తాము మర్యాద ఇచ్చి పుచ్చుకుంటామని.. ఎవరు ఎవరికీ భయపడని టీఆర్ఎస్ నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళితే తాము కూడా సిద్ధమేనని చెప్పారు. మహారాష్ట్ర తరహా రాజకీయాలు చేస్తే ఒప్పుకోబోమని.. సై అంటే సై అంటామన్నారు. బీజేపీ నేతలు ఆ పార్టీ కార్యవర్గ సమావేశానికి హైదరాబాద్ వచ్చారని.. …
Read More »PV కి భారతరత్న ఇవ్వాలి-మంత్రి తలసాని
భారత మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహా రావు 101 జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్‌లోని పీవీ ఘాట్‌లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన పీవీని కేంద్రం విస్మరించడం …
Read More »దళితుల సమగ్రాభివృద్ధి కోసమే దళితబంధు
తెలంగాణలో దళితుల సమగ్రాభివృద్ధి కోసమే ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆర్ధికంగా ఎంతో వెనుకబడిన దళితులు అభివృద్ధి సాధించాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అని చెప్పారు. హైదరాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలో దళితబంధు లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించే ఇలాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా అమలులో లేదని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక …
Read More »పట్టణ ప్రగతి కార్యక్రమం పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష
ప్రజలు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాలిక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిష్కరించబడ్డాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. బుధవారం GHMC కార్యాలయంలో ఈ నెల 3 నుండి 15 వ తేదీ వరకు నిర్వహించనున్న పట్టణ ప్రగతి కార్యక్రమం పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ …
Read More »అత్యధిక మత్స్యకార సొసైటీలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు
దేశంలోనే అత్యధిక మత్స్యకార సొసైటీలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,793 మత్స్య సొసైటీలు ఉండగా, కొత్తగా మరో 1,177 సొసైటీలు ఏర్పాటుచేస్తున్నారు. దీంతో మొత్తం సొసైటీల సంఖ్య 5,970కి పెరగనున్నది. మత్స్య సంపదకు ప్రసిద్ధి చెందిన మహారాష్ట్రలో 3,315 సొసైటీలు ఉండగా ఏపీలో 2,347 సొసైటీలు ఉన్నాయి. రాష్ట్రంలోని మత్స్య సొసైటీల్లో దాదాపు 3.75 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఉచిత …
Read More »పట్టుదలతో శ్రమించి, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.
పట్టుదలతో శ్రమించి, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ లోని హరిహర కళాభవన్ లో నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ ను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. కోచింగ్ కోసం భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరు …
Read More »విద్యార్థులను చదువుతో పాటు క్రీడలలోను ప్రోత్సహించాలి
విద్యార్థులను చదువుతో పాటు క్రీడలలోను ప్రోత్సహించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని గ్రౌండ్ లో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధులు క్రీడలలో పాల్గొనడం వలన మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందడమే కాకుండా ఆరోగ్యపరంగా ఎంతో దృడంగా తయారు అవుతారని …
Read More »ఈ నెల 29 న ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు-మంత్రి తలసాని
పవిత్ర రంజాన్ సందర్భంగా ఈనెల 29న ముస్లిం సోదరులకు ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నట్టు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈమేరకు ఎల్బిస్టేడియంలో పెద్దయెత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.మంత్రి తలసానితో పాటు హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లీం లు నెలరోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తారు.తెలంగాణ …
Read More »మేం నామినేటెడ్ వ్యక్తులం కాదు: మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తాము నామినేటెడ్ వ్యక్తులం కాదని, తమది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని చెప్పారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని నిందించడం మంచి పద్ధతి కాదన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. గవర్నర్ రాజకీయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగ పరిధికి లోబడి …
Read More »పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాం : మంత్రి తలసాని
పాడి పరిశ్రమ రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాడి పరిశ్రమ రంగాన్ని ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నగరంలోని హైటెక్స్‌లో నిర్వహించిన ఫుడ్ అండ్ డెయిరీ ఎగ్జిబిషన్‌ను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహముద్ అలీ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. …
Read More »