తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరుగుతున్న ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »విద్యార్థులను చదువుతో పాటు క్రీడలలోను ప్రోత్సహించాలి
విద్యార్థులను చదువుతో పాటు క్రీడలలోను ప్రోత్సహించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని గ్రౌండ్ లో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధులు క్రీడలలో పాల్గొనడం వలన మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందడమే కాకుండా ఆరోగ్యపరంగా ఎంతో దృడంగా తయారు అవుతారని …
Read More »మీకు జుట్టు రాలుతుందా..?
రెండు చెంచాల నల్ల నువ్వులను కప్పు కొబ్బరినూనెలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే రెండు ఉసిరికాయల గుజ్జును ఈ నూనెకు కలిపి పాన్పై రెండు నిమిషాలు వేడి చేసి మిక్సీలో మెత్తగా చేసి మరోసారి పొయ్యిపై ఉంచాలి. చిక్కగా అయ్యే వరకు ఉంచి, చల్లార్చి వడకట్టాలి. ఈ నూనెను వారానికొకసారి తలకు మర్దన చేసి తలస్నానం చేస్తే జుట్టు రాలదు.
Read More »అతిగా మద్యం తాగితే..?
పిల్లలు, వృద్ధులతోపాటు అతిగా మద్యం తాగితే ఎండకాలం ఎక్కువగా వడదెబ్బ బారినపడే ప్రమాదం ఉంటుంది. అప్పుడప్పుడు మద్యం సేవించేవారు కాకుండా నిత్యం మద్యం తాగేవారు మాత్రం వేసవిలో జాగ్రత్తగా ఉండాలి. వారి శరీరంలోకి చేరిన మద్యం నీటిని నిల్వ చేయనివ్వదు. దీంతో దాహం పెరిగిపోతుంది. విపరీతమైన జ్వరం, నోరు తడారిపోవడం, తలనొప్పి, నీరసం, మూత్రం రంగు మారడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలుంటే వడదెబ్బగా గుర్తించాలి.
Read More »అఫ్రిదీపై డానీష్ కనేరియా సంచలన ఆరోపణలు
పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానీష్ కనేరియా షాహిద్ అఫ్రిదీపై సంచలన ఆరోపణలు చేశాడు. ‘హిందువు అయినందుకు నేను జట్టులో ఉండటం అతడికి ఇష్టం ఉండేది కాదు. నన్నెప్పుడూ కించపరిచేవాడు. ఇతర టీమ్ సభ్యులను రెచ్చగొట్టి నాపైకి ఉసిగొల్పేవాడు. నేను బాగా ఆడితే తట్టులేకపోయేవాడు. అతడొక క్యారెక్టర్ లేని వ్యక్తి’ అని కనేరియా మండిపడ్డాడు. వీరిద్దరూ కలిసి పాక్ జట్టు తరఫున ఆడారు.
Read More »డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు
KKR తో నిన్న గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రికార్డు సృష్టించాడు. మరోసారి తుఫాన్ ఇన్నింగ్స్ ఆకట్టుకుని ఐపీఎల్ క్రికెట్ లో రెండు జట్లపై 1000కి పైగా పరుగులు చేసిన తొలి బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. కేకేఆర్ పై 26 మ్యాచ్లలో 1008 పరుగులు పూర్తి చేశాడు వార్నర్.. అంతకుముందు పంజాబ్ కింగ్స్ పై 22 ఇన్నింగ్స్ లో …
Read More »నేడు ఢిల్లీకి న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 30న ఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో జరగనున్న న్యాయ సదస్సులో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొననున్నారు. సీజేఐ జస్టీస్ ఎన్వీ రమణ నేతృత్వం వహిస్తున్న ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు. నేషనల్ జ్యూడిషీయల్ ఇన్ఫ్రాస్టక్టర్ అథారిటీ ఏర్పాటు ప్రధాన ఎజెండాగా ఈ సదస్సు నిర్వహించనున్నారు. దేశంలో …
Read More »సంపద సృష్టిస్తున్నాం.. ప్రజలకు పంచుతున్నాం: మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నాం, దానిని ప్రజలకు పంచుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఏ మూలకెళ్లినా ఎకరం భూమి విలువ రూ.15 లక్షలకు తక్కువగా లేదని చెప్పారు. రాష్ట్రం సిద్ధించినప్పుడు మన తలసరి ఆదాయం రూ.లక్షా 24 వేలు అని, ఏడేండ్ల తర్వాత అది రూ.2.78 లక్షలకు చేరిందన్నారు. మాదాపూర్ హైటెక్స్‌లో జరుగుతున్న క్రెడాయ్ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయం తరువాత …
Read More »అమనగల్ గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్
మహబూబాబాద్ మండలంలోని ముడుపుగల్ మరియు అమనగల్ గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలను ప్రారంభించిన మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ..మహబూబాబాద్ మండలంలోని ముడుపుగల్ గ్రామంలో ఎన్ హెచ్ యం నిధుల నుండి 16.00 లక్షలు . మరియు అమనగల్ గ్రామంలో ఎన్ హెచ్ యం నిధుల నుండి 16.00 లక్షల నిధులతో ఆరోగ్య ఉపకేంద్రాలను ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ …
Read More »