ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి గత ఏడాదిన్నర కాలంగా తన ఫామ్ కోసం తంటాలు పడుతున్నాడు. ఈ కాలంలో ఏ ఫార్మాట్‌లోనూ సెంచరీ చేయలేదు. అయితే ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ తరఫున ఓపెనర్‌గా వస్తుండటంతో టీ20ల్లో మెల్లగా ఫామ్‌లోకి వస్తున్నాడు. ఈ మధ్యే రెండు వరుస హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే అతని ఐపీఎల్ ఫామ్ ఇండియన్ టీమ్‌కు కూడా గుడ్ న్యూసే అంటున్నాడు మాజీ …
Read More »RCB పై KKR ఘనవిజయం
రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూర్ ,కోలకత్తా నైట్ రైడర్స్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ క ఘన విజయం సాధించింది. 93 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే 9వికెట్ల తేడాతో ఛేదించింది. కోల్ కత్తా జట్టులో శుభ్మన్ గిల్ 48(34బంతులు), వెంకటేశ్ అయ్యర్ 41 (27 బంతులు) రాణించారు. ఆఖర్లో గిలు ఔట్ చేసినా కేకేఆర్ విజయాన్ని కోహ్లి సేన అడ్డుకోలేకపోయింది. బెంగళూరు బౌలర్ చాహల్క ఒక …
Read More »జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎస్ శరత్
తమిళనాడు మాజీ కెప్టెన్ ఎస్ శరత్ బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యాడు. దేశవాళీ సీజన్ ప్రారంభానికి వారం రోజుల ముందు బోర్డు శుక్రవారం జూనియర్ సెలెక్షన్ కమిటీని ఎంపిక చేసింది. ఐదుగురు సభ్యుల కమిటీకి శరత్ (సౌత్ జోన్) చైర్మన్‌గా వ్యవహరించనుండగా.. కిషన్ మోమన్ (నార్త్ జోన్), రణదేవ్ బోస్ (ఈస్ట్ జోన్), పతీక్ పటేల్ (వెస్ట్ జోన్), హర్విందర్‌సింగ్ సోధి (సెంట్రల్) ఒక్కో జోన్ నుంచి …
Read More »టీమిండియా తర్వాత కోచ్ అనిల్ కుంబ్లే
T20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా కోచ్ పదవి నుంచి తప్పుకుంటానని రవిశాస్త్రి మరోసారి స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో కోచ్ గా బాధ్యతలు చేపట్టాలని అనిల్ కుంబ్లేను BCCI సంప్రదించిందట. గతంలో కుంబ్లే కోచ్గా పనిచేశాడు. కోహ్లితో విభేదాల కారణంగా తప్పుకున్నాడు. ప్రస్తుతం IPLలో PBKS కోచ్ ఉన్నాడు. కుంబ్లే తో పాటు కోచ్గా లక్ష్మణ్ను సంప్రదించిందట. బౌలింగ్ కోచ్గా జహీర్ ఖాన్ గురించి BCCI ఆలోచన చేస్తోందట.
Read More »రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్థానంలో భారత జట్టు T20 కెప్టెన్సీ అందుకోవడానికి రోహిత్ శర్మ అర్హుడని మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ చెప్పారు. ‘కోహ్లి కెప్టెన్గా వైదొలగడం ఊహించిందే. రోహిత్క నాయకత్వం వహించే అవకాశం వచ్చిన ప్రతిసారీ అతడు ఆకట్టుకున్నాడు. అంచనాలను అందుకున్నాడు. 2018లో రోహిత్ సారథ్యంలో భారత జట్టు ఆసియాకప్ గెలిచింది. IPLలో ముంబై ఇండియన్స్ను గొప్పగా ముందుకు నడిపిస్తున్నాడు’ అని దిలీప్ అన్నారు.
Read More »భారత్ కెప్టెన్ గా రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ అనంతరం కెప్టెన్సీ బాధ్యతలను రోహితక్కు అప్పగించనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై విరాట్ కోహ్లి త్వరలో స్వయంగా ప్రకటన చేస్తాడని చెప్పాయి. తన బ్యాటింగ్పై దృష్టి సారించేందుకే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read More »భారత్ – ఇంగ్లండ్ చివరి టెస్టు వాయిదా
భారత్ – ఇంగ్లండ్ చివరి టెస్టు వాయిదా పడింది. టెస్టు మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. భారత క్రికెట్ జట్టు శిక్షణ సిబ్బందికి కరోనా సోకడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మ్యాచ్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆటగాళ్లతో పాటు జట్టు సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం కరోనా పరీక్షల ఫలితాలు వచ్చాకే మ్యాచ్‌పై నిర్ణయం తీసుకుంటామని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
Read More »టీమ్‌ఇండియా మరో అద్భుత విజయం
పనైపోయిందన్న ప్రతీసారి తిరిగి పుంజుకుని సత్తాచాటడాన్ని అలవాటుగా మార్చుకున్న టీమ్‌ఇండియా మరో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. లార్డ్స్‌లో అద్వితీయ విజయం తర్వాత.. లీడ్స్‌లో ఇన్నింగ్స్ పరాజయం చవిచూసిన భారత జట్టు.. ఓవల్‌లో గోడకు కొట్టిన బంతిలా విజృంభించింది. బ్యాట్స్‌మెన్ ప్రతాపానికి.. బౌలర్ల సహకారం తోడవడంతో సోమవారం ముగిసిన నాలుగో టెస్టులో కోహ్లీసేన 157 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్‌ఇండియా 2-1తో …
Read More »భారత బ్యాటింగ్ తీరు మారలేదు
మూడో టెస్టులో ఘోర పరాజయం ఎదురైనా భారత బ్యాటింగ్ తీరు మారలేదు. లోపాలను సరిదిద్దుకోలేని స్థితిలో బ్యాట్స్‌మెన్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. చివర్లో శార్దూల్ ఠాకూర్ (36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 57) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడకపోయుంటే జట్టు కనీసం 150 పరుగులైనా చేసేది కాదు. ఉమేశ్ (10)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు అతడు జత చేసిన 63 పరుగులే జట్టు ఇన్నింగ్స్‌లో అత్యధికం. అయితే భారత …
Read More »ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు
ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి.. కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నది. 1980 తర్వాత ఒలింపిక్స్ పతకాన్ని సాధించింది. ఆ సంవత్సరంలో స్వర్ణ పతకం గెలువగా.. ఆ తర్వాత పతకం గెలువడం ఇదే తొలిసారి. బుధవారం జర్మనీతో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. బలమైన ప్రత్యర్థిని భారత్ 5-4 తేడాతో చిత్తు చేసింది. 41 సంవత్సరాల సుధీర్ఘ …
Read More »