తెలంగాణలో సిరిసిల్ల జిల్లాలోని పెద్దూరు అప్పారెల్ పార్కులో బెంగళూరుకు చెందిన ప్రముఖ జౌళి ఉత్పత్తుల సంస్థ టెక్స్‌పోర్ట్ గ్రూప్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో టెక్స్‌పోర్ట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకొన్నది. ప్రభుత్వ చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్, టెక్స్‌పోర్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర డీ గోయెంకా ఒప్పంద పత్రాలు …
Read More »భీమ్లా నాయక్ పై చంద్రబాబు సంచలన ట్వీట్
జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘‘భీమ్లానాయక్’’ సినిమా విషయంలో ఏపీ అధికార వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోందని ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు రిలీజ్ అయిన ‘భీమ్లానాయక్’ చిత్రంపై ట్వీట్టర్ వేదికగా బాబు స్పందిస్తూ… రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ జగన్ వదలడం లేదన్నారు. చివరికి వినోదం పంచే సినిమా …
Read More »ఉక్రెయిన్ లో ఉన్న తెలంగాణ విద్యార్థులను ఆదుకోండి-ఖర్చులను మేము భరిస్తాం -మంత్రి కేటీఆర్
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను ఆదుకోవాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయాలని కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల పూర్తి ప్రయాణ ఖర్చులను భరించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.ఉక్రెయిన్‌లోని తెలంగాణ విద్యార్థులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్, …
Read More »దేశంలో కొత్తగా 13,166 కరోనా కేసులు
దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 10 లక్షల మందికి కరోనా టెస్టులు నిర్వహిచారు. ఈ పరీక్షల్లో 13,166 మందికి కరోనా అని తేలింది.26,988 మంది కోలుకున్నారు. 302 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 5,13,226కు చేరింది. యాక్టివ్ కేసులు 1,34,235 ఉన్నాయి. రికవరీ రేటు 98.49 శాతానికి పెరిగింది. నిన్న 32,04,426 మంది టీకా తీసుకున్నారు. మొత్తంగా 176 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి.
Read More »రష్యా-ఉక్రెయిన్ విషయంలో భారత్ వైఖరి ఏంటి..?
అమెరికా, రష్యాతో భారత్ కు బలమైన సంబంధాలున్నాయి. చైనాతో మన దేశానికి సరిహద్దుల్లో సంక్షోభం తలెత్తిన వేళ చైనాతో ఉన్న పరపతి ఉపయోగించి పుతిన్ ఆ దేశ దూకుడుకు కళ్లెం వేశారు. అలాగే రష్యా నుంచి మనం పెద్దఎత్తున ఆయుధాలు, క్షిపణులు కొనుగోలు చేస్తున్నాం. మనం ఉక్రెయిన్కు మద్దతు ఇస్తే రష్యాకు కోపం వస్తుంది. అలా అని నేరుగా రష్యాకు సపోర్ట్ చేస్తే అమెరికా, యూరప్ దేశాలకు మంట. దీంతో …
Read More »విటమిన్”ఇ” తో అందంగా ఉండోచ్చా..?
విటమిన్”ఇ”లో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ముఖానికి కావాల్సిన తేమ అందిస్తుంది. చుండ్రు, దురద, జుట్టు త్వరగా పెరగకపోవడం వీటన్నింటికి “ఇ” విటమిన్తో చెక్ పెట్టొచ్చు. రెండు క్యాప్సూళ్ల విటమిన్ “ఇ” నూనెను.. తలకు రాసే నూనెకు కలిపి, రాత్రి లేదా తల స్నానానికి అరగంట ముందు పట్టిస్తే ఫలితం ఉంటుంది. నిర్జీవంగా మారిన చేతి గోళ్లకు “ఇ” విటమిన్ నూనెతో మర్దన చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది.
Read More »ఢిల్లీకి సీఎం కేసీఆర్
జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టిన తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈ నెలాఖరులో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. బీజేపీయేతర ముఖ్యమంత్రులతో భేటీ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు సీఎం కేసీఆర్.. అందులో చర్చించాల్సిన అంశాలపై ఢిల్లీకి వెళ్లనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రాంతీయ పార్టీల నాయకులతో పాటు వివిధ రంగాల నిపుణులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశం కానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.
Read More »భీమ్లా నాయక్ పై దర్శకుడు హరీష్ శంకర్ సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో హీరోయిన్స్ నిత్యా మీనన్ ,సంయుక్త మీనన్ ,ఇతర నటులు రావు రామేష్ ,మురళి శర్మ,సముద్ర ఖని ప్రధాన పాత్రల్లో నటించగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఈ సినిమాని సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగదేవర సూర్యవంశీ నిర్మాతగా ..ఎస్ఎస్ తమన్ సంగీతం వహించగా ఈ రోజు …
Read More »ఆడవాళ్లు ఎందుకు ఆనందంగా ఉండకూడదు
ఆడవాళ్లు ఎందుకు ఆనందంగా ఉండకూడదు అనే కోణంలో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా సాగుతుందని నటి ఖుష్బు తెలిపారు. ఆడవాళ్లకు, మానవ సంబంధాలకు ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు కిషోర్ ఈ కథ రాసుకున్నారని చెప్పారు. ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు వినోదం చక్కగా కుదిరిందని, అందుకే కథ వినగానే చేశానని పేర్కొన్నారు. ఈ చిత్రంలో హీరో పాత్రకు ఐదుగురు తల్లులు ఉంటారన్నారు. తన పాత్ర ఎలా ఉంటుంది? అన్నది మూవీలో చూడాలని తెలిపారు.
Read More »చరిత్ర సృష్టించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ
టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు (3,307) చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ ఈ ఘనతను అందుకున్న రోహిత్.. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్(3,299) పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్లో రోహిత్ 32 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 44 పరుగులు చేశాడు.
Read More »