భారతీయ బ్యాంకింగ్ సంస్కరణల పితామహుడు, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఎం.నరసింహం (94) కన్నుమూశారు. కరోనాతో హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు RBI ప్రతినిధి ఒకరు తెలిపారు. 1977 మే నుంచి నవంబర్ మధ్య నరసింహం RBI గవర్నర్ బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. వరల్డ్ బ్యాంక్, IMFలో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించారు.
Read More »కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర సంచలన నిర్ణయం
కరోనా కట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి విదితమే..అయిన కానీ కేసులు మాత్రం భారీగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.. రాష్ట్ర వ్యాప్తంగా కఠిన లాక్డ్ డౌన్ విధించాలని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. దీనిపై ఉన్నతాధికారులతో చర్చ అనంతరం సీఎం ఉద్ధవ్ ఠాక్రే లాక్డౌన్పై రేపు ప్రకటన చేయనున్నారు
Read More »దేశ ప్రజలకు కోహ్లీ పిలుపు
దేశ ప్రజలకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పిలుపునిచ్చాడు. ఇందులో భాగంగా ప్రజలు కరోనా నిబంధనలు తప్పక పాటించాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కోరాడు. ఇంకా.. ‘ మిత్రులారా.. దేశంలో కరోనా పెరుగుతోందని మీ అందరికీ తెలుసు. అత్యవసర పనిమీద బయటికెళ్లినపుడు మాస్క్ ధరించండి. సామాజిక దూరం పాటించండి. శానిటైజ్ చేసుకోండి. పోలీసులకు సహకరించండి. ఇవన్నీ ప్రతి ఒక్కరూ తప్పక పాటించవలసిన జాగ్రత్తలు. ఇంతకు ముందూ చెప్పాను. మీరు …
Read More »తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు..!
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. సీతారాముల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని, అందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఏటా వైభవంగా జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కరోనా కారణంగా సామూహికంగా జరుపుకోలేక పోతున్నామని పేర్కొన్నారు. భద్రాచలంలో రాములోరి కల్యాణాన్ని నిర్వహిస్తున్నామని, భక్తులు టీవీల ద్వారా వీక్షించాలని కోరారు.
Read More »తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శ్రీ రామనవమి శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువులో శుద్ధ నవమి నాడు ప్రతిఏటా వైభవోపేతంగా జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కరోనా ప్రభావం చేత సామూహికంగా జరుపుకోలేక పోతున్నామన్నారు. భద్రాచల పుణ్యక్షేత్రంలో పరిమిత సంఖ్యలో దేవాలయ పూజారులు అధికారుల ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న రాములవారి కళ్యాణమహోత్సవాన్ని ఆన్ లైన్ ప్రసారాల ద్వారా సీతారామభక్తులందరూ దర్శించుకోవాలని సిఎం కోరారు. లోక …
Read More »రాహుల్ గాంధీకి కరోనా
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కోవిడ్ లక్షణాలు స్పల్పంగా కనిపించినట్టు రాహుల్ స్వయంగా ఓ ట్వీట్‌లో తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారు సేఫ్టీ ప్రోటోకాల్‌ను పాటించాలని, సురక్షితంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ ఇటీవల రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు.
Read More »దేశంలో కరోనా విలయతాండవం
దేశాన్ని కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. భారీ సంఖ్యలో నమోదవుతున్న కేసులు తీవ్ర ఆందోళనకరంగా మారాయి. దేశంలో ఒక్కరోజే కొత్తగా.. 2,59,170 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి కొత్తగా 1,761 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం మృతుల సంఖ్య 1.80లక్షలకు చేరింది. ప్రస్తుతం దేశంలో 20,31,977 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్లో అత్యధిక కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో భారీగా నమోదవుతున్నాయి.
Read More »రవితేజ మూవీకి కరోనా బ్రేక్
టాలీవుడ్ ఇండస్ట్రీని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది.తాజాగా రవితేజతో ‘ఖిలాడి’ మూవీ తెరకెక్కిస్తున్న దర్శకుడు రమేష్ వర్మకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఖిలాడి చిత్రాన్ని మే 28న విడుదల చేయాలని మేకర్స్ భావించగా, ఇప్పుడు ఆయనకు కరోనా సోకడం ఇబ్బందిగా మారింది. ఖిలాడి చిత్ర షూటింగ్ కొంత బ్యాలెన్స్ ఉంది.
Read More »గ్రేటర్ పరిధిలో భారీగా కరోనా కేసులు
గ్రేటర్ పరిధిలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.GHMCలో గడచిన 24 గంటల్లో మరో 793 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 91,563 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read More »దేశంలో ఐదుగురు సీఎంలకు కరోనా
కరోనావైరస్ దెబ్బకు సామాన్యుల నుంచి ప్రభుత్వాధినేతల వరకు ఎవ్వరూ తప్పించుకోవట్లేదు. ఇప్పటివరకు దేశంలో ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడ్డారు. తమిళనాడు సీఎం పళనిస్వామి, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం యడియూరప్ప, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఐసోలేషన్లో చికిత్స తీసుకుంటున్నారు. మాజీ ప్రధానులు దేవెగౌడ, మన్మోహన్ సింగ్ కూడా కరోనా బారిన పడ్డారు.
Read More »