దేశంలో సంచలనం సృష్టించిన అదానీ స్టాక్స్ మోసాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని భారత్ రాష్ట్ర సమితి, ఆమ్ ఆద్మీ పార్టీలు ఇవాళ పార్లమెంట్‌లో డిమాండ్ చేశాయి. ఉభయసభలను బహిష్కరించిన ఇరు పార్టీలు.. పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్, ఆప్ పార్టీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని గాంధీ విగ్రహం ముందు నినాదాలు చేశారు. అదానీ సంక్షోభంపై తేల్చేందుకు జేపీసీతో విచారణ చేపట్టాలని డిమాండ్ …
Read More »తెలంగాణలో మరో ఎన్నికల సమరం
తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ టీచర్ ఎమ్మెల్స స్థానానికి ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. ఈ ఎన్నికకు సంబంధించి ఈ నెల 16వ తేదీ నోటఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 23వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం కల్పించారు. మార్చి 13న ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇప్పటికే ఆయా …
Read More »రైతులను ముక్కు పిండి రుణాలను వసూలు చేయాలి-బీజేపీ ఎంపీ
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి తన రైతు వ్యతిరేక వైఖరిని బయటపెట్టుకొన్నది. పంట నష్టపోయిన రైతన్నలకు అండగా వారి రుణాలు మాఫీ చేయడం ఘోరమైన తప్పిదమన్నట్టుగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ, ఆ పార్టీ యువమోర్చా అధ్యక్షుడు తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రైతు రుణమాఫీతో దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టమని, రైతుల నుంచి రుణాలను ముక్కుపిండి వసూలు చేయాల్సిందేనని …
Read More »చూపులతో మతి పోగోడుతున్న సౌందర్య శర్మ
జనావాసాల మధ్య ఉన్న గోదాములను తరలిస్తాం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలో జనావాసాల మధ్య ఉన్న గోదాములను తరలిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గోదాముల్లో ప్రమాదకర రసాయనాలు ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సికింద్రాబాద్‌లోని మినిస్టర్‌లో ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన డెక్కన్ మాల్ కూల్చివేత ప్రాంతాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా మరో రెండు రోజుల్లో భవనం కూల్చివేత పనులు పూర్తవుతాయని చెప్పారు. డెక్కన్ మాల్ …
Read More »వరంగల్ లో ఎల్‌టీఐ మైం డ్ ట్రీ ఐటీ కంపెనీ
తెలంగాణ రాష్ట్రంలోని టైర్ 2 నగరాలకు ఐటీని విస్తరించేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తున్నది. వరంగల్‌లో మరో ప్రముఖ ఐటీ కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకొచ్చింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎల్‌టీఐ మైం డ్ ట్రీ ఐటీ కంపెనీ ఈ నెలాఖరులో వరంగల్‌లో తన డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నదని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించా రు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను ఆ …
Read More »కంటి వెలుగు దేశంలోనే గొప్ప పథకం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కంటి వెలుగు దేశంలోనే గొప్ప పథకమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాల వాళ్లు దీన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమం పేదలకు ఎంతో ఉపయోగకరని చెప్పారు. దూర ప్రాంతాలకు వెళ్లలేక కళ్లు పోగుట్టుకున్న పేదలు లక్షల్లో ఉన్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులందరూ కంటివెలుగు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి. అసెంబ్లీలో కంటివెలుగు కార్యక్రమాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి …
Read More »పెళ్లి పీటలెక్కిన రవితేజ హీరోయిన్
సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం పెళ్లి బాజాలు మోగుతున్నాయి.గత కొంతకాలంగా బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీల పెళ్లి నిన్న మంగళవారం రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ హోటల్ ప్యాలెస్‌లో వైభవంగా జరిగింది. కాగా వీళ్ల పెళ్లి రోజే మరో సెలబ్రెటీ వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. నేనింతే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అదితి గౌతమ్ తాజాగా ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది.ముంబైకి చెందిన ప్రముఖ …
Read More »ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సవాల్
ప్రధానమంత్రి నరేందర్ మోదీకి కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ లోక్ సభలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేందర్ మోదీపై ఫైర్ అయ్యారు. ‘పోర్టులు, ఎయిర్పోర్టులు, రోడ్లు.. ఇలా అన్ని అదానీకే కట్టబెడుతున్నారు. దేశం మొత్తం అదానీకి అప్పగిస్తారా? హిండెన్బర్గ్ రిపోర్ట్ పై మోదీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. అదానీ షెల్ కంపెనీలపై విచారణ జరిపే దమ్ము మోదీకి ఉందా? అదానీ సంపద …
Read More »విజయ్ సేతుపతి సంచలన వ్యాఖ్యలు
తాను పాన్ ఇండియా నటుడిని కాదని.. కేవలం నటుడినేనన్నారు ప్రముఖ సినీ నటుడు విజయ్ సేతుపతి. ‘పాన్ ఇండియా యాక్టర్ అనే స్టేట్మెంట్ నాకు అంత సౌకర్యంగా ఉండదు. అది కొన్నిసార్లు నన్ను ఒత్తిడికి గురిచేస్తుంది. నేను కేవలం నటుడినే. దాని కింద ఎలాంటి ట్యాగ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ అన్ని భాషల్లో నటించడానికి ఇష్టపడతా. అవకాశం వస్తే బెంగాలీ, గుజరాతీలో కూడా’ అని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు.
Read More »