చిత్రవిచిత్ర నిర్ణయాలు, శిక్షలతో వార్తల్లో నిలిచే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. తాజాగా మరోసారి తెరపైకి వచ్చారు. కిమ్ తన తండ్రి జోంగ్ ఇల్ సమాధి ప్రాంతంలో ఏటా కింజోంగిలియా అనే పూలమొక్కలను నాటిస్తారు. వాటి సంరక్షణకు ఇద్దరు తోటమాలీలను నియమించగా.. వాతావరణ మార్పుల వల్ల ఈఏడాది ఆ మొక్కలకు పూలు పూయలేదు.దీంతో ఆగ్రహించిన కిమ్ వారిద్దరిలో ఒకరికి 3, మరొకరికి 6 నెలల జైలుశిక్ష విధించారు.
Read More »దేశంలో కొత్తగా 30,615 కరోనా కేసులు
గడిచిన 24గంటల్లో దేశ వ్యాప్తంగా 30,615 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 514 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 3,70,240 యాక్టివ్ పాజిటివిటీ రేటు 2.45%గా ఉంది. ఇదిలా ఉండగా.. దేశ వ్యాప్తంగా మొత్తం 173.86 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. నిన్న 27,409 కేసులు నమోదయ్యాయి.
Read More »మానసిక ఆరోగ్యం కోసం ఏమి చేయాలంటే..?
మానసిక ఆరోగ్యం కోసం ఇలా చేయండి.. ఎలా ఉంటుందో మీరే చూడండి.. > తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. >క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం చేయండి. >నచ్చిన సంగీతం వినండి. యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోండి. >వీలైతే నచ్చిన వంటలు చేసుకోండి. పాకశాస్త్రంలో కొత్త వంటల కోసం ప్రయోగాలు చేయండి. >ఇష్టమైన వ్యక్తులతో ఆడియో లేదా వీడియో కాల్లో మాట్లాడండి. అది మీ మనసుకు ఎంతో ఉపశమనాన్ని …
Read More »సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తా
తెలంగాణ రాష్ట్ర ప్రజలపై కేసీఆర్ ప్రభుత్వం రూ.3 వేల కోట్ల భారం మోపే కుట్ర చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఛార్జీల పేరుతో అదనపు బిల్లులను ప్రజల నుంచి వసూలు చేస్తోందని విమర్శించారు. విద్యుత్ వినియోగదారులకు డెవలప్మెంట్ ఛార్జీల భారం కేసీఆర్ పుట్టినరోజు కానుకనా? అని ప్రశ్నించారు. డెవలప్మెంట్ ఛార్జీల భారం ఎత్తేస్తే రేపు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తానని తెలిపారు.
Read More »తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో 17వేల ఉద్యోగ ఖాళీలు
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో 17వేల ఉద్యోగ ఖాళీలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. వివిధ శాఖల్లోనూ ఖాళీగా ఉన్న పోస్టుల సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. ఇందులో భాగంగా పోలీసు శాఖలో ఖాళీల గుర్తింపు ప్రక్రియ కొలిక్కి రాగా.. మిగిలిన శాఖలతో పాటు పోలీసు ఉద్యోగాల భర్తీకి కూడా ప్రకటన విడుదలయ్యే అవకాశముంది. ఈ శాఖలో దాదాపు 16వేల కానిస్టేబుల్, వెయ్యి ఎస్సై పోస్టులను భర్తీ చేసే ఛాన్స్ ఉంది.
Read More »రాజ్యసభ సీటుపై ఆలీ క్లారిటీ
ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ నేత,ప్రముఖ నటుడు అలీ కుటుంబ సమేతంగా ని సీఎం ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సీఎంతో జరిగిన భేటీ వివరాలను అలీ వెల్లడించారు. ‘మర్యాదపూర్వకంగా మాత్రమే సీఎంను కలిశా. గత సాధారణ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేశారు. సమయం లేక నేనే వద్దని చెప్పా. ఏమీ ఆశించకుండా పార్టీలోకి వచ్చాను. పదవి ఇస్తేనే పార్టీలో సేవ చేస్తానని …
Read More »మిథాలీరాజ్ అరుదైన రికార్డులు
కివీస్ తో జరిగిన రెండో వన్డేలో భారత క్రికెటర్ మిథాలీరాజ్ అరుదైన రికార్డులు సాధించింది. తన కంటే 21 ఏళ్ల చిన్నదైన రిచాఘోష్తో కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది. మిథాలీ మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన 4ఏళ్లకు రిచా జన్మించింది. అలాగే 20ఏళ్ల కెరీర్ పూర్తయిన మొదటి మహిళా క్రికెటర్, కివీస్పై అత్యధిక హాఫ్ సెంచరీలు, రన్స్ చేసిన భారత కెప్టెన్ రికార్డులు నెలకొల్పింది. ధోనీ, కోహ్లి రికార్డులను బద్దలుకొట్టింది.
Read More »మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహిరి కన్నుమూత
ప్రముఖ గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహిరి కన్నుమూశారు. ముంబైలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని జల్పాయుడిలో జన్మించిన ఆయన.. ఎన్నో భాషల్లో పాటలు పాడారు. తెలుగులోనూ చాలా సినిమాల్లో పాటలు పాడిన బప్పి లహిరి.. సింహాసనం, స్టేట్ డీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్ చిత్రాలకు మ్యూజిక్ అందించారు.
Read More »లక్కీ ఛాన్స్ కొట్టిన యంగ్ బ్యూటీ
రొమాంటిక్ మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది యంగ్ బ్యూటీ కేతిక శర్మ. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ ప్లాప్ సినిమాల లిస్ట్లో చేరింది. అనంతరం వచ్చిన లక్ష్య మూవీ ఆశించిన సక్సెస్ ఇవ్వలేదు. ఈ ముద్దుగుమ్మ ‘రంగ రంగ వైభవంగా’ మూవీ మీదే ఆశలు పెట్టుకుంది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను గిరీషాయ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ మే 27న రిలీజ్ …
Read More »కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నేత షాక్
కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నేత షాక్ ఇచ్చారు. కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి డాక్టర్ అశ్వని కుమార్ కాంగ్రెస్ పార్టీకి ఉద్వాసన చెప్పారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపారు. ప్రస్తుత పరిణామాలు, దేశ విస్తృత ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని, గౌరవప్రదంగా పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆ లేఖలో అశ్వని కుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో 46 ఏళ్ల సుదీర్ఘ పయనం చేసిన విషయాన్ని …
Read More »