Breaking News
Home / POLITICS / హైదరాబాద్‌ ప్రజలకు ఇది శుభకార్యం..కేసీఆర్‌కు రుణపడి ఉంటాం: కేటీఆర్‌

హైదరాబాద్‌ ప్రజలకు ఇది శుభకార్యం..కేసీఆర్‌కు రుణపడి ఉంటాం: కేటీఆర్‌

ఓఆర్‌ఆర్‌ మాత్రమే కాదని.. ఆర్‌ఆర్‌ఆర్‌ వచ్చినా అక్కడి వరకు నీళ్లు అందించేలా సుంకిశాల ప్రాజెక్టు డిజైన్‌ రూపొందించామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాబోయే వందేళ్లను దృష్టిలో ఉంచుకుని దీని నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. నల్గొండ జిల్లా సుంకిశాల వద్ద ఇన్‌టేక్‌వెల్‌ ప్రాజెక్టుకు మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులతో కలిసి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న హైదరాబాద్‌ జనాభాకు ఈ ప్రాజెక్టు శంకుస్థాపన ఓ శుభకార్యమని చెప్పారు.

నగరం ఎంత విస్తరించినా రాబోయే జనరేషన్లకు నీటికొరత లేకుండా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని కేటీఆర్‌ అన్నారు. గతంలో హైదరాబాద్‌లో నీటి కోసం రెండు మూడు రోజులకు ఒకసారి నీరు వచ్చేదని గుర్తుచేశారు. కోట్లమంది ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే రూ.1,450కోట్లతో సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామని కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ ప్రజలు, ప్రజాప్రతినిధులం సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని చెప్పారు. 2072 వరకు నగర ప్రజలకు నీటి ఇబ్బందులు ఉండవన్నారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri