Home / Tag Archives: techonology (page 2)

Tag Archives: techonology

బీహెచ్‌ఈఎల్‌ లో ఉద్యోగాలు

ప్రభుత్వరంగ సంస్థ భారత్‌ హెవీ ఎలక్ట్రికల్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) సివిల్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 22 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో సివిల్‌ విభాగంలో ఇంజినీర్లు, సూపర్‌వైజర్‌ పోస్టులు ఉన్నాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈనెల 24 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ పోస్టులను నిర్ణీత కాల వ్యవధికి భర్తీ చేయనున్నారు. మొత్తం …

Read More »

భార‌తీ ఎయిర్‌టెల్‌కు గ‌ట్టి షాక్

దేశంలోని టెలికం ప్రొవైడ‌ర్ భార‌తీ ఎయిర్‌టెల్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. గ‌త మే నెల‌లో భార‌తీ ఎయిర్‌టెల్‌తోపాటు వొడాఫోన్ ఐడియా భారీగా స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను కోల్పోయాయి. టెలికం సెన్సేష‌న్ రిల‌య‌న్స్ జియో మాత్రం గ‌త మే నెల‌లో 35.5 ల‌క్ష‌ల స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను జ‌త చేసుకున్న‌ది. మ‌రోవైపు భార‌తీ ఎయిర్ టెల్ 43.16 ల‌క్ష‌ల యూజ‌ర్ల‌ను కోల్పోయింది. గ‌తేడాది జూన్ త‌ర్వాత ఎయిర్ టెల్ ఇంత భారీ సంఖ్య‌లో స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను కోల్పోవ‌డం ఇదే …

Read More »

నైట్ టైంలో ఫోన్ వాడుతున్నారా?

నైట్ టైంలో ఫోన్ వాడుతున్నారా? ఎక్కువగా ఫోన్ వాడటం అనేక అనర్థాలకు కారణమని తెలిసినా అర్ధరాత్రి వరకూ ఫోన్ వాడుతుంటారు చాలామంది. రాత్రి లైట్ తీసేసిన తరువాత కూడా ఫోన్లో తల దూరిస్తే.. ప్రమాదమంటున్నారు నిపుణులు. సరైన లైటింగ్ లేదు కాబట్టి కళ్లు ఫోన్ వల్ల ఎక్కువ స్ట్రెయిన్ అవుతాయి. దీంతో నెమ్మదిగా కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి. ఫోన్లోని UV కిరణాలు ముఖంపై పడి.. స్కిన్ ట్యాన్తో …

Read More »

ఐఫోన్ 13 ఫీచర్స్ ఇవే..?

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఆపిల్ ఈ ఏడాది చివరికల్లా ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 13 స్పెషల్ వైర్లెస్ ఛార్జింగ్తో రానుందట. పోర్టెయిట్ వీడియో ఫీచర్ ఉంటుందట. ఇక ఐఫోన్ 13 సెప్టెంబర్లో లాంచ్ అవ్వనుందని తెలుస్తోంది. ఐఫోన్ 13 వస్తోన్న నేపథ్యంలో.. ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఐఫోన్ 12 బేసిక్ మోడల్పై సుమారు రూ.9000 …

Read More »

విప్రో కంపెనీ ఉద్యోగులకు బంఫర్ ఆఫర్

ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ అయిన విప్రో కంపెనీ ఉద్యోగులకు ఈ ఏడాది రెండోసారి జీతం పెరగనుంది. జూనియర్ ఉద్యోగులకు జీతాలను పెంచుతున్నామని.. బ్యాండ్ B3 ఉద్యోగుల (అసిస్టెంట్ మేనేజర్ మరియు దిగువస్థాయి)కు పెరిగే జీతాలు సెప్టెంబర్ 1 నుంచి అమలవుతాయని సంస్థ తెలిపింది. 2021 జనవరిలోనే ఒకసారి వీరి జీతాలు పెరగ్గా.. తాజాగా మళ్లీ పెరగనున్నాయి. మొత్తం కంపెనీ ఉద్యోగుల్లో బ్యాండ్ B3 కేటగిరీ వారు 80శాతం వరకు …

Read More »

