ఇల్లంతకుంటలో టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ బుధవారం జరిగింది. ఈ సభకు హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ హాజరై ప్రసంగించారు. త్వరలో జరగబోయే ఉప ఎన్నికలో తనకు పోటీ చేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు శ్రీనివాస్ యాదవ్ పాదాభివందనాలు తెలిపారు. తనను గెలిపించాలని హరీశ్ రావుకు పార్టీ నాయకత్వం బాధ్యతలు అప్పగించారు. పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు అవకాశం ఇచ్చారు. విద్యార్థి నేతగా …
Read More »హుజూరాబాద్ నియోజకవర్గంలో సంబురాలు
హుజూరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించడంతో.. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు ఆయన మద్దతుదారులు సంబురాలు చేసుకుంటున్నారు. గెల్లు శ్రీనివాస్ పేరును సీఎం కేసీఆర్ ప్రకటించిన మరుక్షణమే పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటూ.. టపాసులు కాల్చారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు.గెల్లు అభ్యర్థితత్వంపై యువతలో ఉత్సాహం వెలువెత్తితింది. శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించుకుంటామని నియోజకవర్గంలోని ప్రతి ఊరు, వాడ ఏకోన్ముఖంగా ప్రకటిస్తున్నాయి. …
Read More »నా దేశాన్ని రక్షించండి -స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్తుండటంతో మరోసారి ఆ దేశం మెల్లగా తాలిబన్ల గుప్పిట్లోకి వెళ్తోంది. దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆఫ్ఘన్ సైన్యం, తాలిబన్ల మధ్య యుద్ధం సాధారణ ప్రజలను బలి తీసుకుంటోంది. తమ దేశం రావణకాష్టంగా మారుతుండటాన్ని చూసి తట్టుకోలేకపోతున్న స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్.. తమను ఇలా గందరగోళంలో వదిలేయకండి అని ప్రపంచ నేతలను వేడుకుంటున్నాడు. బుధవారం అతడు …
Read More »హుజూరాబాద్ లో మంత్రి హారీష్ రావుకి ఘన స్వాగతం
హుజూరాబాద్ మండలంలోని కేసీ క్యాంప్ వద్ద రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావుకు ఆ నియోజకవర్గ వాసులు ఘన స్వాగతం పలికారు. పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలు మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్‌తో కలిసి కేసీ క్యాంప్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్తూపానికి మంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. జై …
Read More »దేశంలో తగ్గని కరోనా కేసులు
దేశంలో ఉధృతి తగ్గడం లేదు. రోజువారీ కేసులు నిన్న భారీగా తగ్గగా.. తాజాగా మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 38,353 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3.20కోట్ల మార్క్‌ను దాటింది. తాజాగా 40,013 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు 3,12,20,981 మంది డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు 97.45శాతానికి చేరుకుందని …
Read More »TTD పాలకమండలి చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం ఆలయ బంగారు వాకిలిలో ఆయనతో ఈవో జవహర్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఇంతకు ముందు సుబ్బారెడ్డి 2019లో తొలిసారిగా టీటీడీ బోర్డు చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టగా.. ఈ ఏడాది జూన్‌లో పదవీకాలం ముగిసింది. ఈ సారి వేరే వారికి చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరిగినా.. చివరకు ఏపీ ప్రభుత్వం మరోసారి బోర్డు చైర్మన్‌గా సుబ్బారెడ్డికే …
Read More »త్వరలోనే జైలుకు రేవంత్ రెడ్డి
ఇంద్రవెల్లి సభలో సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. రేవంత్‌రెడ్డి.. సీఎం కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోరని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రేవంత్‌పై కేసులు చివరి దశలో ఉన్నాయని, పీసీసీ అధ్యక్షుడి హోదాలో జైలుకు వెళ్లనున్న ఖ్యాతి ఆయనకే దక్కనుందన్నారు. ‘‘సోనియమ్మ రాజ్యం కావాలని రేవంత్ అంటున్నడు. 2004లో తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా పదేళ్లపాటు నాన్చి వందల …
Read More »హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్
హుజూరాబాద్ ( Huzurabad ) టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ( Gellu Srinivas Yadav ) పేరును ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. దళిత బంధు ప్రారంభ సమావేశం సందర్భంగా ఈ నెల 16వ తేదీన హుజూరాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభలో గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ పరిచయం చేయనున్నారు. హుజూరాబాద్ …
Read More »రైతుబీమాకు 1,450 కోట్లు
రైతుబీమా పథకం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.1,450 కోట్లను విడుదలచేసింది. మంగళవారం వ్యవసాయంపై జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో 2021-22 సంవత్సరానికి రైతుబీమా ప్రీమియం చెక్కును మంత్రులు ఎల్‌ఐసీ ప్రతినిధులకు అందజేశారు. రైతులపై ఆర్థికభా రం పడొద్దనే ఉద్దేశంతో మూడేండ్లుగా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్నది. రైతులు.. ఏ కారణం చేత మరణించినా వారి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందేలా చూస్తున్నది. సమావేశంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, కేటీఆర్, …
Read More »తిరుమలేశుడి సేవలో ఎంపీ సంతోష్ కుమార్
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎంపీ సంతోష్ కుమార్ దర్శించుకున్నారు. సతీసమేతంగా తిరుమల చేరుకున్న ఆయన బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు సంతోష్ కుమార్ దంపతులకు ఆశీర్వచనం అందించగా, టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి వారికి స్వామివారి పట్టు వస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. నేడు ఎంపీ సంతోస్ కుమార్ వివాహ వార్షికోత్సం కావడంతో …
Read More »