త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న హుజురాబాద్‌లో ఎలాగైనా గెలువాలని ప్రయత్నిస్తున్న ఈటల రాజేందర్‌కు అడుగడుగునా నిరసనల సెగ తగులుతున్నది. హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక, జమ్మికుంట మండలాల్లో ఈటల ప్రలోభాలపై స్థానికులు మండిపడ్డారు. 60 రూపాయల గడియారం ఇచ్చి ఆశ చూపుతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మికుంట మున్సిపాలిటీలోని 15వ వార్డులోని కేశవపూర్‌లో దొంగ చాటుగా ఇంటింటికి గోడ గడియారాలను పంపిణీ చేస్తుండటంతో ఆ వార్డు యువత అడ్డుకుంది. వారికి …
Read More »బర్త్‌డే సందర్భంగా మంత్రి కేటీఆర్ షాకింగ్ డిసిషన్
తెలంగాణ రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆపద్భాందవుడిలా ఆదుకుంటూ.. ఎంతో మందికి అండగా నిలుస్తున్న కేటీఆర్.. ఇప్పుడు వికలాంగులకు అండగా నిలవబోతున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా.. వంద మంది వికలాంగులకు మూడు చక్రాల ద్విచక్ర వాహనాలను అందించనున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. గతేడాది తన బర్త్‌డే సందర్భంగా కేటీఆర్.. …
Read More »రెండో విడత గొర్రెల పంపిణీకి రూ. 6 వేల కోట్లు : సీఎం కేసీఆర్
తెలంగాణలో వృత్తి జీవనం సబ్బండ వర్గాలను అనుసరించే కొనసాగుతున్నదని, కుల వృత్తులన్నీ బీసీ వర్గాలే నిర్వహిస్తున్ననేపథ్యంలో వారిని అన్ని రంగాల్లో ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచించి కార్యాచరణ చేపట్టిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అందులో భాగంగా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచి తెలంగాణ బీసీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీపై ముఖ్యమంత్రి …
Read More »ఈటలకు మంత్రి గంగుల దమ్మున్న సవాల్
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో రాజకీయ వైరమే తప్ప వ్యక్తిగత కక్ష లేదని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ‘‘ఈటలకు ప్రభుత్వం తగిన భద్రత కల్పిస్తోంది. ఈటల నిండు నూరేళ్లు బతకాలని కోరుకుంటున్నాను. మాజీ మావోయిస్టు ఏ మంత్రి పేరు చెప్పాడో ఈటల బయటపెట్టాలి. విచారణలో నా పేరు ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణకు సిద్ధంగా ఉన్నాను. హుజూరాబాద్ …
Read More »అందుకే TRSలో చేరుతున్న- కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని కాంగ్రెస్ మాజీ నేత పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం మధ్యామ్నం ఒంటి గంటకు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని ఆయన ప్రకటించారు.కొండాపూర్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కౌశిక్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు, తన మద్దతుదారుల కోరిక మేరకు.. టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నాను. …
Read More »తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ర్ట ప్రజలకు తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏడాది పొడవునా తెలంగాణ ప్రజల జీవితాల్లో ఆనందాలు నింపే పండుగలకు తొలి ఏకాదశి ఆది పండుగ అని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు శుభాలను, ఆయురారోగ్యాలను అందించాలని సీఎం ప్రార్థించారు. రాష్ర్ట వ్యాప్తంగా వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నదీ తీర ప్రాంతాల్లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Read More »పంచాయతీ సెక్రటరీలకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. నెలకు రూ.28,719 వేతనాన్ని ఖరారుచేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఇన్‌చార్జి కార్యదర్శి, కమిషనర్ రఘనందన్‌రావు సోమవారం ఆదేశాలు జారీచేశారు. ఇప్పటివరకు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు నెలకు రూ.15 వేల వేతనాన్ని చెల్లించారు. పెరిగిన వేతనం జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు లబ్ధి …
Read More »దళిత బంధు చరిత్రలో నిలిచిపోతుంది : ఎల్. రమణ
దేశంలోనే మొదటి సారిగా దళిత బంధు పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందని టీఆర్ఎస్ నేత ఎల్. రమణ అన్నారు. ఈ పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలన్న సీఎంకేసీఆర్ నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు. దళితుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు. ఈ పథకం చరిత్రలో గొప్ప మైలు రాయిగా నిలిచి పోతుందన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన నేతగా కేసీఆర్ తరతరాలకు …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద మెగా టూరిజం ప్రాజెక్టు అభివృద్ధి చేయండి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద మెగా టూరిజం ప్రాజెక్టు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. లోక్‌సభలో 377 నిబంధన కింద ఈ అంశాన్ని ఎంపీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద కొన్ని సదుపాయాలు కల్పిస్తే టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చెందుతుందన్నారు. కాళేశ్వరం ఆలయం నుంచి లక్ష్మీ బరాజ్ వరకు 22 కిలోమీటర్ల మేర బ్యాక్ వాటర్ …
Read More »ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మానవత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మానవత్వం చాటుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ఆరెపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యువకుడిని కాపాడారు. శనివారం ఆయన ఎంపీ బండా ప్రకాశ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని పరామర్శించి తిరిగి వస్తుండగా, ఆరెపల్లి వద్ద ఒక యువకుడు ప్రమాదంలో గాయపడి, రోడ్డు పక్కన పడి ఉండటం గమనించారు. వెంటనే …
Read More »