తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం,నల్లబెల్లి మండలంలోని నూతనంగా ఏర్పాటైన గ్రామపంచాయితీ అయిన కొండాయిలుపల్లి గ్రామం ఆదర్శంగా నిలిచింది.ఈ గ్రామమంతా ఐక్యతగా రానున్న వినాయకచవితి నేపద్యంలో ఒకేచోట పండుగ జరుపుకుంటామని ఒకే విగ్రహం ఏర్పాటు చేసుకుంటామని,అది కూడా పర్యావరణానికి హాని చేయని మట్టి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని గ్రామపంచాయితి తీర్మాణం చేసింది. ఇటివల సిద్దిపేట లోని మిట్టపల్లి గ్రామంలో తొలిసారి ఈ తీర్మాణం చేసారు. రాష్ట్రంలోనే ఈ తీర్మాణం …
Read More »రెండు కోట్లకు చేరిన గ్రీన్ ఛాలెంజ్
హరా హై తో భరా హై(పచ్చగా ఉంటే ఇంపుగా ఉంటుంది) అంటూ గత ఏడాది మొదలైన గ్రీన్ ఛాలెంజ్ రెండు కోట్ల మొక్కలు నాటే దాకా చేరుకుంది. ఒకరు మొక్కనాటి మరో ముగ్గురు మొక్కలు నాటి, సంరక్షించేలా రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. తాను స్వయంగా మొక్క నాటి, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ నరసింహన్, నటుడు నాగార్జున ను …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టు మరో ఘనత
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మరో ఘనతను సొంతం చేసుకున్నది. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా జగద్విఖ్యాతి పొందిన కాళేశ్వరం ప్రాజెక్టు.. తాజాగా అమెరికాలోని ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్‌స్కేర్‌లోని భారీ తెరపై కాంతులీనింది. తెలంగాణ ఇంజినీరింగ్ ఘనతను ప్రపంచానికి చాటిచెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ నిర్మించిన గాయత్రి పంప్‌హౌస్ విజువల్స్‌ను టైమ్స్‌స్కేర్ కూడలిలోని …
Read More »ఆ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో అర్జున్ రెడ్డి..!-హీరోయిన్ క్లారీటీ..!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం యువతలో ముఖ్యంగా యువతీ గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న పేరు..అర్జున్ రెడ్డి మూవీతో యువత మదిని దొచుకుంటే కామ్రేడ్ మూవీతో మహిళా ప్రేక్షకుల మదిలో సువర్ణక్షరాలతో తన పేరును లిఖించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈ యంగ్ హీరో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని ఫిల్మ్ నగర్లో వ్యాప్తిచెందుతున్న వార్తలు. ఇటు సోషల్ మీడియా.. అటు ప్రింట్ అండ్ …
Read More »బాబు & లోకేశం నయా డ్రామాలు..!
ఇటీవల జరిగిన నవ్యాంధ్ర సార్వత్రిక ఓడిపోయినప్పట్నుంచి మాజీ ముఖ్యమంత్రి,ప్రతిపక్ష నేత,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,అతని తనయుడు ,మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేశ్ నాయుడు సింపతీ కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. పోయిన ప్రజామద్దతును కూడగట్టుకునేందుకు, జనాల నోళ్లలో నానేందుకు వీళ్లిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామాలు ఒకటి రెండు అని చెప్పలేం. ఫలితాలు వచ్చిన వెంటనే ఓదార్పు డ్రామాలు ప్రారంభించారు. అవి బెడిసికొట్టిన వెంటనే ఇంకోటి.. ఆ వెంటనే …
Read More »సైరా టీజర్ విడుదలకు ముహుర్తం ఖరారు
సీనియర్ నటుడు,మెగాస్టార్ చిరంజీవి కెరియర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు వంటి టాప్ స్టార్స్ నటిస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ …
Read More »సల్మాన్ నన్ను పెళ్ళి చేసుకోబోతున్నారు-నటి సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ కండల వీరుడు,స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తనను పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి జరీన్ ఖాన్ ఇలాంటి ఫన్నీ కామెంట్ చేశారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె సినిమాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘మీపై మీరే ఓ రూమర్ సృష్టించాలి. కానీ ఆ రూమర్ చాలా వైరల్ అవ్వాలి’ అని విలేకరి ఆమెకు ఓ ప్రశ్న వేశారు. ఇందుకు జరీన్ స్పందిస్తూ.. …
Read More »టీడీపీకి యామిని గుడ్ బై!
నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి బిగ్ షాక్ తగిలింది. ఈ క్రమంలో పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు బీజేపీ చేరారు. తాజాగా ఆ పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని కూడా టీడీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. యామిని బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను యామిని కలిసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా …
Read More »ఈ నెల 20న మంత్రి వర్గ విస్తరణ
ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది మంత్రి వర్గ విస్తరణ అని ఎదురుచూస్తున్న ఆశావాహులకు శుభవార్త ఇది. ఇటీవల అధికారాన్ని చేపట్టిన బీజేపీ ఈ నెల ఇరవై తారీఖున మంత్రి వర్గ విస్తరణ చేయనున్నట్లు కర్ణాటక సీఎం యడియూరప్ప తెలిపారు. బీజేపీ చీఫ్ అమిత్ షా ఆమోదముద్రతో.. ఆగస్ట్ 20వ తేదీ మధ్యాహ్నం కేబినెట్ విస్తరణ చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ఆధారంగా మొత్తం 34 మందిని మంత్రులుగా …
Read More »తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో రాఖీ పండుగ సంబరాలు..
తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో దోహా లోని ఇండియన్ కల్చరల్ సెంటర్ లో రాఖీ పండుగ సంబరాలు జరిగాయి.ఈ సంధర్భంగా ఖతర్ జాగృతి సభ్యులు నందిని అబ్బగౌని, స్వప్న చిరంశెట్టి గారు హజరైన వారందరికీ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ జాగృతి ఖతార్ అధ్యక్షురాలు నందిని అబ్బగొని, ప్రధాన కార్యదర్శి వినాయక్ చెన్న గారు మాట్లాడుతూ వృత్తి రీత్యా ,ఉపాధి కోసం సముద్రాలు దాటి ఊరుని, కుటుంబాన్ని , …
Read More »