Home / SLIDER / బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ షాకింగ్ డిసిషన్

బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ షాకింగ్ డిసిషన్

తెలంగాణ  రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ మ‌రోసారి త‌న ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆపద్భాంద‌వుడిలా ఆదుకుంటూ.. ఎంతో మందికి అండ‌గా నిలుస్తున్న కేటీఆర్.. ఇప్పుడు విక‌లాంగులకు అండ‌గా నిల‌వ‌బోతున్నారు.

త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్య‌క్ర‌మంలో భాగంగా.. వంద మంది విక‌లాంగుల‌కు మూడు చ‌క్రాల ద్విచ‌క్ర వాహ‌నాల‌ను అందించ‌నున్న‌ట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు.

గ‌తేడాది త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా కేటీఆర్.. త‌న సొంత ఖ‌ర్చుల‌తో 6 అంబులెన్స్‌ల‌ను అందించారు. కేటీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు క‌లిసి 90 అంబులెన్స్‌ల‌ను అంద‌జేశారు.