Home / SLIDER / రైతులను ముక్కు పిండి రుణాలను వసూలు చేయాలి-బీజేపీ ఎంపీ

రైతులను ముక్కు పిండి రుణాలను వసూలు చేయాలి-బీజేపీ ఎంపీ

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి తన రైతు వ్యతిరేక వైఖరిని బయటపెట్టుకొన్నది. పంట నష్టపోయిన రైతన్నలకు అండగా వారి రుణాలు మాఫీ చేయడం ఘోరమైన తప్పిదమన్నట్టుగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ, ఆ పార్టీ యువమోర్చా అధ్యక్షుడు తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

రైతు రుణమాఫీతో దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టమని, రైతుల నుంచి రుణాలను ముక్కుపిండి వసూలు చేయాల్సిందేనని తేజస్వీ సూర్య అన్నారు. సోమవారం మంగళూరులో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ గతంలో రుణమాఫీల వలన దేశానికి ఒరిగింది శూన్యమని, ఖజానా ఖర్చయ్యే జనాకర్షక పథకాల జోలికి బీజేపీ పోదని సెలవిచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino