పాడి పరిశ్రమ రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాడి పరిశ్రమ రంగాన్ని ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నగరంలోని హైటెక్స్‌లో నిర్వహించిన ఫుడ్ అండ్ డెయిరీ ఎగ్జిబిషన్‌ను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహముద్ అలీ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. …
Read More »డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ జీవితం స్ఫూర్తిదాయకం
కులరహిత సమాజం కోసం, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగంచేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ గారు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొనియాడారు.ఏప్రిల్ 05, 2022వ తేదీ జగ్జీవన్‌రామ్ 115వ జయంతిని పురస్కరించుకొని ఖమ్మం తెలంగాణతల్లి సర్కిల్ లో గల జగ్జీవన్ రాం గారి విగ్రహానికి, Vdo’s కాలనీ క్యాంపు కార్యలయం, గట్టయ్య సెంటర్ లోని తెరాస జిల్లా పార్టీ …
Read More »అందరికి స్ఫూర్తిదాయకమైన ఆదర్శనేత డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్
సమాజంలో కులరహిత సమాజం, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగంచేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. దేశ స్వాతంత్య్రం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శనేత అని పేర్కొన్నారు. మంగళవారం జగ్జీవన్‌రామ్ 115వ జయంతిని పురస్కరించుకొని దేశానికి ఆయన చేసిన సేవల్ని సీఎం స్మరించుకొని నివాళులు అర్పించారు. జగ్జీవన్‌రామ్ వంటి మహానీయుల ఆశయ సాధనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని …
Read More »బోయిగూడ అగ్నిప్రమాదం – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం
తెలంగాణ రాష్ట్ర రాజధాని పరిధిలో హైదరాబాద్ జంట నగరాల్లోని సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బోయిగూడలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఓ ప్లాస్టిక్ గోదాంలో షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా గోదాంలో మంటలు చెలరేగడంతో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున్న మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే.. ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకున్న 11 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.అగ్నిప్రమాద ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం …
Read More »బోయిగూడ అగ్నిప్రమాదం -ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
తెలంగాణ రాష్ట్ర రాజధాని పరిధిలో హైదరాబాద్ జంట నగరాల్లోని సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బోయిగూడలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఓ ప్లాస్టిక్ గోదాంలో షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా గోదాంలో మంటలు చెలరేగడంతో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున్న మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే.. ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకున్న 11 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ప్రమాదం నుంచి ఒక కార్మికుడు మాత్రమే ప్రాణాపాయ …
Read More »ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు : మంత్రి తలసాని.
ప్రైవేటుకు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది, బలోపేతం చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన ‘మన బస్తి – మన బడి’ కార్యక్రమంపై మంత్రి మసబ్ ట్యాంక్‌లోని కార్యాలయంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీతో కలిసి హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మహమూద్ అలీతో కలిసి ఆయన …
Read More »మేడారం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న మంత్రి తలసాని
మేడారం సమ్మక్క, సారలమ్మలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తులాభారం వేసి అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మేడారం జాతర కుంభమేళాను తలపించేలా ఉందన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందన్నారు. …
Read More »బీజేపీ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించడంలేదు
దేశంలో అన్ని రంగాల వార్ని మోసం చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయస్థాయి క్రీడాకారులను ప్రోత్సహించడంలేని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ జన్మదినం (ఫిబ్రవరి17) సందర్భంగా LB స్టేడియంలో జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందన్నారు. గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని …
Read More »అమరవీరుల త్యాగాలను కించపరిచేలా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు
తెలంగాణ అమరవీరుల త్యాగాలను కించపరిచేలా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గన్‌పార్కులోని అమరవీరుల స్థూపాన్ని పాలతో శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్‌తో పాటు పెద్దఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి …
Read More »మంచినీటి చేపల ఉత్పత్తిలో తెలంగాణ కు ఉత్తమ అవార్డ్
మంచినీటి చేపల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రానికి ఉత్తమ అవార్డ్ లభించింది. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఆదివారం భువనేశ్వర్ లో NFDB ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా చేతుల మీదుగా రాష్ట్ర పశుసంవర్ధక కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా లు అవార్డ్ ను అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో …
Read More »