యాసంగి పంటల సాగుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆ శాఖ అధికారులు, నిపుణులు హాజరయ్యారు. యాసంగిలో ఏయే పంటలను ఏయే ప్రాంతాల్లో సాగు చేయాలనే అంశంపై సీఎం చర్చిస్తున్నారు. వానాకాలంలో మాదిరిగానే యాసంగిలోనూ నియంత్రిత సాగు స్ఫూర్తి కొనసాగాలని వ్యవసాయ శాఖ అధికారులతో నిన్న జరిగిన సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించిన …
Read More »4 బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
తెలంగాణ శాసనసభ కీలకమైన నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపింది. జీహెచ్‌ఎంసీ సహా నాలుగు చట్టాల సవరణ కోసం బిల్లులను సభలో ఆయా శాఖల మంత్రులు ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లులపై చర్చించి.. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. అనంతరం ఈ నాలుగు బిల్లులను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కేవలం చట్టసవరణ కోసం ఉద్దేశించిన సమావేశాలు కావడంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. ఇండియన్ స్టాంప్ బిల్లు(తెలంగాణ)2020, …
Read More »జీహెచ్‌ఎంసీ చట్టానికి 5 సవరణలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి 5 సవరణలు తీసుకువస్తున్నట్లు ఈ రోజు మంగళ వారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 50 స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్ట సవరణ.. 10 శాతం బడ్జెట్‌ను పచ్చదనం కోసం కేటాయిస్తూ రెండవ చట్ట సవరణ.. అధికారుల్లో, ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం పెంచుతూ మూడవ చట్ట సవరణ తెచ్చమన్నారు.. జీహెచ్‌ఎంసీ రిజర్వేషన్ …
Read More »పాత ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు చెల్లుబాటు
ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) కింద 2015లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిబంధనలు, షరతులు అన్ని ఒకేవిధంగా ఉన్నందున పెండింగ్ దరఖాస్తులను ప్రస్తుత ఎల్‌ఆర్‌ఎస్ బోర్డులోకి తీసుకునేందుకు మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అనుమతి ఇచ్చారు. నిబంధనల ప్రకారం వాటిని క్రమబద్ధీకరించాలని సూచించారు. ఈ మేరకు ఎల్‌ఆర్‌ఎస్ పథకం 2015 కింద జనవరి 31,2020 వరకు వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ …
Read More »అధికారులు నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి
అధికారులు నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ ప్రజాసేవలో మమేకం కావాలని గ్రూప్-2 అధికారులకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. సోమవా రం ఎంసీహెచ్చార్డీలో గ్రూప్-2 అధికారుల 40 రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సేవకు గ్రూప్-2 ఉద్యోగం గొప్ప అవకాశమన్నారు. కార్యక్రమంలో బీపీ ఆచార్యతోపాటు అదనపు డీజీ హరిప్రీత్‌సిం గ్, ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి, శిక్షణ తరగతుల కో ఆర్డినేటర్లు నబీ, …
Read More »నక్క తోక తొక్కనున్న పూజా హెగ్దే
టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా హీరోగా దర్శకుడు గుణశేఖర్ ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ చిత్రం `హిరణ్య కశ్యప` ఇప్పట్లో పట్టాలెక్కదని తేలిపోయింది. ప్రస్తుత పరిస్థితులన్నీ సర్దుకున్నాకే ఆ సినిమా ఉంటుందని గుణశేఖర్ ఇటీవల స్పష్టం చేశారు. ఈ లోపు మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ప్రముఖ కవి కాళిదాసు రచన ఆధారంగా `శాకుంతలం` సినిమాను తెరకెక్కించబోతున్నారు. మణిశర్మ మ్యూజిక్‌తో తాజాగా విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్ …
Read More »నేడు రేపు అతి భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరవాసులకు ముఖ్యమైన సూచన. మంగళవారం, బుధవారం అతి భారీగా వర్షాలు పడనున్నాయి. వాతావరణ శాఖ జారీ చేసిన అంచనాల ప్రకారం 72 గంటలపాటు నగరంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ డి.ఎస్. లోకేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని చోట్ల తొమ్మిది నుంచి 16 సెంటీమీటర్ల వరకూ కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. …
Read More »ఏపీలో తగ్గిన కరోనా కేసులు
ఏపీలో గడిచిన ఇరవై నాలుగంటల్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి.గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 3,224కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,58,951కి చేరింది. ఇందులో 43,983యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. మొత్తం 7,08,712మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే నిన్న ఒక్కరోజులోనే ముప్పై రెండు మంది మృతి చెందారు.దీంతో మొత్తం మృతుల సంఖ్య 6256కి చేరింది.
Read More »నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశం
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశం ఈ రోజు మంగళవారం మొదలుకానున్నది. ఇటీవల ప్రారంభమైన శాసన సభ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి విదితమే. ఈ రోజు మొదలు కానున్న ఈ ప్రత్యేక సమావేశంలో జీహెచ్ఎంసీలో వార్డుల రిజర్వేషన్లకు రోటేషన్ లేకుండా ప్రస్తుతం ఉన్న వాటినే కొనసాగించే విధంగా బిల్లును తీసుకురానున్నది. నాలా చట్టం ,నేర విచారణ స్మృతి వంటి పలు ప్రత్యేక చట్టాలకు ప్ర్తభుత్వం పలు సవరణలను …
Read More »వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కారుకు ప్రమాదం
ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ కారు ప్రమాదానికి గురైంది.తమిళనాడులోని చెన్నై నుండి గూడూరు వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. నాయుడుపేట దగ్గర లారీను వైసీపీ ఎమ్మెల్యే కారు ఢీకొట్టడంతో డ్రైవర్ శ్రీహారికి తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యే వరప్రసాద్ కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వెంటనే వీర్ని చెన్నైలోని ప్రముఖ ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ముందు వెళ్తున్న లారీ …
Read More »