తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలకు, ఆనందాలకు ప్రతీకగా జరుపుకొనే ఉగాది తెలుగువారికి పవిత్రమైన పండుగగా అభివర్ణించారు. ఈ ఉగాది కొవిడ్ వైరస్ నుంచి మానవజాతికి రక్షణ కల్పించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తంచేశారు. కొవిడ్ రెండోదశను ప్రజలంతా ధైర్యంగా ఎదుర్కోవాలని, అప్రమత్తంగా వ్యవహరించి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. శాసనమండలి చైర్మన్ గుత్తా …
Read More »కార్గోలో బాలామృతం కిట్లు
తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలు అన్ని రంగాలకు విస్తరిస్తున్నాయి. కూరగాయలు మొదలు ఉచిత పాఠ్యపుస్తకాల వరకు అన్నింటినీ కార్గో ద్వారా జిల్లాలకు రవాణాచేస్తున్నారు. టీఎస్ ఫుడ్ ఆధ్వర్యంలో తయారవుతున్న బాలామృతం కిట్లు కూడా జిల్లాలకు కార్గోలో రవాణాచేస్తున్నారు. అక్కడి నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు పంపుతున్నారు. బాలామృతాన్ని 9 నెలల నుంచి ప్రతిరోజూ దాదాపు 40 టన్నుల వరకు కార్గో ద్వారా విజయవంతంగా రవాణాచేస్తున్నారు. ఇందుకు 10 నుంచి 15 కార్గో …
Read More »సీఎం కేసీఆరే మాకు ఆదర్శం -మంత్రి హారీష్
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోటి అందాలతో కోమటి చెరువు ముస్తాబవుతుందని పాడిన పాటను, కేసీఆర్ కలలు గన్న సిద్దిపేటను ఇవాళ నిజం చేస్తూ పట్టణ ప్రజలకు అందిస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట కోమటి చెరువుపై గ్లోగార్డెన్‌ను ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్‌రాజుతో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. …
Read More »సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం .రేషన్ కార్డు లేకున్నా సరే..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రైవేటు స్కూల్ టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వ అందించే 25 కిలోల సన్న బియ్యం ఆహార భద్రతా కార్డు/ రేషన్‌కార్డు లేకున్నా ఇవ్వాలని నిర్ణయించారు. టీచర్లు, సిబ్బంది నివాస ప్రాంతాలకు సమీపంలోని రేషన్‌షాపుల్లోనే బియ్యాన్ని అందజేయనున్నారు. చాలామంది ప్రైవేటు స్కూల్ సిబ్బందికి రేషన్‌కార్డులు లేవు. దరఖాస్తుల్లో భాగంగా రేషన్‌కార్డు/ ఆహార భద్రతా కార్డు …
Read More »భారత్ లో కరోనా విలయం
ప్రస్తుతం మన దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు భారీ స్థాయిలో నమోదు అవుతున్నాయి. రెండోదశలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. నిన్న ఒకే రోజు రికార్డు స్థాయిలో 1.68 లక్షల కేసులు నమోదవగా.. తాజాగా 1.61లక్షలకుపైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,61,736 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ …
Read More »త్వరలోనే కొత్త రేషన్‌కార్డులు, పెన్షన్లు : మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ర్ట ప్రజలకు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు అందిస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ నగర పర్యటన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. ఎన్నిక ఏదైనా, సందర్భం ఏదైనా కేసీఆర్ తమ నాయకుడు అని భారీగా ప్రజలు తరలివచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వరంగల్ ప్రజల ఆశీర్వాదం సీఎం కేసీఆర్‌కు ఉండాలన్నారు. వరంగల్ పట్టణ అభివృద్ధి కోసం …
Read More »దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కరోనా కలకలం
దేశ అత్యున్నత న్యాయస్థానంలో కరోనా కలకలం రేపింది. సుప్రీంకోర్టులోని 50 శాతం మంది సిబ్బంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఇక నుంచి కేసులను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇంటి నుంచే నిర్వహించాలని న్యాయమూర్తులు నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం కోర్టురూమ్‌లతోపాటు సుప్రీంకోర్టు ఆవరణ మొత్తాన్నీ శానిటైజ్ చేస్తున్నారు. కోర్టులోని అన్ని బెంచీలు ఒక గంట ఆలస్యంగా విచారణలు మొదలుపెట్టనున్నాయి.
Read More »అత్యాధునిక సమీకృత మార్కెట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ నగరంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా వరంగల్ నగరం లక్ష్మీపురంలో రూ. 24 కోట్లతో నిర్మించిన అత్యాధునిక సమీకృత మార్కెట్‌ను, రూ. 6.24 కోట్లతో నిర్మించిన ఆదర్శ కూరగాయల మార్కెట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఎల్బీనగర్‌లో నిర్మిస్తున్న షాదీ ఖానా, మండి బజార్ లో నిర్మిస్తున్న హజ్ హౌజ్ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.60 కోట్లు నిధులతో పూర్తిచేసిన ఆర్‌వోబీ, …
Read More »తెలంగాణలో కొత్తగా 2251 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. శనివారం రాత్రి వరకు 3 వేలకుపైగా నమోదవగా, తాజాగా అంతకంటే వెయ్యి తక్కువ కేసులు రికార్డయ్యాయి. ఆదివారం రాత్రి 8 గంటల వరకు మరో 2251 మందికి కరోనా వైరస్ సోకింది. కొత్తగా 565 మంది మహమ్మారి బారినుంచి బయటపడగా, మరో ఆరుగురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,29,529కి చేరింది. ఇప్పటివరకు 1765 మంది మరణించగా, 3,05,900 మంది …
Read More »తెలంగాణలో త్వరలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కానున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ఆదివారం ట్విట్టర్ వేదికగా ప్రజలతో #askktr పేరిట ముచ్చటించారు. క్రికెట్, సినిమా, రాజకీయాలు, పెట్టుబడులు, వ్యాక్సినేషన్, ఉద్యోగాలు వంటి పలు అంశాలపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. నెటిజన్ల ప్రశ్నలకు మంత్రి ఈ విధంగా స్పందించారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత ఉన్న మాట వాస్తవమే అన్నారు. …
Read More »