తెలంగాణలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బే తగిలింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీకి మంచి అండగా ఉన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని తెలిపారు. ఏఐసీసీ నుంచి రాష్ట్ర నాయకత్వం వరకూ ప్రభుత్వంతో అమీతుమీ పోరాటం చేయట్లేదన్న అసంతృప్తితోనే ఆయన …
Read More »గుజరాత్ మాజీ సీఎం కన్నుమూత
గుజరాత్ రాష్ట్రానికి చెందిన మాజీ సీఎం ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాధవ్ సింగ్ సోలంకి (94)కన్నుమూశారు. గాంధీనగర్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. వృత్తి రిత్యా న్యాయవాది అయిన మాధవ్ సింగ్ 1976లో గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేశారు.ఆ తర్వాత ఐదేండ్ల తర్వాత అంటే 1981లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 1985లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 182స్థానాలకు గాను 149 …
Read More »పార్టీ మార్పుపై జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు
పార్టీ మార్పుపై సీనియర్ నేత, మాజీమంత్రి కె. జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ ను వీడేదిలేదని ఆయన స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్ పదవి ఎవరికి వచ్చినా కలిసి పని చేస్తామని తెలిపారు. ఆదివారం రాత్రి వికారాబాద్ జిల్లా పరిగిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. సీనియర్లు, జూనియర్లంతా సమన్వయంతో కాంగ్రె్‌సను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మీరు బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారంపై జానారెడ్డి సున్నితంగా స్పందించారు. …
Read More »కరోనాతో అహ్మద్ పటేల్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ ట్రబుల్ షూటర్ అహ్మద్ పటేల్ కన్నుమూశారు. అక్టోబర్ 1న ఆయన కరోనా బారినపడ్డారు. దీంతో గురుగ్రామ్‌లోని మేదాంత దవాఖానలో నెల రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఆయన అవయవాలు చికిత్సకు సహకరించక పోవడంతో ఇవాళ తెల్లవారుజామున 3.30 గంటలకు మరణించారు. ఈమేరకు ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాంగాధీకి ఆయన సుదీర్ఘకాలం రాజకీయ సలహాదారుగా పనిచేశారు. …
Read More »మళ్లీ కాంగ్రెస్ లో చేరతా -మాజీ ఎంపీ
‘నేను తిరిగి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా. ఉత్తరప్రదేశ్‌లో దళిత బాలికపై అత్యాచారం, హత్య కేసులో బాధితులకు అండగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ప్రియాంక చేసిన పోరాటం చూస్తుంటే ఇందిరాగాంధీ రోజులు గుర్తుకొస్తున్నాయి. దేశంలో పేద, దళిత, మైనారిటీ ప్రజలకు అండగా ఉండేది.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే’ అని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. హీరోలా 120 కిలోమీటర్ల దూరం నడిచి …
Read More »అగమ్యగోచరంగా కాంగ్రెస్ నేతల పరిస్థితి
కాంగ్రెస్ పార్టీలో నేతల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కాంగ్రెస్‌లో ఇక తమకు భవిష్యత్ లేదని ఆలోచిస్తున్న కొంతమంది నేతలు పార్టీని వీడడం భారంగా భావిస్తున్నారు. అదే సమయంలో బీజేపీలో చేరడం తప్ప.. మరో ప్రత్యామ్నాయం కనిపించడంలేదు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అసాధ్యమని పలువురు కాంగ్రెస్ నేతలు బేరేజు వేసుకుంటున్నారు. ఎన్నికల నాటికి ప్రధానిగా మోదీ మరింత బలపడతారని, అలాంటి సమయంలో కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలుపు అన్నది అత్యాసే అవుతుందని …
Read More »కాంగ్రెస్ సీనియర్ నేతలకు బీజేపీ ఆహ్వానం
కాంగ్రెస్ సీనియర్ నేతలు కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్ ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి బీజేపీలో చేరాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సూచించారు. ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో చేశారని, పార్టీని నిర్మించారని అన్నారు. ఇన్నేళ్ల తర్వాత కూడా వారికి పార్టీలో గౌరవం దక్కడ లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ అధ్యుక్షుని మార్పునకు సంబంధించి సిబల్, ఆజాద్ వంటి నేతలు బీజేపీకి అమ్ముడుపోయారని …
Read More »ఏఐసీసీ అధ్యక్ష పదవికి సోనియాగాంధీ రాజీనామా
ఏఐసీసీ అధ్యక్ష పదవికి సోనియాగాంధీ రాజీనామా చేశారు. ఇవాళ ఉదయం 11గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైంది. ఈ సందర్భంగా సమావేశంలో తన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అధ్యక్ష పదవి తనకు ఆసక్తి లేదని ఈ సందర్భంగా సోనియాగాంధీ తెలిపారు. మరో అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సభ్యులకు సూచించారు. సోనియా రాజీనామాను సభ్యులకు కేసీ వేణుగోపాల్ చదివి వినిపించారు. ఈ సందర్భంగా అధ్యక్ష పదవికి సోనియా మాజీ …
Read More »ప్రధానికి ఎస్పీజీ భద్రత తగ్గింపు..కారణం ఇదేనా
ప్రధానికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) కమాండోల భద్రత తగ్గిపోనుంది. ప్రస్తుతం ఉన్న వారిలో 50-60శాతం మంది సిబ్బందితోనే ప్రధానికి భద్రత కల్పించనున్నారు. రానున్న రోజుల్లో.. ఎస్పీజీలో ఉన్న 4వేల మంది సిబ్బందిని దశల వారీగా తగ్గించే ప్రక్రియ మొదలైందని అధికారులు తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుటుంబ సభ్యులకు కేటాయించిన కమాండోలను కూడా ఉపసంహరించాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందని చెప్పారు. కేంద్ర కేబినెట్ సచివాలయ …
Read More »ఆసుపత్రి నుండి సోనియా గాంధీ డిశ్చార్జ్
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం జూలై 30 గురువారం రోజున న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఆస్పత్రి చైర్మన్ డీఎస్ రాణా తెలిపారు.
Read More »