Home / SLIDER / మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు షాకిచ్చిన హుజూరాబాద్ ప్రజలు

మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు షాకిచ్చిన హుజూరాబాద్ ప్రజలు

త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న హుజురాబాద్‌లో ఎలాగైనా గెలువాలని ప్రయత్నిస్తున్న ఈటల రాజేందర్‌కు అడుగడుగునా నిరసనల సెగ తగులుతున్నది. హుజురాబాద్‌ నియోజకవర్గంలోని వీణవంక, జమ్మికుంట మండలాల్లో ఈటల ప్రలోభాలపై స్థానికులు మండిపడ్డారు.

60 రూపాయ‌ల గ‌డియారం ఇచ్చి ఆశ చూపుతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జ‌మ్మికుంట మున్సిపాలిటీలోని 15వ వార్డులోని కేశ‌వపూర్‌లో దొంగ చాటుగా ఇంటింటికి గోడ‌ గడియారాల‌ను పంపిణీ చేస్తుండ‌టంతో ఆ వార్డు యువ‌త అడ్డుకుంది.

వారికి పంపిణీ చేసిన గోడ గడియారాలను న‌డి బ‌జారులో పగలగొట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. అలాగే వీణవంక మండలం ఎల్వక, చల్లూర్, కోర్కాల్ గ్రామాలలో దళిత కాలనీలో సైతం ఈటల ఫొటోతో ఉన్న గోడ గడియారాలు రోడ్డుపై పగలగొట్టారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar