ఏపీలో జగన్ సర్కారు మరో అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. శాసనమండలిని రద్దు చేస్తూ గతంలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోనున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటూ ఇవాళ అసెంబ్లీలో మరో తీర్మానం తెచ్చే అవకాశం ఉంది. కాగా, గతంలో మండలిలో తెలుగుదేశం పార్టీ బలం ఎక్కువగా ఉండటంతో దాన్ని రద్దు చేయాలని 2020, జనవరిలో సీఎం జగన్ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపారు
Read More »ఏపీ నిరుద్యోగ యువతకు శుభవార్త
ఏపీ వైద్యారోగ్యశాఖ పరిధిలోని బోధన కాలేజీలు, ఆస్పత్రుల్లో 326 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. https://dme.ap.nic.in/ సైట్ ద్వారా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 9 వరకు దరఖాస్తు చేసుకోవాలని వైద్య విద్య సంచాలకులు డా. రాఘవేంద్రరావు తెలిపారు. 326 పోస్టుల్లో 188 మందిని కొత్తగా నియమిస్తామని.. ఏపీపీవీపీ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో పనిచేస్తున్న వైద్యులతో మిగతా 138 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.
Read More »Break Fast లో ఏమి తింటున్నారు..?
బ్రేక్ ఫాస్ట్ సమయంలో శనగలు తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. రోజూ ఉదయం ఓ కప్పు శనగలు తింటే.. రక్తహీనత సమస్య తొలగుతుంది. బ్లడ్ ప్రెజర్ను అదుపుచేసే శక్తి శనగలకు ఎక్కువగా ఉంటుంది. శనగలలోని ఫైబర్ డైజెస్టివ్ సిస్టంకు చాలా మేలు చేస్తుంది. మలబద్దకం, అజీర్తి సమస్యల నుండి బయటపడేస్తుంది. శనగలతో శరీరానికి ప్రొటీన్లు అందుతాయి. హెమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవుతుంది.
Read More »Delhi లో సీఎం కేసీఆర్ Busy Busy
తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో రైతులు పండించే ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరి ఏంటో తెలుసుకోవాలని, ఆ తర్వాత ఇతర అంశాలపై దృష్టి పెడదామని సీఎం కేసీఆర్ అన్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆయన మంత్రులు, ఎంపీలతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో బీజేపీ భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఏర్పడిన గందరగోళంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంలోనే మంత్రి పీయూష్ గోయల్ను రాష్ట్ర …
Read More »తెలంగాణలో 18వేల టీచర్ పోస్టులు ఖాళీ
తెలంగాణ రాష్ట్రంలో 18వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. 1.20 లక్షల టీచర్ పోస్టులకు గాను ప్రస్తుతం 1.02 లక్షల మంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పోస్టులను కొత్త జిల్లాలవారీగా విభజించి, కేటాయిస్తామన్నారు. ఇవి కాకుండా మరో 1,500 బోధనేతర, డైట్, బీఈడీ కాలేజీలు, విద్యాశాఖ కార్యాలయాల్లో పోస్టులను సైతం కొత్త జిల్లాల వారీగా విభజించేందుకు కసరత్తు చేస్తున్నారు.
Read More »ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల కోటాలో పన్నెండు ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించిన జాబితాలో చివరి గంటల్లో ఇద్దరు అభ్యర్థులు మారిపోయారు. నిజామా బాద్ జిల్లా నుంచి తొలుత ఆకులు లలితను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు లీకులు ఇచ్చాయి. కానీ ఢిల్లీలో మకాం వేసిన పార్టీ అధినేత కేసీఆర్ ఆకస్మికంగా ఆమె స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఖరారు చేశారు. ఉమ్మడి మహబూబ్ …
Read More »ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్
ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ కలెక్టరేట్ లో ఈ ఎన్నిక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి విశ్వ నారాయణకు ఈ రోజు నామినేషన్లు అందించారు. కాగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రెండు నామినేషన్లు వేయగా, పోచంపల్లి తరపున మరో రెండు నామినేషన్లు పడ్డాయి.మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి రమేశ్ తో కలిసి ఒక సెట్, …
Read More »MLC ఎన్నికలకు BJP దూరం.
తెలంగాణలో జరుగుతున్న స్థానిక సంస్థల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీజేపీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఇతర ముఖ్యనేతలతో సమావేశమై ఈమేరకు చర్చించినట్లు సమాచారం. అభ్యర్థులను నిలబెట్టినా పార్టీకి జిల్లాల్లో ఓట్లు వచ్చే అవకాశం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉండటమే ఉత్తమమని బీజేపీ భావిస్తోంది. కాగా, మొత్తం 12 స్థానాల్లో డిసెంబర్ 10న ఎన్నికలు జరగనున్నాయి.
Read More »AIRTEL కస్టమర్లకు Big Shock
ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ప్రీపెయిడ్ ఛార్జీల (టారిఫ్) ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంట్రీ టారిఫ్ వాయిస్ ప్లాన్లపై 20%, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లాన్లపై 25% వరకు పెంచనున్నట్లు తెలిపింది. ఛార్జీల పెంపు వల్ల ఒక్కో యూజర్పై వచ్చే సగటు ఆదాయం (Average Revenue Per User) రూ. 200-300కు చేర్చాలని భావిస్తోంది. పెరిగిన ఆదాయం 5G అమలుకు ఉపయోగపడుతుందని పేర్కొంది.
Read More »చంద్రబాబు భార్య భువనేశ్వరి గురించి వ్యాఖ్యలపై YSRCP MLA క్లారిటీ
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరి గురించి తానేమీ మాట్లాడలేదని, చంద్రబాబే అనవసరంగా ఆమెను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి (కాకినాడ) అన్నారు. అసెంబ్లీలో జరిగింది వేరు, బయట ప్రచారం చేస్తున్నది వేరని వ్యాఖ్యానించారు. నందమూరి కుటుంబం, భువనేశ్వరి అంటే తనకు గౌరవముందని చెప్పారు. కాగా, ‘లోకేశ్ ఎలా పుట్టాడో తెలుసా?’ అంటూ అసెంబ్లీలో ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
Read More »