Home / SLIDER / Delhi లో సీఎం కేసీఆర్ Busy Busy

Delhi లో సీఎం కేసీఆర్ Busy Busy

తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో రైతులు పండించే ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరి ఏంటో తెలుసుకోవాలని, ఆ తర్వాత ఇతర అంశాలపై దృష్టి పెడదామని సీఎం కేసీఆర్ అన్నట్లు తెలిసింది.

ఈ మేరకు ఆయన మంత్రులు, ఎంపీలతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో బీజేపీ భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఏర్పడిన గందరగోళంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంలోనే మంత్రి పీయూష్ గోయల్ను రాష్ట్ర మంత్రులు కలుస్తున్నట్లు సమాచారం.