Home / Tag Archives: slider (page 489)

Tag Archives: slider

తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,03,56,894

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓటర్ల జాబితా-2022 ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈమేరకు మొత్తం ఓటర్లు 3,03,56,894 మంది ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 1,52,56,474, మహిళా ఓటర్లు 1,50,98,685, ఇతర ఓటర్లు 1,735 మంది ఉన్నారు. ఇక 18-19 ఏళ్ల మధ్య ఓటర్ల సంఖ్య 1,36,496గా ఉండగా.. 2021తో పోలిస్తే మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 2 లక్షలు పెరిగింది.

Read More »

నడ్డా నక్రాలు ఆపు… ఈడ నిన్ను నమ్మే బక్రాలు ఎవ్వరూ లేరు’

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పచ్చి అబద్ధాల బిడ్డ అని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మిషన్ భగీరథ లో నీళ్లు రాలేవంటున్నారని, ఇంతకన్నా హాస్యాస్పదం మరొకటి ఉండదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని బీజేపీ ఎమ్మెల్యేల, ఎంపీ ల నియోజవర్గాల్లో ఎక్కడికైనా వెళ్దామని, మిషన్ భగీరథ నీళ్లు రాలేదంటే దేనికైనా సిద్ధమని నడ్డాకు సవాల్ విసిరారు. నీతి ఆయోగ్ నివేదికలు చదివితే తెలంగాణ, కేసీఆర్ గొప్పతనాలు తెలుస్తాయని …

Read More »

Amazon Primeలోకి పుష్ప- Date Fix

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..యూత్ ఐకాన్..స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మీకా మంధాన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం విడుదలై బాక్సాఫీసు రికార్డ్లను తిరగరాస్తుంది.  పాన్ ఇండియా మూవీగా వచ్చిన ‘పుష్ప’  ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. వరల్డ్ వైడ్‌గా పుష్ఫ చిత్రం ఇప్పటికి రూ. 306 కోట్లు గ్రాస్ …

Read More »

కుప్పకూలిన టీమిండియా

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ భారత్ కుప్పకూలింది. సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి 202 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టులో కెప్టెన్ రాహుల్(50), అశ్విన్(46), మయాంక్ (26), విహారి (20) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్సన్ 4, ఒలీవియర్, రబాడా చెరో 3 వికెట్లు తీశారు. చివర్లో అశ్విన్ పోరాటంతో భారత్ ఈ మాత్రమైనా స్కోర్ చేయగలిగింది.

Read More »

రికార్డుకు చేరువలో కోహ్లీ

టీమిండియా పరుగుల యంత్రం…విరాట్ కోహ్లి ఇప్పటికి 98 టెస్టులు ఆడాడు. వెన్నునొప్పితో దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఆ దేశంలో మూడో టెస్టు ఆడితే 99 మ్యాచ్ లు పూర్తవుతాయి. స్వదేశంలో శ్రీలంకతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఫిబ్రవరి 25న జరిగే మ్యాచ్లో కోహ్లికి వంద మ్యాచ్ లు పూర్తవుతాయి. అదే స్టేడియంలో 360 డిగ్రీస్ ఆటగాడు డివిలియర్స్ కూడా వందో టెస్టు ఆడాడు. ఇద్దరూ కూడా IPLలో బెంగళూరుకే …

Read More »

పవన్ కు అండగా మెగాస్టార్

జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైనా న్యాయం కోసమే మాట్లాడతాడని ఆయన సోదరుడు చిరంజీవి చెప్పాడు. తనలాగే పవన్ కూడా న్యాయం కోసం పోరాడుతాడని మెగా అభిమానులతో జరిగిన సమావేశంలో అన్నాడు. ‘మన సిన్సియారిటీ, మన నిజాయితీ, మన సంయమనం, మన ఓపిక.. ఇవే విజయాన్ని తెచ్చిపెడతాయి. ఆ విషయంలో నేను ఎవరితో మాట అన్పించుకోలేదు’ అని చిరు తెలిపాడు.

Read More »

రికార్డు బ్రేక్ చేసిన ‘శ్యామ్ సింగ రాయ్’

సినిమా ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ కలెక్షన్లతో దూసుకెళ్తుంది. రూ.22.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఆ లక్ష్యాన్ని బ్రేక్ చేసి రూ. 2.07 కోట్ల లాభంతో ముందుకెళ్తుంది. గత 10 రోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 24.57 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.18.29కోట్లు, ROIలో రూ.2.80కోట్లు, ఓవర్సీస్లో రూ. 3.48కోట్లు …

Read More »

Bollywood లోకి రష్మికా మందాన

ఇటీవల ‘పుష్ప’ ఇచ్చిన హిట్ తో మంచి జోష్ తో కనిపిస్తోంది రష్మిక. ఆమె ఇప్పుడు ‘మిషన్ మజ్ను’ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టనుంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. కాగా.. “ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. నా మనసుకు ఎంతో దగ్గరగా ఉండే చిత్రమిది’ అని రష్మిక చెప్పుకొచ్చింది.

Read More »

ఏపీ వ్యాప్తంగా 15-18 ఏళ్లున్న 5 లక్షల మందికి వ్యాక్సిన్లు

ఏపీ వ్యాప్తంగా 15-18 ఏళ్ల మధ్య వయసు వారికి టీకా పంపిణీ నిన్న ప్రారంభం కాగా.. తొలి రోజు 5 లక్షల మందికి వ్యాక్సిన్లు వేశారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 72,146 మందికి వ్యాక్సిన్లు వేశారు.. తూ.గో, శ్రీకాకుళం, నెల్లూరు, ప.గో, కర్నూలు జిల్లాల్లో 40 వేల మందికి టీకా వేశారు. 28 రోజుల అనంతరం వీరికి రెండో డోసు టీకా వేయనుండగా.. దేశ వ్యాప్తంగా తొలిరోజు 41 లక్షల …

Read More »

ఐసోలేషన్లో ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఐసోలేషన్లోకి వెళ్లారు. తన కుటుంబంలోని ఓ సభ్యుడితో పాటు ఆమె సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వాళ్లతో కాంటాక్ట్ లో ఉన్న కారణంగా ప్రియాంక స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కాగా.. కరోనా పరీక్షల్లో ఆమెకు నెగెటివ్ వచ్చింది. కొన్ని రోజుల తర్వాత మరోసారి పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సలహా ఇచ్చినట్లు ఆమె చెప్పారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat