Home / Tag Archives: slider (page 816)

Tag Archives: slider

కొత్త రేషన్ కార్డులు,పించన్లపై సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హాలియాలో జరిగిన బహిరంగ సభ వేదికగా సీఎం కేసీఆర్ కొత్త రేషన్ కార్డులు,పించన్లపై శుభవార్త తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ “కరోనా వల్ల చాలా సమస్యలు పెండింగ్‌ లో ఉన్నాయి. నల్గొం డ జిల్లా నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్రజానీకానికి, నిరుపేదలకు నేను శుభవార్త చెబుతున్నాను. అర్హులైన వారందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేసే కార్యక్రమాన్ని త్వరలోనే చేపడుతాం. అట్లాగే కొంత …

Read More »

నాగార్జున సాగర్ ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసినన్ని పనులు ఇండియాలో మరే రాష్ట్రంలోనైనా చేశారా? మంచిగున్నదాన్ని.. మంచి ప్రభుత్వాన్ని.. మంచి చేసేటోళ్లను నిలబెట్టుకోవాలె. చెడగొట్టుకుంటే మనం ఆగమైపోతం. నేను చెప్పే మాటలో ఒక్క అబద్ధం ఉన్నా రేపు నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ను ఓడగొట్టండి. నేను చెప్పేది నిజమైతే వేరే పార్టీలకు డిపాజిట్లు దక్కకుండా టీఆర్‌ఎస్‌ జెండా ఎగురేయండి. టీఆర్‌ఎస్‌కే ఓటు అడిగే హక్కు ఉన్నది. మంచి చేసినవాళ్లను గెలిపిస్తే మరింత మంచి …

Read More »

హద్దుమీరితే తొక్కేస్తాం

మేం తలచుకుంటే దుమ్ముదుమ్మైపోతరు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బీజేపీ నాయకులను హెచ్చరించారు. తెలంగాణను అరిగోస పెట్టిన లఫంగిపార్టీ.. దోపిడీ దొంగల పార్టీ కాంగ్రెస్‌ అని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు అధికా రం ఇచ్చారని.. ఏ ఢిల్లీవోడో నామినేట్‌ చేస్తేనో. ఇంకెవడో ఇస్తేనో రాలేదని పేర్కొన్నారు. ఏండ్లు గా తెలంగాణ ఈ దుస్థితికి రావడానికి కారణమైన కాంగ్రెస్‌కు తెలంగాణ పేరు ఉచ్ఛరించే అర్హతే లేదని చెప్పారు. రాష్ర్టానికి అన్యాయం …

Read More »

నల్లగొండ నీటి సమస్యలకు పరిష్కారం

ఏడాదిన్నరలో నల్లగొండ సాగునీటి కష్టాలను శాశ్వతంగా పరిష్కరిస్తానని, జిల్లాను సస్యశ్యామలంగా మారుస్తానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. చెప్పినవిధంగా నీళ్లియ్యకపోతే ఓట్లు అడగబోమని పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండలో 13 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపనచేశామని చెప్పారు. బుధవారం నల్లగొండ జిల్లా హాలియా బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ప్రతి ఎకరాకూ సాగునీరిస్తా నల్లగొండ చాలా చాలా నష్టపోయినా జిల్లా. అనాదిగా కష్టనష్టాలు పడ్డ జిల్లా. ఎన్నడూ ఏ …

Read More »

రైతుబంధు కోసం రూ.14,500కోట్ల నిధులు

తెలంగాణ రాష్ట్రంలో ఏటా రెండు కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతుల్లో ధీమా పెంచామని, ఇప్పటికే రైతుబంధు కోసం రూ.14,500 కోట్ల నిధులు వెచ్చించినట్టు స్పష్టం చేశారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కంది, సంగారెడ్డి, కొండాపూర్‌, సదాశివపేట మండలాల్లో రైతు వేదికలను మంత్రి ప్రారంభించారు. ఆయాచోట్ల మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2,500 రైతు వేదికలకు రూ.600 కోట్లు ఖర్చు …

Read More »

తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష

తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆరే శ్రీరామరక్ష అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, కామేపల్లి మండలాల్లో ఎమ్మెల్యే హరిప్రియానాయక్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, కలెక్టర్‌ ఎమ్వీ రెడ్డితో కలిసి మంత్రి పర్యటించారు. ఇల్లెందులో బస్‌డిపోకు శంకుస్థాపన చేశారు. అనంతరం బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. సీఎల్పీ నేత …

Read More »

నేడే మేయర్ ఎన్నిక

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు వేళయింది. గురువారం ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. 12.30 గంటలకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికను నిర్వహించనున్నారు. ఎన్నికకు సంబంధించి టీఆర్‌ఎస్‌ విప్‌ జారీచేసింది. జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ధీమా వ్యక్తంచేశారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్సీ ప్రభాకర్‌తో కలిసి తలసాని …

Read More »

మార్చి నాటికి RRR పూర్తి

రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న RRR మూవీ షూటింగ్ మార్చి 2వ వారం నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొదలు కాగా.. కీరవాణి అందించే BGM ఈ మూవీ మొత్తంలోనే హైలెట్ గా ఉంటుందట. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం మెగా-నందమూరి కుటుంబాల హీరోలు కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read More »

అరటి ఆకులో.. భోజనం ఎందుకంటే..?

అరటి ఆకులో భోజనం ఆచారాల్లో భాగం. ఈ ఆకులో విటమిన్లు ఉంటాయి. వేడి పదార్ధాలను దాని మీద తినేటప్పుడు ఆ విటమిన్లు తినే ఆహారంలో కలిసి శరీరానికి పోషకాలు అందజేస్తాయి. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. శరీరానికి బలం చేకూరుతుంది. బాగా ఆకలి వేస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఒకవేళ అన్నంలో విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది. ఆకులను పడేసినా ఈజీగా మట్టిలో కలిసి పర్యావరణానికి …

Read More »

కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ టాప్

కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ దూసుకెళ్తోంది ప్రపంచ దేశాలతో పోలిస్తే తక్కువ రోజుల్లో అత్యధిక టీకాలు పంపిణీ చేసిన దేశంగా భారత్ నిలిచింది. దేశంలో ఇప్పటివరకు 60 లక్షలకు పైగా టీకాలు పంపిణీ చేశారు ఇండియాలో ఈ టీకాల పంపిణీకి 24 రోజుల సమయం పట్టింది. అమెరికాలో 26 రోజులు, యూకేలో 46 రోజుల సమయం పట్టింది. దేశంలో సోమవారం ఒక్కరోజే 2,23,298 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat