యాలకులతో ప్రయోజనాలు ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..? జలుబు, దగ్గు, కఫం తగ్గుతాయి నోటి అల్సర్ ను అరికడుతాయి ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి ఊపిరితిత్తులను సంరక్షిస్తాయి అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. వికారం, కడుపు ఉబ్బరం తగ్గిస్తాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి డయాబెటీసన్ను అరికడుతాయి
Read More »నిధి అగర్వాల్ కి షాక్
తమిళనాడులో కొందరు అభిమానులు తనకు గుడి కట్టడంపై నిధి అగర్వాల్ షాక్ అయింది. వారు తనపై ఇంత ప్రేమ చూపిస్తారని ఊహించలేదని, ఈ అభిమానాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని తెలిపింది. అటు తనకోసం నిర్మించిన గుడిని చదువుకు లేదా నిర్వాసితులకు షెల్టర్ కోసం ఉపయోగించాలని కోరింది.
Read More »సరికొత్తగా బెల్లకొండ శ్రీనివాస్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఛత్రపతి రీమేక్ తో హిందీ ప్రేక్షకుల్ని పలకరించనుండగా.. ఇదే సమయంలో మరో తెలుగు చిత్రంలో నటించేందుకు సిద్దం అవుతున్నాడట. కొత్త దర్శకుడు శ్రీరామ్ చెప్పిన కథ, కథానాయకుడి పాత్ర నచ్చడంతో ఆ ప్రాజెక్టుకు శ్రీనివాస్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుండగా.. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ మూవీని నిర్మించనుంది
Read More »రాంచరణ్ సరసన రష్మిక
దర్శకుడు శంకర్ త్వరలోనే మెగాపవర్ స్టార్ రాంచరణ్ తో ఓ మూవీ చేయనున్నాడు. ఇది శంకర్, చరణ్లకు వాళ్ల కెరీర్ లో 15వ సినిమా కాగా… ఈ మూవీని నిర్మించే శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ కు మాత్రం 50వ సినిమా. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన నటించనుందని వార్తలొస్తున్నాయి. చాలా బిజీగా ఉన్నప్పటికీ శంకర్ దర్శకత్వం కావడంతో రష్మిక కూడా ఓకే చెప్పిందని తెలుస్తుండగా.. త్వరలోనే …
Read More »రాజస్థాన్ రాళ్లతో తెలంగాణ సచివాలయం
తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణంలో రాజస్థాన్ రాళ్లను వినియోగించనున్నారు. పార్లమెంట్ లో ఉన్న ఫౌంటెయిన్ల మాదిరే ఇక్కడా ఏర్పాటు చేయనుండగా రాజస్థాన్ లోని ధోల్పూర్ రాతిని తెప్పించాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. భవనం మధ్య భాగంలో బీజ్ రంగు రాతి పలకలను వినియోగించేలా నమూనాలను రూపొందించారు. రాజస్థాన్ వెళ్లి యంత్రాల ద్వారా చెక్కించిన రాతి పలకలను కాకుండా మనుషులతో చెక్కించినవి పరిశీలించాలని సీఎం సూచించారు.
Read More »సొంత ఇలాఖాలో చంద్రబాబుకి షాక్
ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత,సీఎం జగన్ పనితీరును మెచ్చే మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారని మంత్రి కన్నబాబు అన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో 89 పంచాయతీల్లో 74చోట్ల వైసీపీ మద్దతుదారులే గెలిచారని, ఈ ఫలితాలు చంద్రబాబు, లోకేశ్ కు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు గతంలో చంద్రగిరిని వదిలి కుప్పం చేరుకున్న చంద్రబాబు.. ఇప్పుడు పక్క రాష్ట్రాలు, …
Read More »దంతాలపై గార పోవాలంటే..?
దంతాలపై గార పోవాలంటే నిమ్మకాయ, పేస్టు, వంటసోడాలను కలిపి వాడాలి. ఇలా నెలకు రెండుసార్లు చేస్తే మంచిది. ఉప్పు, బొగ్గుపొడిని కలిపి ఆ మిశ్రమంతో దంతాలు తోముకుంటే తళతళ మెరుస్తాయి. ఉప్పులో బోలెడు ఖనిజాలు ఉండడంతో ఇవి దంతాలను శుభ్రంగా ఉంచుతాయి. చిగుళ్లకు సంబంధించిన వ్యాధి ఉంటే మాత్రం ఉప్పు వాడకూడదు. టొమాటో, కమలం, నిమ్మ బత్తాయితో పాటు క్యారెట్ కొరికి తింటే దంతాలకు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు
Read More »హమాలీల ఛార్జీలు పెంపు
తెలంగాణలో పౌరసరఫరాల సంస్థ గోదాముల్లో పనిచేస్తున్న హమాలీల ఛార్జీలు పెంచుతున్నట్లు ఆ సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఈ పెంచిన హమాలీల ఛార్జీలు 2021 జనవరి నుంచి అమలు చేస్తామని ఆయన వెల్లడించారు
Read More »తెలంగాణలో కొత్తగా 163 కరోనా కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,97,113కి చేరింది. ఇందులో 1,700 యాక్టివ్ కేసులు ఉండగా.. 658 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇప్పటివరకు 2,93,791 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనాతో ఇద్దరు చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 1,622కి చేరింది.
Read More »వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు బంపర్ ఆఫర్
వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు బంపర్ ఆఫర్ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా (Vi) తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రిపెయిడ్ కస్టమర్లకు రాత్రి సమయంలో అన్లిమిటెడ్ డేటా ఉచితంగా అందిస్తోంది. రూ.249 ఆపైన అన్లిమిటెడ్ డైలీ డేటా రీఛార్జ్ కు ఇది వర్తిస్తుంది. రాత్రి 12 గంటల నుంచి ఉదయం వరకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఫ్రీ డేటా వాడుకోవచ్చు. డైలీ డేటా కోటా అలాగే ఉంటుంది …
Read More »