అంతర్జాతీయ మార్కెట్లో బంగారు ధరలు క్షీణించాయి. అయితే మరో వైపు వెండి ధరలు పెరిగాయి. బంగారం ఔన్స్ కు ధర 0.08%కి పడింది. అదే వెండి ధర ఔన్స్ కు 0.33% పెరిగింది. హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. వంద తగ్గి మూతం రూ.39,250ల నుండి 39,150కి తగ్గింది. మరోవైపు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.140తగ్గి …
Read More »రాష్ట్రస్థాయి పురపాలక సదస్సు ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పురపాలక సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లు, చైర్‌పర్సన్లు, కమిషనర్లు పాల్గొన్నారు. పట్టణ ప్రగతి కార్యాచరణతో పాటు విధివిధానాలు ఖరారు చేయనున్నారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులకు సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం చేయనున్నారు.
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరి,బంధువులు మృతి
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అల్గునూర్ శివారులోని కాకతీయ కాల్వ వద్ద మరో కారు ప్రమాదం కలకలం రేపింది. మొన్న ఆదివారం రాత్రి కాల్వలో బైకు పడిన ఘటనలో మహిళ భౌతికకాయం కోసం కాల్వకు నీటిని నిలిపేయగా.. సోమవారం కాల్వలో తేలిన ఓ కారులో ముగ్గురి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. వీరం తా పెద్దపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సోదరి కుటుంబ సభ్యులుగా గుర్తించిన పోలీసులు వారికి …
Read More »గుండె పోటుతో మాజీ ఎంపీ మృతి
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ,ప్రముఖ బెంగాలీ నటుడుతపస్‌పాల్( 61) ఈ రోజు మంగళ వారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఆయన తన కుమార్తెని చూసేందుకు ఇటీవల ముంబై వెళ్లారు. అక్కడ నుండి కోల్‌కత్తాకి విమానంలో తిరిగి వస్తున్న క్రమంలో ఛాతిలో నొప్పి వస్తుందని సిబ్బందికి తెలిపాడు. దీంతో వెంటనే వారు అతనిని జుహూలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. ఆయనకి భార్య నందిని, కుమార్తె …
Read More »ఘనంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు
తెలంగాణ రాష్ట్ర సీఎం ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అరవై ఆరో పుట్టిన రోజు వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ,అభిమానులు, కార్యకర్తలు,నేతలు మొక్కలను నాటి తమ అభిమాన నాయకుడిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అంతే కాకుండా పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, వివిధరంగాల ప్రముఖులు, టీఆర్‌ఎస్ …
Read More »ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా నల్గొండలో కొవ్వొత్తి ర్యాలీ
ఫ్లోరెన్స్ నైటింగేల్ 200 వ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 నర్సుల సంవత్సరంగా ప్రకటించిన సందర్భంగా శనివారం కొవ్వొత్తి ర్యాలీని నల్గొండ లో నిర్వహించారు* కొనేదెటి మల్లయ్య ఫౌండర్ చైర్మన్ దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మరియు నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జెండా ఊపి ప్రారంభించారు. శాంతి నగర్ దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుండి క్లాక్ టవర్ వరకు కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. కొనేదెటి …
Read More »ఎన్టీఆర్ పై పవన్ ప్రశంసలు
జనసేన అధినేత ,ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు.. దివంగత మాజీ సీఎం నందమూరి తారకరామారావుపై ప్రశంసలు కురిపించారు. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గ కార్యకర్తలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ” రాజకీయాల్లో ఓటమి అనేది సహజం. ఓటమికి కృంగిపోయే మనస్తత్వం తనది కాదు అని ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” పార్టీ …
Read More »త్రివిక్రమ్ శ్రీనివాస్ కు లీగల్ నోటీసులు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దర్శకుడు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో . ఈ చిత్రం విడుదలైన దగ్గర నుండి పలు సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుంది. అంతేకాకుండా బాక్స్ ఆఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ చిత్రం ఆనందంలో ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కు లీగల్ నోటీసులు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. అల వైకుంఠపురములో సినిమా …
Read More »మూడోసారి సీఎం గా అరవింద్ కేజ్రీవాల్
ఇటీవల విడుదలైన ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన ఆప్ మొత్తం అరవై రెండు స్థానాల్లో ఘనవిజయం సాధించింది. దీంతో వరుసగా మూడో సారి సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ చేత లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ధన్యవాద్ ఢిల్లీ పేరుతో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వీవీఐపీలతో పాటుగా పెద్ద ఎత్తున …
Read More »చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో దొరికిన సొమ్ము ఎంత..?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఇటీవల ఐటీ దాడులు జరిగిన సంగతి విదితమే. ఈ ఐటీ దాడుల్లో మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో దాదాపు రెండు వేల కోట్ల అవినీతి సొమ్ము దొరికిందని మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. అయితే ఐటీ దాడుల్లో దొరికిన సొమ్ముపై సంబంధిత అధికారులు ప్రకటన చేశారు. శ్రీనివాస్ ఇంట్లో రూ.2.63లక్షల నగదు,పన్నెండు …
Read More »