ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఐసీయూలో తమ పర్యవేక్షణలోనే ఆమెకు చికిత్సను కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొందని వైద్యులు తెలిపారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులంతా ప్రార్థించాలని వైద్యులు కోరారు. కాగా కరోనాతో పాటు న్యుమోనియాతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో లతా మంగేష్కర్ చేరారు.
Read More »విరాట్ కోహ్లి ప్రకటనపై బీసీసీఐ స్పందన
భారత టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లి చేసిన ప్రకటనపై బీసీసీఐ స్పందించింది. ‘కోహ్లికి ధన్యవాదాలు. అద్భుతమైన నాయకత్వ లక్షణాలతో భారత జట్టును ఎన్నో శిఖరాలకు తీసుకెళ్లావు. 68 టెస్టుల్లో 40 విజయాలతో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా నిలిచావు కోహ్లి’ అని బీసీసీఐ తెలిపింది.
Read More »ఏపీలో కొత్తగా 4,955 కరోనా కేసులు
ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 35,673 టెస్టులు చేయగా.. కొత్తగా 4,955 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు కోవిడ్తో మరణించారు. మరోవైపు 397 మంది పూర్తిగా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,870 కేసులు ఉన్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. నిన్నటి కంటే 400పై చిలుకు కేసులు నమోదయ్యాయి.
Read More »ఇంగ్లండ్ 188 పరుగులకే ఆలౌట్
యాషెస్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న చివరి టెస్ట్ రెండో రోజు ఇంగ్లండ్ 188 పరుగులకే కుప్పకూలింది. మరోసారి ఆసీస్ బౌలర్ల దాటికి ఇంగ్లీష్ బ్యాటర్లు పెవిలియన్ కి క్యూ కట్టారు. క్రిస్ వోక్స్(36), రూట్ (34), బిల్లింగ్స్ (29), మలాన్(25) క్రావ్ (18) తక్కువ పరుగులకే ఔటయ్యారు. కమిన్స్ (4వికెట్లు), స్టార్క్ (3వికెట్లు), బోలాండ్, గ్రీన్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 303 …
Read More »BJP కి షాకిస్తున్న అఖిలేష్ యాదవ్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీని ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ముప్పు తిప్పలు పెడుతున్నారు. మొన్నటి వరకు బలంగా కనిపించిన అధికార బీజేపీకి షాకిచ్చేలా.. వలసలను ఆహ్వానిస్తూ తమ పార్టీ బలపడుతోందనే సంకేతాలు పంపుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు,మంత్రులు బీజేపీని వీడి ఎస్పీలో చేరుతున్నారు.. మరోవైపు ఆ పార్టీకి చెందిన మరికొందరు నేతలు ఊగిసలాటలో ఉన్నారట. అఖిలేష్ దెబ్బకు …
Read More »ఒక్క రోజులోనే రూ.17.5 కోట్లు రావడం సంతోషం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ,వారసుడు అక్కినేని నాగచైతన్య,యువహీరోయిన్ కృతిశెట్టి,సీనియర్ నటి రమ్యకృష్ణ లు నటించగా విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం బంగార్రాజు.. తాను నటించిన మూవీకి ఒక్క రోజులోనే రూ.17.5 కోట్లు రావడం సంతోషంగా ఉందన్నారు మన్మధుడు కింగ్ నాగార్జున.ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మూవీ ఈనెల 14న రిలీజైంది. ఈ మూవీ సూపర్ హిట్ టాక్ రావడంతో.. …
Read More »హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం
హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు వెల్లడించింది. కొత్త వడ్డీ రేట్లు జనవరి 12 నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది. దీంతో బ్యాంక్లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ప్రయోజనం కలుగనుంది. రూ. 2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. వడ్డీ రేట్ల పెంపు 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల వరకు …
Read More »తెలంగాణలో 1,963 మందికి కరోనా వైరస్
తెలంగాణలో నిన్నటితో పోల్చితే రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 53,073పరీక్షలు చేయగా 1,963 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,017 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న రాష్ట్రంలో 2,398 కరోనా కేసులు వచ్చాయి.
Read More »దేశ ప్రజలకు ప్రధాని మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు
పండుగలు భారతదేశ శక్తిమంతమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని సూచిస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. పలు రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో జరుపుకునే మకర సంక్రాంతి, మాగ్ బిహు, ఉత్తరాయన్, పొంగల్, భోగీని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపుతూ పలు భాషల్లో ట్వీట్లు చేశారు. ఈ పండుగలు ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు, ఆరోగ్యం, ఆనందాన్ని తీసుకురావాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
Read More »విటమిన్ D కావాలంటే ఏమి చేయాలి…?
విటమిన్-D కోసం ఏం తినాలి?..ఏమి ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం… * ఆవు పాలు తాగాలి * ఆరెంజ్ జ్యూస్ తాగాలి * ఓట్స్ తినాలి * యోగర్ట్ తీసుకోవాలి * పుట్టగొడుగులు తినాలి * కోడిగుడ్లు తినాలి * మజ్జిగ ఎక్కువగా తాగాలి * ఫ్రూట్ సలాడ్ తినాలి * ఉదయం పూట ఎండ ద్వారానూ విటమిన్-D పొందవచ్చు
Read More »