గత ఎన్నికల సందర్భంగా రూ. లక్ష లోపు రుణాలున్న రైతులకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే రూ. 25 వేల లోపు ఉన్న రుణాలను మాఫీ చేశామని తెలిపారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో మిగతా రుణాలను మాఫీ చేయడంలో కొంత ఆలస్యం జరిగిందన్నారు. త్వరలోనే ఈ రుణాలను మాఫీ …
Read More »తెలంగాణ బడ్జెట్ 2021-22- మెట్రో రైలు ప్రాజెక్టు కోసం రూ. 1000 కోట్లు
తెలంగాణ రాష్ర్ట రాజధాని హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రచించి అమలు చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఇప్పటికే అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్‌కు తాజా బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. ఇప్పటికే నగర వ్యాప్తంగా 9 ఫ్లై ఓవర్లు, 4 అండర్ పాస్‌లు, 3 ఆర్‌వోబీలను పూర్తి చేసుకున్నామని మంత్రి తెలిపారు. కరోనా లాక్‌డౌన్‌లో రూ. 2 వేల కోట్ల విలువైన ఫ్లై ఓవర్లు, 300 …
Read More »తెలంగాణ బడ్జెట్ 2021-22-వ్యవసాయ రంగానికి పెద్దపీట
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. బడ్జెట్ 2021 కేటాయింపుల్లో వ్యవసాయ రంగానికి రూ. 25 వేల కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు.కరోనా ప్రభావాన్ని తట్టుకొని నిలబడిన ఒకే ఒక్క రంగం వ్యవసాయం అని పేర్కొన్నారు. రాష్ర్టం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో తీసుకున్న ఉద్దీపన చర్యల వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా.. నేడు …
Read More »రేషన్ కార్డులు గణనీయంగా పెంచాం : సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డులు గణనీయంగా పెంచామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. రేషన్ కార్డులు పెంచలేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడటం సరికాదన్నారు. కొత్తగా ఆయన సభకు వచ్చారు. రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పారు. అది సరికాదు. 2014 కంటే ముందు 29 లక్షల …
Read More »కరోనాపై కన్నేసి ఉంచాం : సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ర్టంలో కరోనా వ్యాప్తిపై కన్నేసి ఉంచామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. సభ్యులు సూచించిన అనేక అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. గత వారం రోజుల నుంచి రాష్ర్టంలో కరోనా పెరుగుదల కనిపిస్తుంది. కరోనా వ్యాప్తిపై కన్నేసి ఉంచాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. …
Read More »ముందంజలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు
ముందంజలో కొనసాగుతున్న తెరాస అభ్యర్థులుపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానం ఓట్ల లెక్కింపు రెండో రౌండ్‌లో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 3,787 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 15,857 ఓట్లు రాగా.. తీన్మార్ మల్లన్నకు 12,070 ఓట్లు వచ్చాయి. కోదండరాంకు 9,448 ఓట్లు, ప్రేమేందర్‌రెడ్డికి 6,669 ఓట్లు, రాములు నాయక్ (కాంగ్రెస్)కు 3,244 ఓట్లు పోలయ్యాయి.హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో మొదటి రౌండ్ ఫలితాలు …
Read More »అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి హరీశ్‌రావు
2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు గురువారం 11:30 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అలాగే శాసన మండలిలో రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు. కరోనా నేపథ్యంలో బడ్జెట్ కేటాయింపులపై ఆసక్తి నెలకొంది. గతేడాదికంటే మెరుగైన బడ్జెట్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Read More »ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల చిరకాల వాంఛ నెరవేరుతోంది.
ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల చిరకాల వాంఛ నెరవేరుతోంది.వారి కష్టాలు తొలగి పోనున్నాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆమోదం లభించడంతో వారు త్వరలో స్వరాష్ట్రం తెలంగాణకు చేరను న్నారు.ప్రాంత ఉద్యోగులను తెలంగాణకు రప్పించే కసరత్తు వేగవంతమైంది.ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు తెలంగాణ సీఎస్ సోమేష్‌కుమార్ లేఖ రాసి తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు పంపించాలని కోరారు.ఈ లేఖకు సానుకూలంగా స్పందించిన ఏపీ సీఎస్ ఉద్యోగుల తిరిగి పంపించే అంశంపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.తెలంగాణ …
Read More »ఖమ్మంలో రెండో ఐటీ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో ఖమ్మం జిల్లాలో రెండో ఐటీ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ మేరకు మంగళవారం పరిపాలన అనుమతులు జారీ చేసింది. రూ.36కోట్ల వ్యయంతో 55వేల చదరపు అడుగుల్లో టవర్‌ను నిర్మించనున్నారు. ప్రత్యక్షంగా 570 మంది ఒకేసారి పని చేసుకునేలా సువిశాలమైన భవన నిర్మాణం చేపట్టనున్నారు. ఖమ్మంలోని ఇల్లందు సర్కిల్ వద్ద ప్రస్తుతం ఐటీ హబ్-1 ఇప్పటికే ప్రారంభించగా.. సేవలు నిర్విరామంగా సాగుతున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ కృషితో తాజాగా …
Read More »కామారెడ్డి జిల్లాలో కరోనా కలవరం
తెలంగాణలో కామారెడ్డి జిల్లా కేంద్రం పరిధిలోని టేక్రియాల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలకు చెందిన 32 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పాఠశాలలోని ఆరుగురు టీచర్లకు కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. పాఠశాల విద్యార్థినులకూ పరీక్షలు నిర్వహించగా 32 మందికి పాజిటివ్ వచ్చింది. కానీ విద్యార్థినుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి …
Read More »