ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబుపై అధికార పార్టీ అయిన వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. ఆదివారం ఉదయం ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ దెబ్బకి విలవిలలాడి చంద్రబాబు కుప్పం బాట పెట్టారన్నారు. కుప్పం ప్రజలకు చంద్రబాబు చేసింది శూన్యమన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో బాబు కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నారని, ముందస్తు ఎన్నికలైనా… ఏ ఎన్నికలైనా ప్రజలు జగన్ వైపే …
Read More »బాబుకు కొడాలి నాని దిమ్మతిరిగే సవాల్
ఏపీలో రాజకీయం మంచి రసపట్టులో ఉంది.అధికార ప్రతిపక్ష పార్టీలకి చెందిన నేతల మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతుంది.అధికార వైసీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత,మంత్రి కోడాలి నాని అయితే ఏకంగా మాజీ సీఎం,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మాటల యుద్ధం ఇంకా తీవ్రతం చేస్తున్నాడు. తాజాగా మంత్రి కోడాలి నాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని అధికారంలో నుండి..సీఎం కుర్చీ నుండి దించి చంద్రబాబు నాయుడు …
Read More »థాయ్ లాండ్ కి మాజీ సీఎం చంద్రబాబు
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కుటుంబసభ్యులతో కలసి థాయ్ లాండ్ విహార యాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ఈ నెల 24వ తేదీనే వెళ్లినప్పటికీ పలు కారణాల వల్ల ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడినట్లు సమాచారం. జనవరి 2వ తేదీన ఆయన తిరిగి హైదరాబాద్ రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Read More »వంగవీటి రాధ హత్యకు రెక్కీ
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశానికి చెందిన నేత వంగవీటి రాధ సంచలన ఆరోపణలు చేశారు. తన హత్యకు కుట్రపన్నారని, రెక్కీ నిర్వహించారని అన్నారు. తనను చంపాలని చూసినా భయపడనని, దేనికైనా సిద్ధం అని స్పష్టం చేశారు. తానెప్పుడూ ప్రజల మధ్యే ఉంటానని, వంగవీటి రంగా ఆశయాల సాధనే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. కృష్ణా జిల్లా చిన్నగొన్నూరులో రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాధ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ …
Read More »కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై విజయనగరం నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిన్న రామతీర్థం ఘటన నేపథ్యంలో.. శంకుస్థాపన కార్యక్రమానికి, విధులకు ఆటంకం కలిగించారని ఆలయ EO ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 473 33 సెక్షన్ల కింద అశోక్ గజపతిరాజుపై కేసు నమోదైంది. నిన్న రామాలయ పునర్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో అశోక్ గజపతిరాజు, మంత్రి వెల్లంపల్లి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Read More »సీఎం జగన్ రెడ్డికి సబ్జెక్టు లేదు- Nara Lokesh
ఏ మాత్రం తనకు సబ్జెక్ట్ లేక అవగాహన లేమితో సీఎం జగన్‌రెడ్డి మూడు రాజధానులని ప్రకటించారంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రకటించే రోజు దగ్గరిలోనే ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కోర్టు అనుమతి ఇచ్చినా రైతుల సభకు వెళ్లకుండా ప్రజలను అడ్డుకోవడం, ప్రతిపక్ష నేతల్ని అరెస్టు చేయడం నియంత పాలనకు నిదర్శనమని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాజధాని రైతుల బహిరంగ సభ …
Read More »మగబిడ్డకు జన్మనిచ్చిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె భర్త భార్గవ్ రామ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అఖిలప్రియ తల్లి శోభనాగిరెడ్డి జయంతి రోజునే బాబు పుట్టడంతో భూమా కుటుంబం సంబరాలు చేసుకుంటోంది. శోభనాగిరెడ్డి మరణంతో అఖిలప్రియ రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరారు. ఆ తర్వాత మంత్రి …
Read More »వైసీపీకి బాబు సవాల్
ఏపీ ‘‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సీఎం జగన్‌రెడ్డి తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించాలి. వైసీపీ తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తే మేం కూడా మా ఎంపీలతో రాజీనామా చేయిస్తాం’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. తమకు రాష్ట్ర ప్రజలు పాతిక మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానని ఎన్నికల ముందు చెప్పిన జగన్ ఇప్పుడు ఎందుకు కిక్కురునమనడం …
Read More »నిజానికి కౌరవసభ టీడీపీ హయాంలోనే జరిగింది
Ap అసెంబ్లీలో చర్చించడానికి ప్రతిపక్షం వద్ద ఏ అంశాలు లేక దురుద్దేశంతో వ్యవహరించిందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీని కౌరవ సభ అని చంద్రబాబు వెళ్లిపోయారని విమర్శించారు. నిజానికి కౌరవసభ టీడీపీ హయాంలోనే జరిగిందని మండిపడ్డారు. సభలో బీసీలు, మైనారిటీల అంశాలతో పాటు వరద నష్టంపై చర్చించినట్లు పేర్కొన్నారు. సీఎం జగన్ కూడా ఓపిగ్గా సమాధానాలు చెప్పారని పేర్కొన్నారు.
Read More »వరదల్లో చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.5లక్షలు.. ఒకరికి ఉద్యోగం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరదల్లో చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షలతో పాటు.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులు 100 శాతం పూర్తి చేశామని వెల్లడించారు. ముఖ్య మంత్రి ఆదేశాల మేరకు పంట నష్టం నివేదికలను పూర్తి చేసి బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.
Read More »