గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సర్కిళ్ల వారీగా ఆర్వోలు నోటీసు విడుదల చేశారు. అన్ని జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లో నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు దాఖలు చేయొచ్చు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 21 నామినేషన్ల పరిశీలన. …
Read More »తెలంగాణలో మరో వంద కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్న మహీంద్రా సంస్థ
తెలంగాణకి మరో పెట్టుబడి రానున్నది. ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా జహీరాబాద్లో తన అతి పెద్ద ట్రాక్టర్ తయారీ కేంద్రాన్ని కలిగి ఉన్నది. ఇక్కడ వంద కోట్ల రూపాయల అదనపు పెట్టుబడి పెట్టనున్నట్లు మహీంద్రా గ్రూప్ ఈ రోజు ప్రకటించింది. మహీంద్రా తన కె2 సిరీస్ ట్రాక్టర్ల తయారీ కి సంబంధించి ఈ అదనపు పెట్టుబడి వినియోగించనున్నట్లు తెలిపింది. జహీరాబాద్ లో ఉన్న తన ట్రాక్టర్ల తయారీ యూనిట్ వద్ద …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హీరో సుశాంత్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు మాదాపూర్ లో మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవ మనుగడకు మొక్కలు చాలా ముఖ్యమని రోజురోజుకు పట్టణాల్లో పచ్చదనం తగ్గిపోతుందని కాబట్టి అందరం బాధ్యతగా మొక్కలు నాటి మనం పీల్చుకునే ఆక్సిజన్ ను మనమే …
Read More »హైదరాబాద్ మరింత సురక్షితంగా, భద్రంగా : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగంరంలోని బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 12లో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం మరో రెండు, మూడు నెలల్లో పూర్తి అవుతుందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ నిర్మాణం పూర్తితో హైదరాబాద్ నగరం మరింత సురక్షితంగా, మరింత భద్రంగా మారనున్నట్లు చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులను మంత్రి కేటీఆర్ నేడు పరిశీలించారు. హోంమంత్రి మహమూద్ అలీ, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మేయర్ …
Read More »రఘునందన్‌పై సంచలన ఆరోపణలు చేసిన మహిళ ఆత్మహత్య యత్నం
బీజేపీ నేత, ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌పై సంచలన ఆరోపణలు చేసిన మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె పటాన్ చెరువులోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. తనను లైంగిక వేధించిన రఘునందన్‌రావుపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతోంది. అంతకు ముందు ఆమె సెల్ఫీ వీడియోను తీసుకుంది. 2007లో రఘునందన్‌రావు తనని ఆఫీసుకు …
Read More »జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు మోగిన నగారా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నగారా మోగింది. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని మసబ్ ట్యాంక్‌లో 10.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి షెడ్యూల్ విడుదల చేశారు. బుధవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 21న నామినేషన్ల పరిశీలన, 24న ఉప సంహరణ కార్యక్రమం ఉంటుంది. అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. డిసెంబర్ …
Read More »నేడే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ, డిసెంబర్ 1న ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ మేరకు మంగళవారం ఉదయం 10.30గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి మీడియా సమావేశం నిర్వహించనుండగా.. ఈ సందర్భంగా ఆయన నోటిఫికేషన్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ కోసం ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం …
Read More »మహేష్ న్యూ లుక్ కెవ్వు కేక
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వలన దాదాపు ఏడు నెలలు ఇంటికి పరిమితమైన మహేష్ బాబు రీసెంట్‌గా తన ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లారు. అక్కడ ఫ్యామిలీతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ, అక్కడి అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఎయిర్ పోర్ట్‌లో హూడితో గాగుల్స్ లుక్ పెట్టుకొని దిగిన ఫొటోని షేర్ …
Read More »సిద్ధాంతం లేని రాద్ధాంతపు పార్టీ బీజేపీ
బీజేపీకి ఒకప్పుడు సిద్దాంతం ఉండేది. నేడు ఆ పార్టీ అబద్ధాలతో రాద్ధాంతం చేసే పార్టీగా మారింది. గోబెల్స్ ప్రచారంతో అబద్ధాల పునాదుల మీద బీజేపీ రాజకీయంగా ఎదగాలనుకుంటుంది. వారి వ్యవహార శైలిని తెరాస కార్యకర్తలు తిప్పి కొట్టాలి. ఎన్నికలంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వచ్చేస్తాయి. కానీ ఆ పార్టీలు ఏం చేసాయని ఓట్లు వేయాలి. 70 ఏళ్ప కాంగ్రెస్, బీజేపీ పాలనలో పఠాన్ చెరుకు కనీసం మంచి నీళ్లు ఇవ్వలేదు. …
Read More »ప్రతిరోజూ ఎండు మిర్చి తింటే…!
ప్రస్తుత రోజుల్లో నాలుకకు కొద్దిగా మసాలా ఘాటు రుచి తగలాలనుకునే వారు వంటల్లో ఎండు మిరపకాయల కారాన్ని కాస్త ఎక్కువగానే దట్టిస్తారు ఈ అలవాటు ఎసిడిటి, అల్సర్‌కు దారితీయొచ్చనే హెచ్చరికలను పక్కనబెడితే కాస్త భోజనంలో స్పైసీని ఆస్వాదించేవారికి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్‌ఏ) అధ్యయనం గొప్ప ఊరటనిచ్చేదే. ఎందుకంటారా? ఎండు మిరప కారంతో వండిన పదార్థాలను రోజూ తీసుకోవడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందట. కారం ఘాటుతో వాపు, నొప్పిని నివారించే …
Read More »