మీరు ఫోన్ పోగొట్టుకున్నప్పుడు ఏం చేయాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారా..?. చాలా విలువైన సమాచారంతో పాటు అత్యంత ఖరీదైన ఎంతో ఇష్టంగా కొనుక్కున్న మొబైల్ పోయిందని తెగ హైరాన పడుతున్నారా..?.ఇది మీకోసమే.
అయితే ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు మనలో చాలామంది చేసే మొదటి పని దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయడం లేదా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్లడం. ఇదే కాకుండా… httpr://cybercrime.gov.inలో జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో నమోదు చేయవచ్చు.
సైబర్ క్రైమ్ ఫిర్యాదును నమోదు చేయడానికి సంబంధిత కాల్ సెంటర్ నంబర్ 155260 (ఇప్పుడు 1930కి మార్చబడింది)కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయచ్చు. భారతీయ టెలికాం డిపార్ట్మెంట్ httpr://ceir.gov.inలో సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న ఫోన్ను నేరుగా బ్లాక్ చేయవచ్చు, ట్రాక్ చేయవచ్చు.