Home / ANDHRAPRADESH / వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కారుకు ప్రమాదం

వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కారుకు ప్రమాదం

ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ కారు ప్రమాదానికి గురైంది.తమిళనాడులోని చెన్నై నుండి గూడూరు వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

నాయుడుపేట దగ్గర లారీను వైసీపీ ఎమ్మెల్యే కారు ఢీకొట్టడంతో డ్రైవర్ శ్రీహారికి తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యే వరప్రసాద్ కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వెంటనే వీర్ని చెన్నైలోని ప్రముఖ ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ముందు వెళ్తున్న లారీ సడెన్ గా బ్రేకులు వేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.