతికి మేలు చేసే గుణాలు ఉన్నాయని సైన్స్ చెబుతోంది.