హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఫ్యాన్సీ నంబర్ల కోసం నిర్వహించిన ఆన్‌లైన్ వేలానికి భారీ స్పందన వచ్చింది. తమకు నచ్చిన నంబర్ కోసం భారీ మొత్తంలో వెచ్చించేందుకు వెహికల్ ఓనర్లు ఏ మాత్రం వెనుకాడలేదు. TS 09 FV 9999 నంబర్ కోసం రాజశేఖర్‌రెడ్డి అనే వ్యక్తి పోటీపడి రూ.4,49,999 లక్షలు వెచ్చించి దాన్ని సొంతం చేసుకున్నారు. TS 09 FW 0001 నంబర్ కోసం శ్రీనిధి ఎస్టేట్స్ సంస్థ …
Read More »హైదరాబాద్ ప్రజలకు ఇది శుభకార్యం..కేసీఆర్‌కు రుణపడి ఉంటాం: కేటీఆర్
ఓఆర్‌ఆర్ మాత్రమే కాదని.. ఆర్‌ఆర్‌ఆర్ వచ్చినా అక్కడి వరకు నీళ్లు అందించేలా సుంకిశాల ప్రాజెక్టు డిజైన్ రూపొందించామని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. రాబోయే వందేళ్లను దృష్టిలో ఉంచుకుని దీని నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. నల్గొండ జిల్లా సుంకిశాల వద్ద ఇన్‌టేక్‌వెల్ ప్రాజెక్టుకు మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులతో కలిసి కేటీఆర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన …
Read More »అమిత్‌షా పర్యటన.. కేటీఆర్ బహిరంగ లేఖ
తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంపై వివక్ష కొనసాగుతూనే ఉందని ఆరోపించారు. రేపు తెలంగాణలో కేంద్రహోంమంత్రి పర్యటన నేపథ్యంలో కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 8 ఏళ్లు గడిచినా తెలంగాణపై అదే వివక్ష కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఏపీ పునర్విభజన చట్టంలోని ఒక్కహామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ …
Read More »కర్ణాటకలో ఆ ప్రాజెక్టుల పర్మిషన్ నిలిపేయండి: తెలంగాణ అభ్యంతరం
అంతర్రాష్ట్ర అంశాలు, ట్రైబ్యునల్ గతంలో ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకోకుండా కర్ణాటకలోని ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వొద్దని కేంద్రం జలసంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. కర్ణాటకలో చేపడుతున్న అప్పర్‌తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టుల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ రెండు ప్రాజెక్టులకు ఇచ్చిన పర్మిషన్‌ను నిలిపివేయాలని విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు తెలంగాణ ఇంజినీర్ ఇన్‌చీఫ్ (ఈఎన్‌సీ) మురళీధర్ లేఖ రాశారు. కర్ణాటకకు అనుమతిస్తే తుంగభద్ర నుంచి కృష్ణాకు …
Read More »టీఆర్‌ఎస్‌కు ప్రజలే హైకమాండ్: హరీశ్‌రావు
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రూ. 2,500 కోట్లు ఇస్తే వస్తుందటని.. ఈ మాట కర్ణాటక బీజేపీ ఎంపీనే చెప్తున్నాడని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నాయని మంత్రి విమర్శించారు. ఒక పార్టీలో ఓటుకు నోటు.. మరో పార్టీలో సీఎం సీటుకు నోటు పంచాయితీ ఉందని ఎద్దేవా చేశారు. జయశంకర్ భూపాలపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాన చేసిన అనంతరం నిర్వహించిన …
Read More »మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ పథకాలేవీ?: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా ఉందంటూ బీజేపీ నేతలు తమ పాదయాత్రలో చెప్తున్నారని.. అలాంటప్పుడు ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి పథకాలు ఉండాలని కదా? అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. నారాయణపేటలో సుమారు రూ.90కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాలకు మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఉత్తమ పంచాయతీలుగా తెలంగాణ గ్రామాలే …
Read More »రాజకీయ లబ్ధి కోసం యాదాద్రిపై విమర్శలా?: ఇంద్రకరణ్‌రెడ్డి
యాదాద్రిలో సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించాను. భక్తుల సౌకర్యాలపై దేవాదాయ శాఖ, ఆర్‌అండ్‌బీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. క్యూకాంప్లెక్స్‌లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడటం.. వాష్ రూమ్స్‌లో సౌకర్యాలు, చలువ పందిళ్లు తదితర అంశాలపై చర్చించారు. రాజకీయ లబ్ధి కోసం యాదాద్రిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. చిన్నచిన్న సమస్యలను కూడా పెద్దవి చేసి చూపెట్టే ప్రయత్నాలు …
Read More »వచ్చే ఐదేళ్లలో వరంగల్ జిల్లాలో 50వేల ఐటీ ఉద్యోగాలు: కేటీఆర్
వరంగల్‌ను టెక్స్‌టైల్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో మరో ముందడుగు పడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో నిర్మించే ప్రఖ్యాత కంపెనీ కిటెక్స్ వస్త్ర పరిశ్రమకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాబోయే రెండేళ్లలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో పరిశ్రమల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు. టెక్స్‌టైల్ పార్కులో 20వేల మందికి ఉపాధికి లభించనుందని.. వారిలో అధికంగా …
Read More »వ్యవసాయంపై రాహుల్‌గాంధీకి అవగాహన ఉందా?: వినోద్ కుమార్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వ్యవసాయంపై కనీస అవగాహనైనా ఉందా అని మాజీ ఎంపీ, తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బి.వినోద్‌కుమార్ ప్రశ్నించారు. వరంగల్‌లో రేపు రాహుల్ ప్రకటించనున్న వ్యవసాయ విధానం రాష్ట్రానికా? దేశానికా? అని నిలదీశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వినోద్ మాట్లాడారు. రాష్ట్రంలో పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ విధానం దేశంలోని …
Read More »యాదాద్రిలో కారు పార్కింగ్ ఫీజు నిబంధనల్లో మార్పు
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తుల కారు పార్కింగ్ ఫీజుపై అధికారులు సవరణ చేశారు. కొండపై వాహనాల పార్కింగ్ రూ.500 చొప్పున.. ఆపై ప్రతి గంటకు రూ.100 చొప్పున ఫీజు వసూలు చేస్తామని ఇటీవల ఆలయ ఈవో గీత ప్రకటించారు. అయితే ఆ నిబంధనలో స్వల్ప మార్పు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి గంటకు రూ.100 చొప్పున వసూలు చేయాబోమని.. ఆ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో …
Read More »