తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కరోనా బారినపడ్డారు. తనకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని స్వయంగా ఆయనే పేర్కొన్నారు. వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకొని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ కోరారు. ఇవాళ ఉదయమే కరోనా నియంత్రణపై కలెక్టర్లతో సోమేష్‍కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Read More »దేశంలో కరోనా కలవరం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 96,982 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,26,86,049కు పెరిగింది. మహమ్మారి ప్రభావంతో మరో 446 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా 50,143 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 7,88,223కు చేరాయి. ఇప్పటి వరకు 1,17,32,279 …
Read More »విజయ్ సైకిల్ పై ఎందుకోచ్చాడో తెలుసా..?
ఈ రోజు మంగళవారం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కోలివుడ్ టాప్ హీరో విజయ్ దళపతి పోలింగ్ బూత్‌కు సైకిల్‌పై వచ్చి తన ఓటు వేయడంపై సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో చర్చ జరుగుతోంది. ఒక పార్టీకి వ్యతిరేకంగానే ఆయన ఇలా సైకిల్‌పై వచ్చి ఓటేశారని, ఎవరిని ఓడించాలో చెప్పకనే చెప్పారని నెటిజెన్లు చర్చించుకుంటున్నారు. దేశంలో ఇప్పటికే తీవ్ర స్థాయిలో అధికమై, ఇంకా పెరుగుతూ పోతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగానే …
Read More »ఆర్ఆర్ఆర్ అసలు “కథ” ఇదేనా..?
మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్(రణం రౌద్రం రుధిరం)’. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత తెరకెక్కిస్తోన్న సినిమా ఇది. అంతే కాదు.. టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం. ఇదొక ఫిక్షనల్ పీరియాడికల్ మూవీ. తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను …
Read More »అదిరిపోయిన రష్మిక మందన్న ఫస్ట్‌లుక్
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకుడు. సోమవారం కథానాయిక రష్మిక మందన్న జన్మదినం సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఇందులో ఆమె పసుపు రంగు చీరలో బంతిపూల మాల అల్లుతూ కనిపిస్తోంది. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తామని చిత్రబృందం పేర్కొంది.
Read More »తెలంగాణ కాంగ్రెస్ కి బిగ్ షాక్ -షర్మిల పార్టీలో చేరిన నేత
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు అచ్యుతా యాదవ్.. పార్టీ పదవికి రాజీనామా చేసి, షర్మిలకు మద్దతు పలికారు. ఈమేరకు సోమవారం ఆమె షర్మిలను కలిసినట్లు లోట్‌సపాడ్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. అలాగే, కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన ఒకరు, నారాయణ్‌పేట్ జిల్లా మక్తల్‌కు చెందిన ఆరుగురు మాజీ సర్పంచ్‌లు, పలువురు న్యాయవాదులు షర్మిలను కలిసి మద్దతు తెలిపినట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా, …
Read More »హల్దీ, గజ్వేల్ కాల్వలోకి కాళేశ్వర జలాలు విడుదల చేసిన సీఎం కేసీఆర్
కాళేశ్వర ప్రాజెక్టు ప్రస్థానంలో మంగళవారం మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వలో పారుతున్న కాళేశ్వర జలాలను.. వర్గల్ మండలం అవుసులపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దీ కాల్వలోకి కాళేశ్వర జలాలను విడుదల చేశారు. హల్దీ కాల్వలోకి 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అనంతరం మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో కాళేశ్వర జలాలను గజ్వేల్ కాల్వలోకి విడుదల చేశారు. నీటి విడుదల సందర్భంగా …
Read More »సంక్షేమ సంఘాలు కాలనీల అభివృద్ధికి దోహదపడాలి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని సుమిత్ర నగర్ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద సభ్యులందరూ మర్యాదపూర్వంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కమిటీ సభ్యులందరూ ఐకమత్యంతో ఉండి సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కాలనీ అభివృద్ధికి తన పూర్తి …
Read More »కాళేశ్వర ప్రాజెక్టు విస్తరణలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం
తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా అభివృద్ధి చేయాలనే భగీరథ తలంపుతో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ కార్యాచరణ నేడు కీలక మైలురాయిని దాటింది. ఇప్పటికే మేడిగడ్డ నుండి మిడ్ మానేరుకు చేరిన కాళేశ్వరం జలాలు.. అక్కడినుంచి కొండపోచమ్మ సాగర్ కు చేరుకున్నవి. మంగళవారం నాటి జలాల విడుదల కార్యక్రమం ద్వారా కొండపోచమ్మ సాగర్ జలాలను మొదట హల్దీ వాగులోకి వదిలి, మంజీరా నది ద్వారా నిజాం సాగర్ …
Read More »తెలంగాణలో కరోనా కలవరం
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆదివారం రాత్రి గం.8 వరకు కొత్తగా 1,097 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,13,237కు చేరాయి. ఇక నిన్న ఆరుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,723కి పెరిగింది. నిన్న కరోనా నుంచి 268 మంది కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 8,746 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »