మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మలయాళ మూవీ లూసిఫర్ రీమేక్ ప్రాజెక్టు నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లపై ఆర్చీ చౌదరి ఈ సినిమాను నిర్మిస్తుంది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. చిరు కెరీర్ లో ఇది 153వ సినిమాగా తెరకెక్కనుండగా.. మోహన్ రాజా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.
Read More »బీసీసీఐ గుడ్ న్యూస్
భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పనుంది. భారత్-ఇంగ్లండ్ సిరీస్ కు ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించాలని భావిస్తోంది అన్ని స్టేడియాల్లో 50% మంది ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకోనున్నట్లు ఇండియా టుడే తెలిపింది. చెన్నై, అహ్మదాబాద్ పుణెల్లో నాలుగు టెస్టులు, ఐదు టీ20లు మూడు వన్డేలు జరగనున్నాయి. భారత్ చివరిగా 2020 జనవరిలో AUS సిరీస్లో ప్రేక్షకుల మధ్య ఆడింది..
Read More »మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లా రాజాంలో పోలీసులు అరెస్ట్ చేశారు. రామతీర్థం క్షేత్రాన్ని పరిశీలించేందుకు ఇటీవల వచ్చిన వైసీపీ ఎంపీ విజయసాయి కారుపై దాడి ఘటనలో కళా వెంకట్రావును అరెస్ట్ చేశారు. చెప్పులు విసిరిన ఘటనలో కళా అనుచరులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.
Read More »జగన్ కు లోకేష్ వార్నింగ్
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావు అరెస్టును నారా లోకేశ్ ఖండించారు రామతీర్థంలో రాముడి విగ్రహం తల ఎత్తుకెళ్లిన వారిని పట్టుకోలేకపోయిన చేతకాని సర్కారు అత్యంత సౌమ్యుడైన వెంకటరావు గారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అధికారం అండతో ఇంకెంత మంది బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయిస్తావు జగన్?’ అని ట్వీట్ చేశారు
Read More »అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్
అమెరికా 46వ అధ్యక్షుడిగా 78 ఏళ్ల జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. వందల ఏళ్లనాటి పురాతన ఫ్యామిలీ బైబిల్ సాక్షిగా బైడెన్ ప్రమాణం చేశారు. అమెరికా సుప్రీంకోర్టు సీజే జస్టిస్ జాన్ రాబర్ట్స్ బైడెన్ తో ప్రమాణం చేయించగా.. బైడెన్ కంటే ముందు వైస్ ప్రెసిడెంట్ గా కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం చేశారు. బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి క్లింటన్, ఒబామా, జార్జ్ బుష్ కుటుంబ సభ్యులు …
Read More »ధరణి వెబ్ సైట్లో కొత్త ఆప్షన్
ధరణి వెబ్ సైట్లో కొత్త ఆప్షన్ జోడించారు పేర్లలో అక్షర దోషాలు, విస్తీర్ణ నమోదులో తేడా వ్యక్తిగత భూములను నిషేధిత జాబితాలో చేర్చడం వంటి వాటికోసం ‘అప్లికేషన్ ఫర్ ల్యాండ్ మ్యాటర్స్’ అనే ఆప్షన్ జతచేశారు. ఇప్పటికే నిషేధిత జాబితా, కంపెనీ భూముల రిజిస్ట్రేషన్లు మీసేవలో దరఖాస్తుకు అవకాశమిచ్చారు. అయితే ఈ కొత్త ఆప్షన్స్ అప్లై చేస్తే నేరుగా కలెక్టర్ కు చేరుతుంది. ఆయన పరిశీలించి వారంలోగా పరిష్కరిస్తారు.
Read More »తన ఆస్తిని తాకట్టు పెట్టిన మంత్రి హారీష్ రావు.. ఎందుకంటే..?
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు తన ఆస్తి తాకట్టు పెట్టారు. చదవడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం . అసలు విషయానికి వస్తే సిద్దిపేట పట్టణంలోని ఆటోడ్రైవర్ల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమానికి ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్ రావు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేటలో ఆటో క్రెడిట్ కో-ఆపరే టివ్ సొసైటీని ఏర్పాటు చేయడమే కాక, వారికి రుణాలు అందించేందుకు తన …
Read More »బీఐఎస్ ప్రకారం మిషన్ భగీరథ నీరు
మిషన్ భగీరథ నీటితో ప్రజల ఆరోగ్యానికి భరోసా లభిస్తున్నది. నీటితో వచ్చే రోగాలకు అడ్డుకట్ట పడుతున్నది. అంతర్జాతీయ ప్రమాణాలతో గంట గంటకూ పరీక్షలు చేసి పైసా ఖర్చు లేకుండా ఇంటింటికీ సురక్షిత తాగునీటిని ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. తాగునీరు కొనే పనిలేకుండా ఆర్థికంగా చేదోడుగా నిలుస్తున్నది. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలో 23,804 ఆవాసాల్లోని 54 లక్షల ఇండ్లకు నల్లాల ద్వారా భగీరథ నీటిని అందిస్తున్నది. అదేసమయంలో మిషన్ భగీరథ …
Read More »పవన్ మూవీలో అనసూయ
యాంకర్‌గా ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ భరద్వాజ్.. అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెరపై కూడా తళుక్కుమంటున్నారు. సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ నటిగానూ ఆకట్టుకుంటుంది. ఇక రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ అభినయంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం భారీగా ఆఫర్లు వస్తున్నా అనసూయ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తాజాగా అనసూయకి ఓ క్రేజీ ఆఫర్ వరించినట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ …
Read More »పంత్ కల నెరవేరిన వేళ
ఆస్ట్రేలియాపై టీమిండియా సాధించిన చారిత్రక విజయంలో టీమిండియా యంగ్ ప్లేయర్ రిషబ్ పంత్ పాత్ర మరువలేనిది. శుబ్‌మన్ గిల్ వెనుదిరిగిన తర్వాత పుజారాతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడిన పంత్ ఒకవైపు వికెట్లు పడుతున్నా 138 బంతుల్లో 89 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును సగర్వంగా విజయతీరాలకు చేర్చాడు. నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకుంటాడనే అపవాదు మూటగట్టుకున్న పంత్ గబ్బా వేదికగా జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఓపికను ప్రదర్శిస్తూ ఇన్నింగ్స్ ఆడిన …
Read More »