ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వలన దాదాపు ఏడు నెలలు ఇంటికి పరిమితమైన మహేష్ బాబు రీసెంట్గా తన ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లారు. అక్కడ ఫ్యామిలీతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ, అక్కడి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
తాజాగా ఎయిర్ పోర్ట్‌లో హూడితో గాగుల్స్ లుక్ పెట్టుకొని దిగిన ఫొటోని షేర్ చేశాడు. ఇందులో మహేష్ చాలా యంగ్‌గా కనిపిస్తున్నాడు. వయసు పెరుగుతున్న కొద్ది అందంగా పెరుగుతున్నావ్, సీక్రెట్ ఏంటో చెప్పండి అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో మంచి వైరల్ అయ్యిపోయింది. అతి త్వరలో మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ మొదలు పెట్టనున్నాడు