మైక్రోసాఫ్ట్ కొత్త చైర్మ‌న్‌గా స‌త్య నాదెళ్ల‌

ఇన్నాళ్లూ మైక్రోసాఫ్ట్ కార్ప్ సీఈవోగా ఉన్న స‌త్య నాదెళ్ల‌ను కొత్త చైర్మ‌న్‌గా ప్ర‌క‌టించింది ఆ సంస్థ‌. ఇన్నాళ్లూ ఆ స్థానంలో ఉన్న జాన్ థాంప్స‌న్‌ను త‌ప్పించి నాదెళ్ల‌కు ఆ ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డం విశేషం. 2014లో కంపెనీ సీఈవో అయిన త‌ర్వాత మైక్రోసాఫ్ట్ బిజినెస్ బాగా వృద్ధి చెందింది. ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే లింక్డిన్‌, న్యువాన్స్ క‌మ్యూనికేష‌న్స్‌, జెనిమ్యాక్స్‌లాంటి కంపెనీల‌ను మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకుంది. 2014లో బిల్ గేట్స్ నుంచి చైర్మ‌న్ ప‌ద‌విని …

Read More »

ట్విట్టర్ కు షాక్

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్ మన దేశంలో చట్టపరమైన రక్షణను కోల్పోయినట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా బుధవారం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఇన్మర్మేషన్ టెక్నాలజీ నిబంధనలను పాటించకపోవడంతో ట్విటర్‌కు చట్టపరమైన రక్షణను తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో ట్విటర్ ఇకపై తటస్థ, మధ్యవర్తిత్వ వేదిక కాదని, ఇది డిజిటల్ న్యూస్ పబ్లిషర్‌గా ఉంటుందని సమాచారం.  జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, కొత్త ఐటీ నిబంధనల ప్రకారం …

Read More »

రేపటి నుండి FB,Twitter,Instagram,Whatsapp పని చేయవా..?

ఇండియాలో రేపట్నుంచి FB, ట్విట్టర్, ఇన్స్టాలు బ్లాక్ కాబోతున్నాయని కొన్ని ప్రభుత్వ వర్గాల సమాచారం. డిజిటల్ కంటెట్స్పై కోడ్ ఆఫ్ ఎథిక్స్, ఫిర్యాదుల పరిష్కారానికి ఫ్రేమ్వర్క్ రూల్స్తో పాటు కొత్త నిబంధనలు రేపట్నుంచి అమల్లోకి రానున్నాయి. FEBలోనే వీటితోపాటు న్యూస్ సైట్స్, OTTల కోసం కేంద్రం రూల్స్ విడుదల చేసి.. మే 25 వరకు అమలు చేసుకునేలా గడువిచ్చింది. ఇప్పటివరకు ‘కూ ‘సైట్ మాత్రమే వీటిని పాటించింది.

Read More »

మీ పేరుపై ఎన్ని ఫోన్‌ నంబర్లున్నాయో తెలుసుకోండి ఇలా..?

మనకు తెలియకుండానే మన పేరు మీద ఎన్ని ఫోన్‌ నంబర్లున్నాయో తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను విజయవాడ టెలికాం విభాగం(డీవోటీ) రూపొందించి సోమవారం ప్రారంభించింది. http://tafcop.dgtelecom.gov.in అనే వెబ్‌సైట్‌లో మొబైల్‌ నంబరు.. దానికి వచ్చే ఓటీపీ నమోదు చేయగానే మన పేరుమీద ఉన్న ఫోన్‌ నంబర్ల వివరాలన్నీ వస్తాయి. వాటిలో మనకు అవసరం లేనివి, మనకు తెలియకుండా మన పేరుమీద ఉన్న వాటిని సెలక్ట్‌ చేసి సబ్మిట్‌ చేస్తే.. టెలికం శాఖ …

Read More »

వాట్సప్ ఆడియో వీడియో కాల్స్ కి ఎంత డేటా అవుతుందో తెలుసా..?

వాట్సప్ కాల్ వీడియో అయినా, ఆడియో అయినా ఫ్రీ అనే విషయం అందరికీ తెలుసు. అయితే, వీటికి ఎంత డాటా పోతుందనే విషయంపై చాలా మందికి అవగాహన లేదు. సుమారుగా ఒక గంటసేపు వాట్సప్ కాల్ మాట్లాడితే దాదాపుగా 740KB డాటా ఖర్చు అవుతుందని ఇటీవలే ఆండ్రాయిడ్ అథారిటీ వెల్లడించింది. ఇక, వాట్సప్ లో ఒకేసారి ఎనిమిది మంది వ్యక్తులు వీడియో లేదా ఆడియో ద్వారా గ్రూప్ కాల్ మాట్లాడుకోవచ్చు

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar