కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినందుకా లేక బీడీ కార్మికులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చినందుకా అని ఆ పార్టీ నేతలు చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్, బీడీ కార్మికులకు పెన్షన్ పథకాల్లో కేంద్రం వాటా ఒక్కపైసా లేదని స్పష్టం చేశారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఏనాడైనా బీడీ కార్మికులకు రూపాయి ఇచ్చరా అని …
Read More »తెలంగాణలో స్కూళ్లకు ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు
తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి వేసవి సెలవుల నిర్ణయంపై గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్షించారని మంత్రి తెలిపారు. కరోనా విస్తరించిన …
Read More »తెలంగాణలో కొత్తగా 8,126 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 8,126 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 3,95,232కు పెరిగింది. కొవిడ్ ధాటికి మరో 38 మంది చనిపోగా, కరోనా మరణాల సంఖ్య 1999కు చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 62, 929 యాక్టివ్ కేసులున్నాయి. మరో 3,307 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 3.30 లక్షలకు చేరింది.
Read More »దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు నానాటికి రికార్డు స్థాయిలో వెలుగుచూస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో 3,49,691 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసులు 1,69,60,172 పెరిగాయి. మరో 2,767 మంది మరణించగా, మృతుల సంఖ్య 1,92,311కు చేరింది. దేశవ్యాప్తంగా 1,40,85,110 మంది కోలుకోగా, ప్రస్తుతం దేశంలో 26,82,751 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »గ్రేటర్ పరిధిలో కరోనా డేంజర్ బెల్స్
గ్రేటర్ పరిధిలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడచిన 24 గంటల్లో మరో 1,259 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 97,178 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గరలోని ఆస్పత్రిలో పరీక్షలు చేసుకోవాలని తెలిపారు.
Read More »మమతా మోహన్ దాస్ రీఎంట్రీ
దాదాపు పదేళ్ల పాటు టాలీవుడు దూరమైన అందాల నటి, గాయని మమతా మోహన్ దాస్.. మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఈ అమ్మడు నటించిన లాలాబాగ్ అనే మలయాళ చిత్రం.. తెలుగులోనూ డబ్ కానుంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ను ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేయనున్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘రాఖీ’ టైటిల్ సాంగ్, చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’లోని స్పెషల్ సాంగ్తో మమత మంచి గుర్తింపు …
Read More »మరో వెబ్ సిరీస్ లో మిల్క్ బ్యూటీ
లెవెన్త్ అవర్’తో డిజిటల్ తెరపై అడుగుపెట్టిన నటి తమన్నా.. మరో వెబ్ సిరీస్ కి ఓకే చెప్పిందట. దీని కోసం. ఓ యువ దర్శకుడు స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు టాక్. ఇందులో మంచి కాన్సెప్ట్ పాటు కాస్త బోల్డ్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇది ఆహా ఓటీటీ ఒరిజినల్గా తెరకెక్కనుంది. దీనితో పాటు తమన్నా చేతిలో ‘ఎఫ్ 3’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘సీటీమార్’, ‘మాస్ట్రో’ సినిమాలు ఉన్నాయి.
Read More »మాజీ ఎమ్మెల్యే కుంజ భిక్షం మృతి
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కుంజ భిక్షం మృతి చెందారు. గత నెల బెయిన్ స్ట్రోక్ రావడంతో ఆస్పత్రికే పరిమితమైన ఆయన.. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. కుంజా భిక్షం 1989-99 కాలంలో 10 ఏళ్లు బూర్గంపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన మరణం పట్ల సీఎం కేసీఆర్, మంత్రి సత్యవతి రాథోడ్లు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు …
Read More »మరోసారి గ్రేటర్ వరంగల్ పై గులాబీ జెండా ఎగరడం ఖాయం….
గ్రేటర్ వరంగల్ ఎన్నికలలో భాగంగా 1&2వ డివిజన్ గుండ్లసింగారం, పెగడపల్లి, వంగపహాడ్ గ్రామాలలో రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారితో కలిసి వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 1&2వ డివిజన్ అభ్యర్థులు గణిపాక కల్పన, బానోత్ కల్పన గారి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ …
Read More »తెలంగాణలో అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్
వ్యాక్సిన్ పంపిణీపై తెలంగాణ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్టు శనివారం ప్రకటించింది. 18 నుంచి 45 ఏళ్ల లోపు ఉన్నవారికి ఉచిత వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ఏపీ సర్కార్ శుక్రవారం ప్రకటించింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒకడుగు ముందుకు వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు కోట్ల మందికి వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇప్పటివరకు 30 లక్షల మందికి వ్యాక్సిన్ అందించిన సర్కార్.. ఇక …
Read More »