ఏపీలో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేశ్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరో 3 వారాల్లో పరీక్షలు ప్రారంభం కానున్నందున కరోనా ఉద్ధృతి దృష్ట్యా అందరినీ పాస్ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణ సహా 12 రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలను రద్దు చేశాయని గుర్తు చేశారు. విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారని, హైకోర్టు ఆదేశాలు లేదా ప్రతిపక్ష ఆందోళనల …
Read More »మంత్రి హారీష్ రావు ఔదార్యం
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఆదేశాలతో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సీటీ స్కాన్ రేట్లు తగ్గాయి. రూ.2 వేలకే స్కాన్ చేసేందుకు డయాగ్నోస్టిక్ కేంద్రాలు అంగీకరించాయి. సీటీ స్కాన్ కోసం రూ. 5,500 వసూలు చేయడంపై మంత్రి హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేట్లను సగానికి తగ్గించాలన్నారు. అందుకు వారు ఓకే చెప్పారు.
Read More »తెలంగాణలో కరోనా కేసుల్లేని ఏకైక గ్రామం అదే..?
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మయ్యపేటలో ఇప్పటివరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, వారానికి 2 సార్లు ఊరంతా శానిటైజేషన్, శుభకార్యాలకు కొద్దిమంది బంధువులకే పిలుపు, ఊర్లోకి ఎవరు వచ్చినా సాయంత్రానికే వెళ్లిపోవడం వంటి పంచాయతీ తీర్మానాలతో ఆ ఊరు భద్రంగా ఉంది. సెకండ్ వేవ్లో ఒక వ్యక్తికి స్పల్ప లక్షణాలు కనబడినా టెస్ట్ …
Read More »భైంసాలో బ్లాక్ ఫంగస్ కలవరం
తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ కి చెందిన ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్క హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై ఆస్పత్రి యాజమాన్యం మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక బ్లాక్ ఫంగస్ లక్షణాలతో ముగ్గురు గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఈ ఫంగస్పై స్పందించిన గాంధీ సూపరింటెండెంట్ రాజారావు.. స్టెరాయిడ్స్ తీసుకున్న అందరికీ ఈ సమస్య రాదన్నారు.
Read More »తెలంగాణలో లాక్డౌన్ పొడిగిస్తారా..?
తెలంగాణలో లాక్డౌన్ను కొనసాగించాలా? లేదా? అనే అంశంపై 20న కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని ‘ఆస్క్ మంత్రి కేటీఆర్’ లో మంత్రి KTR ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇప్పటికే పూర్తి లాక్డౌన్ విధించకపోవడంపై విమర్శలు వస్తున్నాయని చెప్పారు. 4 గంటలకు మించి సడలింపులు ఇచ్చే అవకాశం లేదన్నారు. అటు త్వరలోనే తానూ ప్లాస్మా దానం చేస్తానన్నారు. కరోనా వస్తే మానసికంగా దృఢంగా ఉండాలని, సొంత వైద్యం వద్దని, వ్యాయామం చేయాలని చెప్పారు.
Read More »సీఎం కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్రంలోని ముస్లింలకు సీఎం కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం.. శాంతి, ప్రేమ, దయను పంచుతోందన్నారు. రాష్ట్రంలో గంగా జమునా తహజీబు రంజాన్ పండగ ప్రతీక అని చెప్పారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ముస్లింల జీవితాల్లో వెలుగును నింపుతున్నాయని చెప్పారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
Read More »అనుపమ తనదైన శైలీలో రంజాన్ శుభాకాంక్షలు
పవిత్ర రంజాన్ సందర్భంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం యువతిలా ఈద్ ముబారక్ తెలుపుతూ ఆకర్షణీయ లుక్లో అలరించారు. అనుపమ తన స్టన్నింగ్ ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దీనిపై ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Read More »చాహల్ కుటుంబంలో కరోనా కలవరం
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తల్లిదండ్రులు కొవిడ్ బారినపడ్డారు. చాహల్ తండ్రికి తీవ్రమైన కరోనా లక్షణాలు ఉండటంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు.. తల్లి ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని చాహల్ భార్య ధనశ్రీ వర్మ ఇన్స్టాగ్రామ్ లో వెల్లడించింది. ‘దయచేసి ఇంట్లోనే ఉంటూ మీ కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ ధనశ్రీ ఇన్స్టాలో రాసుకొచ్చింది.
Read More »మహారాష్ట్రలో కరోనా బీభత్సం
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి శాంతించట్లేదు. కొవిడ్ కేసులతో పాటు వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 42,582 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, 850 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 54,535 మంది కరోనా రోగులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,33,294 యాక్టివ్ కేసులు ఉన్నాయి. లాక్డౌన్ పెట్టిన కేసులు తగ్గట్లేదు.
Read More »రెండు వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకుంటే ఏమవుతుంది?
రెండు వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకుంటే ఏమవుతుంది అనే అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మొదటి డోసులో ఓ కరోనా వ్యాక్సిన్ తీసుకుని రెండో డోసులో పొరపాటున మరో కంపెనీ వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతుంది?. బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ దీనిపై అధ్యయనం చేసి వివరాలు వెల్లడించింది. ఇలా వేర్వేరు కంపెనీల వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో అలసట, తలనొప్పి వంటి సైడ్ ఎఫెక్ట్స్ తప్ప ఇతర సమస్యలు రాలేదని నిపుణులు చెబుతున్నారు.
Read More »