దేశంలో కొత్తగా 9560 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,43,98,696కి చేరాయి. ఇందులో 4,37,83,788 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,597 మంది మృతిచెందగా, 87,311 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 41 మంది మృతిచెందగా, 12,875 మంది కరోనా నుంచి బయటపడ్డారు.
Read More »దాయాది మ్యాచ్ కు ముందు టీమిండియాకు శుభవార్త
ఆసియా కప్‌లో దాయాదితో కీలక మ్యాచ్ ముందు టీమ్‌ఇండియా శుభవార్త అందుకుంది. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా నుంచి కోలుకున్నాడు. దీంతో శనివారం సాయంత్రమే దుబాయ్‌కి విమానం ఎక్కేశాడు. ఆదివారం ఉదయం భారత జట్టు బసచేస్తున్న హోటల్‌కు చేరుకున్నాడు. ఈనెల 23న ద్రవిడ్‌కు కరోనా నిర్ధారణ అయిందని బీసీసీఐ ప్రకటించింది. దీంతో బోర్డు వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకున్నాడు. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు నెగెటివ్‌గా తేలింది. …
Read More »100కోట్ల క్లబ్ లో కార్తికేయ – 2
యువహీరో నిఖిల్, స్టార్ హీరోయిన్.. హాట్ భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొంది ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ‘కార్తికేయ-2’.. ఈ చిత్రం వందకోట్ల వసూళ్ల క్లబ్‌లో చేరింది. ఈ సందర్భంగా మొన్న శుక్రవారం ఏపీలోని కర్నూల్‌లో నిర్వహించిన సమావేశంలో నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ ‘మా సినిమాకు ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు కృతజ్ఞతలు’ అన్నారు. నిఖిల్ మాట్లాడుతూ …
Read More »NTR కి జోడిగా సమంత
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఆన్ స్క్రీన్ ఫెయిర్స్ లో ఒక జోడి యంగ్ టైగర్.. స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. హాటెస్ట్ భామ .. స్టార్ హీరోయిన్ సమంత ఒకటి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బృందావనం చిత్రంతో సమంతకు కమర్షియల్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కింది. ఆ తర్వాత వీళ్లిద్దరు కలిసి రభస, రామయ్య వస్తావయ్య, జనతా గ్యారేజ్ లాంటి చిత్రాల్లో నటించారు. మరోసారి ఈ …
Read More »రూ.50.58 లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన 102 మంది ముఖ్యమంత్రి సహాయనిధి పథకం లబ్ధిదారులకు రూ.50,58,500/- విలువ గల చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి ఈరోజు చింతల్ లోని తన కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సుపరిపాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం వరం …
Read More »26 రాష్ట్రాల రైతు సంఘ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం
తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలతోపాటు పలు రంగాల్లో ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు దేశంలోని 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల నాయకుల అధ్యయన కార్యక్రమం రెండోరోజు కొనసాగుతున్నది. ఇందులో భాగంగా శనివారం ఉదయం ప్రగతి భవన్ కు చేరుకున్న రైతు సంఘాల నేతలకు అల్పాహారం ఏర్పాట్లు చేశారు. అనంతరం వారంతా వ్యవసాయం, సాగునీటి రంగం తదితర తెలంగాణ …
Read More »భారత్ సీజేఐగా ఉమేష్ లలిత్ ప్రమాణ స్వీకారం
భారతదేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. యూయూ లలిత్‌తో ప్రమాణం చేయించనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరుగనున్న ఈ కార్యక్రమాని ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. కాగా, జస్టియ్ యూయూ లలిత్ పదవీ కాలం నవంబర్ 8న ముగియనుంది.
Read More »కాజల్ ఆకాశానికెత్తుతున్న అభిమానులు.. ఎందుకంటే..?
ఇటీవల పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది చందమామ.. హటెస్ట్ బ్యూటీ ..సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. అప్పుడెప్పుడో పెళ్లికి ముందు సైన్ చేసిన సినిమాలను మాత్రమే ఇప్పుడు పూర్తి చేస్తుంది. ఇలాంటి సమయంలో ఆమె ఓ సినిమాకు సోషల్‌మీడియాలో ఆల్ ది బెస్ట్ చెప్పింది. అది చూసిన తర్వాత అభిమానులు కాజల్ మంచితనాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. దీనికి కారణం తనను తప్పించిన సినిమాకు ఆమె ఆల్ …
Read More »దేశంలో కొత్తగా 9,520 మందికి కరోనా
గత కొన్ని రోజులుగా దేశంలో రోజువారీ కరోనా పాజీటివ్ కేసుల నమోదు సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన గత 24 గంటల్లో కొత్తగా 9,520 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,43,98,696కు చేరాయి. ఇందులో 4,37,83,788 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,597 మంది మరణించారు. మరో 87,311 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం …
Read More »గణేష్ వేడుకల ఏర్పాట్లపై అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే Kp సమీక్ష…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జిహెచ్ఎంసి ఎనిమిది డివిజన్లలో గణేష్ వేడుకల ఏర్పాట్లపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద అన్ని శాఖల ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజలందరూ సంతోషంగా పండుగను జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 31వ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ 9 వరకు కొనసాగే గణేష్ వేడుకల్లో భాగంగా నిమజ్జనం జరిగే …
Read More »