కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద, మధ్య తరగతి వర్గాలకు కొండంత అండగా నిలుస్తున్నాయని పరకాల శాసన సభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ పేదింటి ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక చేయూతనందించే బృహత్తర పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం నందనాయక్ తండాకు చెందిన ఒకరికి , గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ 15వ …
Read More »వర్షప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటన
వర్షప్రభావిత ప్రాంతాల్లో గురువారం సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వడగండ్లు, వర్షాలకు పలు జిల్లాల్లో తీవ్రస్థాయిలో పంటలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో సీఎం పర్యటిస్తారు. ఈ సందర్భంగా నష్టపోయిన పంటల్ని స్వయంగా పరిశీలించనున్నారు. అదే విధంగా చేతికొచ్చిన పంటల్ని పోగొట్టుకొని దుఃఖంలో ఉన్న రైతులకు సీఎం భరోసా ఇవ్వనున్నారు. భారీ వర్షాలు కురిసిన వెంటనే సీఎం కేసీఆర్ ఆదేశాల …
Read More »వైరల్ అవుతున్న మంత్రి కేటీఆర్ ట్వీట్
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరుష పదాలతో ట్వీట్ చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ లో మాత్రం ఏకంగా ముఖ్యమంత్రి, మంత్రులను అసభ్యమైన పదజాలంతో దుర్భాషలాడుతూ.. అవమానకరంగా మాట్లాడుతున్నా సహిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కన్నడ నటుడు చేతన్ ను అరెస్టు చేసి 14 రోజులు రిమాండ్‌కు తరలించిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణలోనూ …
Read More »మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకనీ మృతి
జాతిపిత మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకనీ (89) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం ముంబయిలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఉషా గోకనీ గత ఐదేండ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. రెండేండ్లుగా మంచానికే పరిమితమయ్యారు. ముంబయిలోని గాంధీ స్మారక నిధి కి గతంలో ఆమె చైర్ పర్సన్‌గా పని చేశారు. గాంధీ స్థాపించిన వార్ధా సేవాగ్రామ్ ఆశ్రమం లో గోకనీ బాల్యం గడిచింది.
Read More »మళ్లీ పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు
దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. గత నాలుగు రోజులుగా వెయ్యి చేరువలో కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,03,831 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,134 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా …
Read More »ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉగాది శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలుగింటి నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా.. ప్రజలంతా ప్రగతిపథంలో ముందుకు సాగాలని కవిత పేర్కొన్నారు. ప్రతి ఇంటా ఆరోగ్యం – ఆనందంతోపాటు సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అని కవిత తన …
Read More »ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది అని కేటీఆర్ పేర్కొన్నారు. గతించిన కాలాన్ని మరిచిపోయి, కొత్త ఏడాది కి ఘన స్వాగతం పలుకుదాం అని పేర్కొన్నారు. ఈ ఏడాది పొడవునా విజయం, అదృష్టం మీ వెంటే ఉండాలని ఆకాంక్షిస్తూ.. శ్రీ శోభకృత్ …
Read More »వైసీపీకి చుక్కలు చూపిస్తాం -మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై దెందులూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దొంగ హామీలు ఇచ్చారు.. అందుకే ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో చిత్తుగా పట్టభద్రులు ఓడించారన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. ఒక్క రూపాయితో ఐదు లక్షల విలువైన ఇల్లు కట్టిస్తానని చెప్పి …
Read More »తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లోకి డబ్బులు జమ
రెండు లక్షల మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్.హెచ్.జి.) ఖాతాల్లోకి బ్యాంకర్లు సోమవారం రూ.217 కోట్లు జమ చేసినట్లు మంత్రి హరీశ్‌రావు మీడియాకు తెలిపారు. బ్యాంకులు గతంలో అధికంగా వసూలుచేసిన వడ్డీ సొమ్మును తిరిగి సంఘాల ఖాతాల్లో వేసినట్లు ఆయన వివరించారు. మహిళా సంఘాలు తీసుకునే రుణాలపై ఎంత వడ్డీ వసూలు చేయాలో… 2022 జూలై 20న బ్యాంకులకు ఆర్బీఐ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. రూ.3 లక్షల వరకు రుణంపై …
Read More »దేశంలోమళ్లీ పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు
దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 97,866 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు… వీటిలో 699 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,46,96,984 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 6,559 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 …
Read More »