Home / Tag Archives: telangana cm

Tag Archives: telangana cm

దుబ్బాకలో మంచి చెడుకు మేమే నిలబడతాం

‘‘మీ ప్రభుత్వంలో మంత్రిగా ఉండగా ఏనాడైనా దుబ్బాక రైతాంగం గురించి మాట్లాడారా? తెలంగాణ ఉద్యమంలో  పాల్గొన్న ప్రజలను జైల్లో వేస్తే ఎప్పుడైనా విడిపించారా? దుబ్బాకలో ఎన్నో కేసులు నమోదైతే వచ్చి వారి పక్షాన నిలబడ్డారా? మంచిచెడుకు నిలబడేదే మేము.. దుబ్బాక ప్రజల కష్టసుఖాల్లో నిలబడ్డాం. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి..! మీరొచ్చి ఎవరి తలపుండు కడుగుతారో సమాధానం చెప్పాలి’’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇక్కడ చదువుకున్న బిడ్డగా సీఎం కేసీఆర్‌కు ఉన్న  …

Read More »

హరిత ప్రేమికుడు కేసీఆర్‌

దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రీన్‌ బడ్జెట్‌ సీఎం దార్శనికతవల్లే ఉద్యమంలా హరితహారం రాష్ట్రంలో 29 శాతానికి పెరిగిన అటవీ విస్తీర్ణం అసెంబ్లీలో ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్‌ వంటి హరితప్రేమికులు ప్రపంచంలోనే లేరని, దేశంలో ఎక్కడా లేనివిధంగా బడ్జెట్‌లో 10 శాతాన్ని పచ్చదనం పెంపుకోసం కేటాయించడమే ఇందుకు నిదర్శనమని ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం అర్బన్‌ …

Read More »

తెలంగాణలో విప్లవాత్మక ప్రజా చట్టం

తెలంగాణ రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టం అన్నది ఆరంభం మాత్రమేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. అన్ని వర్గాలవారికి భూ సంబంధిత ఇబ్బందులు తొలిగించేలా దశలవారీగా మరిన్ని మెరుగైన విధానాలను తీసుకొని రానున్నామని శుక్రవారం శాసనసభ వేదికగా ప్రకటించారు. శతాబ్దాలుగా ఉన్న భూముల సమస్యలకు సమగ్ర డిజిటల్‌ సర్వే ఉత్తమ పరిష్కారమని పేర్కొన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో వీలైనంత త్వరగా రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్‌ సర్వే చేస్తామని చెప్పారు. రికార్డులన్నీ పలు సర్వర్ల …

Read More »

అసెంబ్లీ వ‌ర్షాకాల‌ స‌మావేశాలు ప్రారంభం

‌తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభం అయ్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లిని చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప్రారంభించారు. ఇటీవల మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డికి స‌భ నివాళుల‌ర్పించింది. వారి సేవ‌ల‌ను స‌భ్యులు గుర్తు చేశారు. కొవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో స‌భ్యుల‌తో పాటు అసెంబ్లీ సిబ్బంది భౌతిక దూరం పాటిస్తూ, విధిగా మాస్కు ధ‌రించారు. కరోనా …

Read More »

BRK భవన్ కార్యాలయంలో మంత్రి కొప్పుల సమీక్షా సమావేశం

హైద్రాబాద్ లో ENC అధికారి వెంకటేశ్వర్లు గారితో ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకం కాళేశ్వరం లిక్ -2 కాలువ పంప్ హౌస్ నిర్మాణ డిజైన్ మార్పులపై సమీక్షా సమావేశం నిర్వహించిన – మంత్రి కొప్పుల ఈశ్వర్* ఈ హైద్రాబాద్ BRK భవన్ కార్యాలయంలో జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలం ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకం కాళేశ్వరం లిక్ -2 నిర్మాణానికి భూసర్వే లో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగేలా …

Read More »

ప్రధాని మోదీ కంటే సీఎం కేసీఆర్ భేష్

 లాక్‌డౌన్ మరో రెండు, మూడు వారాలు పొడిగించాలని రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. కరోనా మహమ్మారిని పకడ్బందీగా ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అద్భుతంగా పనిచేస్తున్నారని తెలంగాణ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. మే 7వ తేదీ తర్వాత తెలంగాణలో లాక్‌డౌన్‌ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో కరోనాను పూర్తిస్థాయిలో అంతం చేసేందుకు  రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగించాలా? వద్దా? అని ప్రముఖ న్యూస్‌ ఛానల్‌ సర్వే నిర్వహించింది. ఏప్రిల్‌ 29 నుంచి …

Read More »

కరోనా వ్యాప్తి నిరోధానికి ఇదే స్ఫూర్తి కొనసాగాలి

కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రస్తుతం అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ను ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. వైరస్‌ సోకినవారికి చికిత్స అందించడంతోపాటు వారితో కలిసినవారిని గుర్తించి, క్వారంటైన్‌ చేసే ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. లాక్‌డౌన్‌ కారణంగా నిత్యావసరాలకు కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వరికోతలు, ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లు యథావిధిగా కొనసాగించాలని సూచించారు. కరోనా బాధితులకు అందుతున్న చికిత్స, లాక్‌డౌన్‌ అమలు, వ్యవసాయ …

Read More »

వైద్యుడికి అండగా

రాష్ట్రంలో కరోనావ్యాప్తి నివారణకు చేస్తున్న కృషిని మరింత అంకితభావంతో కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. రోగులకు వైద్యం అందిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పారు. వ్యాధి లక్షణాలున్న ఏ ఒక్కరినీ వదులకుండా పరీక్షలు నిర్వహించి, వైద్యంచేస్తామని, వ్యాధి సోకినవారిని కలిసిన ప్రతి ఒక్కరినీ గుర్తించి క్వారంటైన్‌ చేస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా రాష్టంలో లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ వరికోతలకు, ధాన్యం సేకరణకు ఎలాంటి …

Read More »

కరోనాను నివారిద్దాం

ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో మాసాబ్‌ట్యాంక్‌లోని పశు సంవర్థక శాఖ డైరెక్టర్‌ కార్యాలయంలోని తన ఛాంబర్‌ నుంచి మంత్రి తలసాని బుధవారం టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వం ఆమలు చేస్తున్న కార్యక్రమాల ఆమలు తీరుపై మంత్రి సమీక్షించారు. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని గుర్తించి …

Read More »

దేశానికి దిక్సూచిగా నిలిచిన కేసీఆర్ నాయకత్వం

వలస కూలీలను తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములుగా పేర్కొంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన, కరోనా నేపథ్యంలో వారి ఆకలి తీర్చడానికి చేస్తున్న ప్రయత్నాల పట్ల దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. పలువురు రాజకీయ, సినీ, మీడియా ప్రముఖులు ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ సోషల్ మీడియాలో సందేశాలు పెట్టారు. సంక్షోభ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రజల హృదయాలను గెలుచుకున్నారు అని …

Read More »