ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించినా కొందరు పదేపదే వాహనాలతో రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. ఇలాంటివారిని గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాలపై దృష్టిపెట్టారు. ప్రస్తుతం అత్యవసర సేవల విభాగాల వాహనాలకే నగరంలో సంచరించేందుకు అనుమతులున్నాయి. మిగిలినవారెవరైనా నిత్యావసరాలకు ద్విచక్ర వాహనాలు, కార్లపై తమ నివాసం నుంచి 3 కి.మీ.లోపే ప్రయాణం చేయాలని స్పష్టమైన ఆదేశాలున్నాయి.. ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామంటూ ఉన్నతాధికారులు ప్రకటించారు. మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువదూరం తిరిగిన వాహనదారులను గుర్తించేందుకు …
Read More »గుంటూరులో ‘కోవిడ్19-డెస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్’ ఏర్పాటు
కోవిడ్-19 నివారణకు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా గుంటూరులో ‘ప్రత్యేక క్రిమిసంహారక టన్నెల్స్ (covid-19 Disinfection Tunnels)ను ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరులోని సిమ్స్ విద్యాసంస్థల డైరెక్టర్ భీమనాధం భరత్ రెడ్డి, ఆయన మిత్రులు, ప్రముఖ వైద్యులు కలిసి స్వంతఖర్చులతో ఈ టన్నెల్స్ ఏర్పాటుకు పూనుకున్నారు. ఇందులో భాగంగా గురువారం స్థానిక రెయిన్ ట్రీ పార్కు వద్ద ఏపీ ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేతులమీదుగా మొదటి టన్నెల్ ను ప్రారంభించారు. …
Read More »లాక్ డౌన్ పొడగింపునకు మించిన మార్గం లేదు
కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి లాక్ డౌన్ పొడగింపునకు మించిన మార్గం లేదు భారత ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేస్తూ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎంతో బాగున్నాయి కరోనా కట్టడి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల పాటు కష్టపడుతున్నారు లాక్ డౌన్ వల్ల కష్టనష్టాలున్నప్పటికీ ఇది తప్పని చర్య. ప్రతికూల పరిస్థితుల్లో ఇదే ఉత్తమమైన మార్గం. మనం ఒకసారి …
Read More »మానవాళి మనుగడను ప్రశ్నార్ధకంగా మార్చిన కరోనా
మానవాళి మనుగడను ప్రశ్నార్ధకంగా మార్చిన కరోనా వైరస్ కనపడని శత్రువుగా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆటువంటి శత్రువు మొదటగా అవహించేది ఆత్మీయులదేనని ఆయన వాపోయారు. అటువంటి మహమ్మారీ పై యుద్ధం చేస్తున్న మనకు ఏకైక ఆయుధం సామాజిక దూరం పాటించడమేనని ఆయన చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ కట్టడిలో బాగంగా సరిహద్దుల్లో సైనికుల వలె విధులు నిర్వహిస్తున్న వైద్యఆరోగ్యశాఖా సిబ్బంది తో …
Read More »కరోనాను నిర్మూలించేందుకు లాక్‌డౌన్‌ను గౌరవించాలి
కరోనా వ్యాప్తి నివారణ కోసం ప్రజలందరూ ఇండ్లలోనే ఉండి సహకరించాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు. బుధవారం ఆయన బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ పట్టణంలో, బాల్కొండ మండల కేంద్రంలో కరోనా నేపథ్యంలో ఏర్పాటుచేసిన కంటైన్మెంట్ క్లస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలందరూ లాక్‌డౌన్‌ను గౌరవించి.. కరోనాను నిర్మూలించేందుకు లాక్‌డౌన్‌ను గౌరవించాలని కోరారు. ప్రజలు ఇండ్లలోంచి బయటకు రాకుండా …
Read More »రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది
రైతులు పండించిన మక్కల కొనుగోలు లో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని, మీరు పండించిన పంట మొత్తం ప్రభుత్వమే కొంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రైతులకు భరోసా ఇచ్చారు. బుధవారం ఖమ్మం జిల్లాలోని వివి.పాలెం(రఘునాధపాలెం మండలం), అల్లీపురం(ఖమ్మం కార్పోరేషన్), లచ్చగూడెం (చింతకాని మండలం), పెద్ద గోపవరం(కొనిజర్ల మండలం) గ్రామాల్లో మొక్కజొన్నలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు …
Read More »కరోనా వ్యాధి నివారణకు మేము సైతమంటూ గ్రామ మహిళలు
కరోనా వ్యాధి నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మేము సైతమంటూ గ్రామ మహిళా సమాఖ్య సంఘ మహిళలు ముందుకొచ్చారని చిన్నకోడూర్ మండలంలోని మైలారం, గోనెపల్లి, ఇబ్రహీంనగర్ గ్రామైక్య మహిళా సంఘ సమాఖ్య మహిళా ప్రతినిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అభినందించారు. ఈ మేరకు తమ వంతు సాయంగా సీఏం సహాయ నిధికి విరాళంగా రూ.10వేల రూపాయల చెక్కును మంత్రి స్వీకరించారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలంలోని …
Read More »మానవతా మూర్తుల సాయం మరువ లేనిది..
కరోనా ప్రభావంతో నిరుపేదల జీవనమే కష్టతరంగా మారుతు.. రెక్కాడితే కానీ డొక్కాడని ఈ పరిస్థితులలో మీకు మీమున్నామంటూ పలువురు మానవతా మూర్తుల సాయం సర్వత్రా ప్రశంశలు పొందుతున్నది. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, సామాజిక కార్యకర్తలు పేదలను ఆదుకునేందుకు ఇంకా పెద్ద ఎత్తున ముందుకు రావాలని మంత్రి హరీశ్ రావు గారు పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జిల్లాలోని పలువురు …
Read More »ఏ దేశాల్లో ఎన్ని కరోనా కేసులు?
ఐరోపా దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. బ్రెజిల్, స్వీడన్, స్విట్జర్లాండ్ సహా పలు దేశాల్లో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. అమెరికాలో 12,841 మంది, స్పెయిన్‌లో 14,045, ఇటలీలో 17,127, ఫ్రాన్స్‌లో 10,328, జర్మనీలో 2,016, ఇరాన్‌లో 3,872, యూకేలో 6,159, టర్కీలో 725, స్విట్జర్లాండ్‌లో 821, బెల్జియంలో 2,035, నెదర్లాండ్స్‌లో 2,101 మంది మృతి చెందారు. యూఎస్‌ఏలో 4,00,335 పాజిటివ్ కేసులు, స్పెయిన్‌లో 1,41,942, ఇటలీలో 1,35,586, ఫ్రాన్స్‌లో 1,09,069, …
Read More »ప్రపంచ వ్యాప్తంగా 82,026 కరోనా మరణాలు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరించింది. ఈ వైరస్ బారిన పడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 14,30,941 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 82,026 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి నుంచి 3,01,970 మంది కోలుకున్నారు. ఐరోపా దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. బ్రెజిల్, స్వీడన్, స్విట్జర్లాండ్ సహా పలు దేశాల్లో కరోనా కేసులు, …
Read More »