ఉత్తరాఖండ్లోని యమకేశ్వర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. 2000 సంవత్సరంలో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అక్కడ మహిళలే గెలుస్తున్నారు. 2002 నుంచి 2012 వరకు బీజేపీ అభ్యర్థి విజయ బర్హ్వాల్ వరుసగా మూడు సార్లు, 2017లో రితూ ఖండూరీ గెలిచారు. ఈసారి బీజేపీ తరఫున రేణు బరిలో ఉండగా, వివిధ పార్టీల నుంచి ఆరుగురు పురుష అభ్యర్థులూ పోటీ పడుతున్నారు. మరి ఎవరు గెలుస్తారో వేచిచూడాలి.
Read More »యూపీ సీఎం అభ్యర్థిపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
యూపీ సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పదవికి తాను కాకుండా ఇంకెవరైనా కనిపిస్తున్నారా అని మీడియాతో అన్నారు. అయితే ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కాగా త్వరలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ స్థానాలు గెలుచుకుని అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. అభ్యర్థుల ఎంపికపై జాగ్రత్త వహిస్తోంది.
Read More »డిసెంబర్ నాటికి దేశంలో 5.3కోట్ల మంది నిరుద్యోగులు
కరోనా కారణంగా 2021 డిసెంబర్ నాటికి దేశంలో 5.3కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తెలిపింది. ఇందులో 3.5 కోట్ల మంది ఉద్యోగం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నారు.. 1.7కోట్లమంది జాబ్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదంది. కాగా ఉద్యోగ వేటలో అంత యాక్టివ్గా లేనివారిలో సగానికి పైగా మహిళలే ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
Read More »కర్హాల్ నియోజకవర్గం నుంచి అఖిలేశ్ యాదవ్ పోటీ
నిన్న మొన్నటివరకు అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని చెబుతూ వచ్చిన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. ఆయన కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఆయన ప్రస్తుతం అజంగఢ్ ఎంపీగా ఉన్నారు. గతంలో యూపీ సీఎంగా చేసినప్పటికీ.. మండలి నుంచి ప్రాతినిథ్యం వహించారు.
Read More »మరోకసారి సంచలనం సృష్టించిన ఎంపీ సుబ్రమణియన్ స్వామి
ప్రస్తుత కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు ప్రజలకు ఇన్కమ్ ట్యాక్స్ ను రద్దు చేయడం మంచిదని రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి అభిప్రాయపడ్డారు. రానున్న ఆర్థిక సంవత్సరం మొదటి రోజే ఈ నిర్ణయం ప్రకటిస్తే ఆర్థిక ప్రగతికి బలం ఇచ్చినట్లు అవుతుందన్నారు. ట్యాక్సేషన్ బదులుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వనరుల్ని పెంచుకోవచ్చని గతంలోనూ ప్రభుత్వానికి సూచించానని తెలిపారు.
Read More »ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలోస్తే గెలుపు ఎవరిది..?
ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడైంది. 543 స్థానాలున్న లోక్సభలో ఎన్డీయేకు 296, యూపీఏకు 127, ఇతరులు 120 స్థానాలు దక్కుతాయని జోస్యం చెప్పింది. ఇందులో ఒక్క బీజేపీకే 271 స్థానాలు, కాంగ్రెస్కు 62, మిగతా పార్టీలకు 210 స్థానాలు దక్కుతాయని వెల్లడించింది.
Read More »కాంగ్రెస్ లోకి ఎంపీ డీఎస్
తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ త్వరలో సొంతగూటికి వెళ్లనున్నారు. ఈనెల 24న సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరే అవకాశం కనిపిస్తోంది. గతంలో P.C.C అధ్యక్షుడిగా, మంత్రిగా కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించిన ఆయన 2015లో తెరాసలో చేరారు. తెరాస నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన డీఎస్.. కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారు.
Read More »పార్టీ మార్పుపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో రాజుకున్న నిప్పు ఇంకా చల్లారినట్లు లేదు.. ఆ పార్టీకి చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి)కాంగ్రెస్ కు రాజీనామా చేయనున్నరు. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలోకి వెళ్తారు అని వార్తలు వైరల్ అయిన సంగతి విధితమే. తనపై వస్తున్న వార్తల గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు.నేనంటే …
Read More »ఐసోలేషన్లో ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఐసోలేషన్లోకి వెళ్లారు. తన కుటుంబంలోని ఓ సభ్యుడితో పాటు ఆమె సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వాళ్లతో కాంటాక్ట్ లో ఉన్న కారణంగా ప్రియాంక స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కాగా.. కరోనా పరీక్షల్లో ఆమెకు నెగెటివ్ వచ్చింది. కొన్ని రోజుల తర్వాత మరోసారి పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సలహా ఇచ్చినట్లు ఆమె చెప్పారు.
Read More »TPCC చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం
దేశంలో ఉన్న బీసీ కులాల జన గణన సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం ప్రకటించడంపై TPCC చీఫ్, MP రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ కులాల జన గణన చేయడానికి కేంద్రంలోని మోదీ సర్కారు తిరస్కరించడం అంటే ఆ వర్గాలకు తీవ్ర అన్యాయం చేయడమే. బీసీలపై బీజేపీ ప్రేమ కొంగజపం-దొంగజపం అని దీన్ని బట్టి అర్థమవుతోంది. బీసీల మనోభావాలను గౌరవించని …
Read More »