ఢిల్లీ సీఎం అరవింద్ ఇంటిపై దాడి-8మంది అరెస్ట్
ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి,ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ యొక్క అధికార నివాసంపై బీజేపీ నేతల దాడికేసులో ఢిల్లీ పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాలో అబద్ధాలున్నాయని సీఎం కేజ్రీవాల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేవైఎం అధ్యక్షుడు తేజస్వీ సూర్య నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు ఆయన ఇంటిముందు నిన్న బుధవారం నిరసనకు దిగారు. కశ్మీర్ పండిట్లను కేజ్రీవాల్ అవమానించారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. …
Read More »దేశంలో కొత్తగా 1225 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 1225 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,24,440కి చేరాయి. ఇందులో 4,24,89,004 మంది బాధితులు కోలుకున్నారు. మరో 14,307 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,21,129 మంది మహమ్మారికి బలయ్యారు. గత 24 గంటల్లో కొత్తగా 28 మంది మృతిచెందగా, 1594 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. కాగా, దేశవ్యాప్తంగా 184.06 కోట్ల టీకాలు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Read More »ఏడేళ్ళ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి కృతీ సనన్ ఎంట్రీ
దాదాపు ఏడేళ్ళ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది బాలీవుడ్ కి చెందిన హాట్ బ్యూటీ.. స్టార్ క్రేజీ హీరోయిన్ కృతీ సనన్. సూపర్ స్టార్ మహేశ్ బాబు – సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 1 నేనొక్కడినే సినిమాతో సౌత్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది కృతి. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. ఆ తర్వాత అక్కినేని నాగ చైతన్యతో చేసిన దోచేయ్ సినిమా కూడా పరాజయాన్ని …
Read More »భార్య కోసం వంట చేస్తే లాభాలు ఎన్నో..?
‘మీ మనసు ఖరాబైనప్పుడు ఓసారి వంటింట్లోకి వెళ్లండి. కూరగాయలు తరగండి. నచ్చిన వంటను మహారుచిగా వండండి. ఆనందంగా ఆరగించండి. అంతే, ఒత్తిడి హుష్ కాకి! ఒక్కసారి కిచెన్‌లోకి అడుగుపెడితే.. ఎంతటి ఒత్తిడి అయినా పటాపంచలై పోవాల్సిందే’ అని సలహా ఇస్తున్నారు పరిశోధకులు. స్వయంగా వంట చేసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అమెరికాలోని ఎడిత్ కోవాన్ యూనివర్సిటీ (ఈసీయూ) నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 657 మందిపై ఆరు నెలలపాటు నిర్వహించిన …
Read More »ఎస్సీ వర్గీకరణపై పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్‌ఎస్ వాయిదా తీర్మానం
షెడ్యూల్డ్ కులాల వర్గీకరణపై చర్చించాలని పార్లమెంటు ఉభయసభల్లో టీఆర్‌ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ చాలా ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్నదని, ఉభయ సభల్లో కార్యకలాపాలు సస్పెండ్ చేసి ఈ అంశంపై చర్చించాలని వాయిదా తీర్మానంలో లోక్‌సభలో టీఆర్‌ఎస్ పార్టీ పక్ష నేత నామా నాగేశ్వరరావు కోరారు. ఇదే అంశంపై రాజ్యసభలో టీఆర్ఎస్ నేత కే కేశవరావు నోటీసులు ఇచ్చారు.వర్గీకరణతో వారి జనాభా ప్రకారం చట్టబద్ధమైన ప్రయోజనాలు …
Read More »విద్యుత్ ఛార్జీలు మన దగ్గరే తక్కువ- రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చేదీ తెలంగాణ మాత్రమే
మానవ దైనందిన జీవితంతో పెనవేసుకుపోయిన అత్యంత కీలక అంశం విద్యుత్తు. కరెంటు సరఫరాలో చిన్న అంతరాయం ఏర్పడినా జన ప్రవాహం ఎక్కడికక్కడ స్తంభించిపోయేంతగా విద్యుత్ అవసరాలు పెరిగిపోయాయి. అంతటి ప్రాధాన్యం గల విద్యుత్తు ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంత ప్రజల, రైతుల జీవితాలను అతలాకుతలం చేసింది.రెండు, మూడు విడుతల 6 గంటల విద్యుత్తుతో నాడు వ్యవసాయరంగం సంక్షోభంలోకి నెట్టివేయబడింది. గృహ, వాణిజ్య వినియోగదారులు గంటల తరబడి అంధకారంలో జీవించారు. 2, …
Read More »కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఒక చెరువు నిండేది కాదు.. ఒక ఎకరం నీళ్లు ఉండేవి కావు..
మండుటెండల్లో చెరువుల్లో.. చెక్ డ్యామ్ ల్లో మత్తళ్లు దుంకుతున్న చరిత్ర నేటి తెలంగాణ ప్రభుత్వం లో..సీఎం కేసీఆర్ గారి నాయకత్వం లో అవిష్కృతం అయిందని మంత్రి హరీష్ రావు గారు అన్నారు.. సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూర్ మండల కేంద్రంలో గంగమ్మ దేవాలయ 20వ వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రి హరిశ్ రావు గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చూస్తే ఎండాకాలం..కానీ గంగమ్మ ఒడిలో చిన్నకోడూర్ చెరువులో …
Read More »రేవంత్ కు ఎమ్మెల్యే కెపీ వివేకానంద్ వార్నింగ్
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు..మల్కాజీగిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డిపై అధికార టీఆర్ఎస్ కు చెందిన కుత్భుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కెపీ వివేకానంద్ అగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నిన్న బుధవారం నగరంలో టీఆర్ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వెనకబడిన వర్గాలు ముఖ్యంగా బీసీలంటే రేవంత్ రెడ్డికి చులకన భావం. ఆయన వెంటనే వాళ్లకు భేషరత్ గా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల …
Read More »వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలి
తెలంగాణ రైతాంగం రబీ సీజన్ లో పండించిన వరి ధాన్యం అంతటిని కేంద్రం కొనుగోలు చేయాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో సభ్యులు ఏకవాక్య తీర్మానం చేశారు. బుధవారం జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు వి.గంగాధర్ గౌడ్, డి.రాజేశ్వర్, కలెక్టర్ సి.నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభమైన …
Read More »