ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలపై జీఎస్టీ భారం మరింత పెరుగుతోంది. పాలు, పెరుగు సహా ప్రతి చిన్న వస్తువుపై జీఎస్టీ పడుతోంది. ఇదే విషయాన్ని సభకు తెలిపిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు.
ఇంటి యజమానులకు ఉన్న మినహాయింపును కూడా కేంద్రం తొలగించిందని ఆయన తెలిపారు.పార్లమెంటులో మెజార్టీ ఉంది కదా అని, దౌర్జన్యంగా బిల్స్ తీసుకొచ్చి వాటిని రాష్ట్రాలపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోంది. వీటిపై ఆయా మీటింగ్స్‌లోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ బలవంతంగా ట్యాక్సులు తీసుకోలేదని, ఫ్రెండ్లీగానే ఉంటుందని చెప్పారు. అనంతరం తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సవరణ బిల్లుపై ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ తర్వాత బిల్లు పాసైనట్లు స్పీకర్ పోచారం ప్రకటించారు.